News
News
X

ముఠా కూలీగా పని చేస్తూ ఓనర్లనే మోసం చేసిన ఘనుడు - 48 గంటల్లో అరెస్ట్

గుంటూరు మిర్చి గూడెంలో జరిగిన చోరీ కేసును పోలీసులు 48గంటల్లో ఛేదించారు. నిందితుడి వద్ద నగదు, ఎలక్ట్రికల్ కట్టర్, ఓ ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.

FOLLOW US: 
Share:

 అర్ధరాత్రి సమయంలో గుంటూరు మిర్చి గూడెంలో జరిగిన చోరీ కేసును పోలీసులు 48గంటల్లో ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి అతడి వద్ద నుంచి రూ. 19,21,020 (19 లక్షల 21 వేల 20 రూపాయలు), ఎలక్ట్రికల్ కట్టర్, ఓ ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.
యజమానికి ఎసరు...
గుంటూరు నగరం పాలెం పరిధిలో డిసెంబర్ 17వ తేదీ తెల్లవారుజామున 02:15 గంటల నుంచి 02:24 గంటల మధ్యలో లాలుపురం రోడ్ చివర, SKT Exports కార్యాలయంలో చోరీ జరిగింది. యజమాని కరుకవేల్ ఆనంద్, ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితుడయిన నల్లచెరువు 18వ లైన్ ప్రాంతానికి చెందిన గోనెల శంకర్ ను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. మరో నిందితుడు పోతర్లంక నాగేశ్వరరావు, పరారీలో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. యజమాని వద్ద నమ్మకంగా ఉంటూనే ఆఫీస్ లో డబ్బులు కొట్టేశారని పోలీసుల దర్యాప్తు వెల్లడయ్యింది.
అసలు జరింది ఇదీ..
ముద్దాయి గోనెల శంకర్, నల్లచెరువు, 18వ లైన్, గుంటూరు టౌన్ లో అద్దెకు నివాసం ఉంటున్నాడు. మిర్చి గూడెంలలో ముఠా పని చేస్తు జీవనం సాగిస్తున్నాడు. ముద్దాయికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి సంతానం కాగా, వారు ఇద్దరు చదువుకుంటున్నారు. అయితే ముద్దాయి శంకర్ కు  మద్యం, సిగరెట్లు లాంటి చెడు అలవాట్లు కు బానిస అయ్యాడు. నెల రోజులు క్రితం వరకు లాలుపురం రోడ్ చివర ఉన్న మిర్చి గూడెంలో ఏడాది పాటు ముఠా కూలి పనిచేశాడు. శంకర్ 2018 వ సంవత్సరంలో, రెడ్డి పాలెంలో 60 గజాల స్థలాన్ని 11 లక్షల పెట్టి కొనుగోలు చేశాడు. అందులో 3 లక్షల రూపాయలును అప్పుగా తీసుకోని, ఆ అప్పు తీర్చటానికి పదే పదే చిన్న చిన్న అప్పులు చెయ్యాల్సి వచ్చింది. దీంతో అప్ప పెరిగి 5 లక్షల రూపాయలకు పెరిగింది. దీంతో  మిర్చి గూడెంలో ముఠా కులీగా పనిచేసి, తర్వాత మేస్త్రిగా ఉంటూ యజమానులు అయిన శ్రీధర్, ఆనంద్ తో చాలా దగ్గరగా పని చేసేవాడు. ఆ పనిచేసే క్రమంలో యజమానులకు సంబంధించిన ఆర్దిక లావాదేవీలు అన్ని తెలుసుకున్నాడు. డబ్బులు ఎక్కడెక్కడ పెడుతున్నారో తెలిసుకొని, శనివారం రోజున కులీలకు,  డబ్బులు ఇవ్వటం గమనించాడు.పెద్ద మెత్తంలో డబ్బులు చూడటంతో ముద్దాయి శంకర్ కు, ఎలాగైనా డబ్బులను దొంగిలించి అతని అప్పులు తీర్చుకోవాలని ప్లాన్ వేశాడు. యజమానులు వద్ద పని మానేసి, ఆ డబ్బులు దొంగిలించేందుకు తన పిన్ని కొడుకైన పోతర్లంక నాగేశ్వరరావు ని కలుపుకొని ప్లాన్ వేశాడు. పథకం ప్రకారం అర్ధరాత్రి డబ్బులను దొంగిలించాలి అని రూట్ మ్యాప్ ను రెడీ చేసుకొని మిర్చి గూడెం వద్దకు వెళ్లి రెక్కి నిర్వహించారు. 
ప్లాన్ ప్రకారం వాచ్ మెన్ కళ్ళలో కారం కొట్టి....
అనుకున్న ప్లాన్ ప్రకారం తాళం పగలగోట్టటానికి ఒక ఎలక్ట్రికల్ కట్టర్ అద్దెకు తీసుకొని, డబ్బులు పెట్టుకోవటానికి బ్యాగ్, చేతి గ్లౌస్ లు, మంకీ క్యాప్ లు, చిన్న సైజు కత్తి, కారం ప్యాకెట్, కుక్కలు కోసం మాంసం ఎరగా వేసేందుకు అన్నింటిని అందుబాటులో పెట్టుకున్నారు. 17.12.2022 తేదిన అర్ధరాత్రి 02:15 గంటల సమయంలో మిర్చి గూడెం వద్దకు శంకర్, నాగేశ్వరరావు కార్యాలయం వద్దకు వెళ్ళారు. ఆక్కడ చెట్టు దగ్గర కూర్చున్న వాచ్ మెన్  కళ్ళల్లో కారం కొట్టి,  ఇద్దరు కలసి వాచ్ మెన్ ని కింద పడేసి కాళ్ళు చేతుల్ని కట్టిపేడేశారు. కత్తి చూయించి బెదిరించి తాళాలు లాక్కొని, వారితో పాటు తెచ్చిన చికెన్ పిస్ లు కుక్కల కోసం వేసి,వాటిని కూడ దారి మళ్లించారు. కబోర్డ్ ని కుడా కట్టర్ తో కోసి ఓపెన్ చేసి అందులో ఉన్న సుమారు 20 లక్షల రూపాయల డబ్బులు దొంగిలించారు.
ఇలా దొరికిపోయారు.. 
రాత్రి పని పూర్తి కావటంతో అద్దెకు తీసుకున్న కట్టర్ తిరిగి ఇచ్చేందుకు ఇద్దరు నిందితులు బైక్ పై ప్రయాణిస్తుండగా పోలీసుల కంట పడ్డారు. అప్పటికే శంకర్ యజమానులు వద్ద పని చేసి ఉండటంతో అనుమానంతో పోలీసులు విచారణ చేశారు. దీంతో అసలు విషయం వెలుగు లోకి వచ్చింది. పోలీసులు శంకర్ ను ప్రశ్నించే క్రమంలో నాగేశ్వరరావు అక్కడ నుండి పరారయ్యాడు. స్దానిక వెంకట రమణ కాలని వద్ద పోలీసులు  శంకర్ ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి మొత్తం 19,21,020/- రూపాయలు, ఎలక్ట్రికల్ కట్టర్, యునికార్న్ ద్విచక్ర వాహనం ను స్వాధీనం చేసుకున్నారు.

