By: ABP Desam | Updated at : 01 May 2022 05:18 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
తాడేపల్లిలో వృద్ధుడిపై విలేకరి దాడి
Tadepalli News : గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఓ వృద్ధుడు వ్యక్తి కాళ్లపై పడి ప్రాధేయపడుతున్ వీడియో వైరల్ అయింది. ఈ వీడియోను టీడీపీ కూడా పోస్టు చేసింది. తాడేపల్లి మండలం పోలకంపాడులో ఓ విషయంలో కోటేశ్వరరావు, నాగిరెడ్డి అనే వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ వీడియోలో వృద్ధుడు నాగిరెడ్డి కాళ్లపై పడి ప్రాధేయపడడం కనిపిస్తుంది. ఇద్దరు మహిళలు అతడ్ని ఇంట్లోకి రాకుండా అడ్డుకున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ ఘర్షణను వీడియో తీస్తున్న మహిళను అడ్డుకునేందుకు నాగిరెడ్డి ప్రయత్నించాడు. అప్పుడు ఆ మహిళ భయంతో పారిపోయిన దృశ్యాలు కూడా రికార్డు అయ్యాయి.
అసలేం జరిగిందంటే?
గుంటూరు జిల్లా పోలకంపాడుకు చెందిన అన్నదమ్ములు కోటేశ్వరరావు, శ్రీనివాసులకు 7 సెంట్ల స్థలం ఉంది. 2010లోఈ స్థలాన్ని పంచుకున్నారు. అన్న కోటేశ్వరరావుకు నాలుగు సెంట్లు, తమ్ముడు శ్రీనివాసరావుకు మూడు సెంట్లు పంచుకుని నివాసం ఉంటున్నారు. శ్రీనివాసరావు తన మూడు సెంట్ల స్థలాన్ని నాగిరెడ్డి అనే వ్యక్తికి విక్రయించారు. దీంతో నాగిరెడ్డి అక్కడ వరకూ గోడ కట్టుకున్నాడు. ఈ గోడను కోటేశ్వరరావు కూల్చివేశారు. ఈ ఘటనపై నాగిరెడ్డి తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై శనివారం ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో వృద్ధుడైన కోటేశ్వరరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు నాగిరెడ్డికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇదిగో సాక్షి గూండాల బరితెగింపు....! అది కూడా స్వయంగా సాక్షి యజమాని సీఎం నివశించే తాడేపల్లిలో! ప్రైవేటు వివాదంలో వేలు పెట్టి... వృద్ధుడు, మహిళలపై దాడి. అధికార మదం తో పెట్రేగుతున్న ఇలాంటి మీడియా ముసుగు అరాచకాలను కట్టడి చేయలేరా @ysjagan pic.twitter.com/oYILp7AJr2
— N Chandrababu Naidu (@ncbn) April 30, 2022
సీఎం జగన్ స్పందించాలి : చంద్రబాబు
తాడేపల్లిలోని పోలకంపాడులో వృద్ధుడి వీడియోపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఈ వీడియోను చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇప్పటికైనా వైఎస్ జగన్ ప్రభుత్వం స్పందించాలని ట్వీట్ చేశారు.
ఏపీలో సామాన్యులకు బతికే అవకాశం లేదు : లోకేశ్
వృద్ధుడి వీడియోపై ఏపీలో సామాన్యుల పరిస్థితి ఎలా ఉందో తెలియజేస్తుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఈ ఘటనపై నారా లోకేశ్ శనివారం ట్వీట్ చేశారు.
యధా సాక్షి యజమాని, తథా సాక్షి ఉద్యోగులు. వైసిపి నాయకులు
— Lokesh Nara (@naralokesh) April 30, 2022
భూ కబ్జాలు, దాడులు, హత్యలతో రెచ్చిపోతుంటే మేమేమైనా తక్కువ తిన్నామా అంటున్నారు సాక్షి సిబ్బంది. మంగళగిరి నియోజకవర్గంలో సాక్షి రిపోర్టర్ నాగి రెడ్డి దాష్టీకం చూస్తుంటే..(1/3) pic.twitter.com/jIsTYvHbRB
Hyderabad News : బీజేపీ కార్పొరేటర్ ఆర్డర్ చేసిన బిర్యానీలో బల్లి, హోటల్ నిర్వాహకుడికి నోటీసులు
Nandyal News : నంద్యాలలో నిత్య పెళ్లి కూతురు, విడాకులు తీసుకోకుండా మూడు పెళ్లిళ్లు, నాల్గో పెళ్లికి సిద్ధం!
Srikalahasti News : శ్రీకాళహస్తి ఫైనాన్స్ సంస్థలో భారీ చోరీ, ఉద్యోగినిని కట్టేసి రూ. 80 లక్షల బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు
Hyderabad Crime : ఇళ్లు రెంట్ కు చూపిస్తానని చెప్పి యువతిపై అత్యాచారయత్నం, వాట్సాప్ గ్రూప్ ద్వారా ట్రాప్!
Karimnagar News : వడ్డీ వ్యాపారుల వేధింపులతో యువకుడు ఆత్మహత్య- కలచివేస్తున్న సూసైడ్ నోట్
Bandi Sanjay : కేంద్రాన్ని బదనాం చేస్తున్న కేసీఆర్ సర్కార్ ను కడిగేయండి, పార్టీ నేతలకు బండి సంజయ్ దిశానిర్దేశం
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
TS Police Jobs : తెలంగాణ పోలీస్ ఉద్యోగాలకు భారీ స్పందన, 17 వేల పోస్టులకు 12.91 లక్షల అప్లికేషన్లు
Nothing Phone 1: మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ ధర లీక్ - లాంచ్ డేట్ కూడా!