Published at : 19 Dec 2022 10:34 PM (IST) Tags: AP Crime guntur chori

సంబంధిత కథనాలు

Warangal Crime : అన్న ఇంటికే కన్నం వేసిన తమ్ముడు, 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు!

Warangal Crime : అన్న ఇంటికే కన్నం వేసిన తమ్ముడు, 24 గంటల్లో కేసు ఛేదించిన పోలీసులు!

Pulivenudla Shooting : వులివెందులలో వివేకా కేసు అనుమానితుడు భరత్ కాల్పులు - ఒకరు మృతి

Pulivenudla Shooting : వులివెందులలో వివేకా కేసు అనుమానితుడు భరత్ కాల్పులు - ఒకరు మృతి

Gun Fire in US: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం - ఆరుగురి హత్య, నిందితుడూ మృతి

Gun Fire in US: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం - ఆరుగురి హత్య, నిందితుడూ మృతి

Saudi Arabia Bus Accident: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం, బస్‌ బోల్తా పడి 20 మంది దుర్మరణం 

Saudi Arabia Bus Accident: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం, బస్‌ బోల్తా పడి 20 మంది దుర్మరణం 

Hyderabad Crime News: హైదరాబాద్‌లో గుప్తనిధుల కలకలం, తొమ్మిది మంది అరెస్ట్

Hyderabad Crime News:  హైదరాబాద్‌లో గుప్తనిధుల కలకలం, తొమ్మిది మంది అరెస్ట్

టాప్ స్టోరీస్

KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

KTR On Amaravati :   అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మ‌ర‌డం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Minister IK Reddy : కాంగ్రెస్ లో మహేశ్వర్ రెడ్డి పనైపోయింది, రేపో మాపో పార్టీ మ‌ర‌డం ఖాయం- మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Actress Samantha:వాళ్లంతట వాళ్లే ఇవ్వాలి గానీ, అడుక్కోకూడదు: సమంత

Actress Samantha:వాళ్లంతట వాళ్లే ఇవ్వాలి గానీ, అడుక్కోకూడదు: సమంత