Crime News : స్టార్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో అనుపమ్ ఖేర్ ఫోటోతో కరెన్సీ - బంగారం వ్యాపారి బలైపోయాడు !
Gujarat : మోసగాడికి తెలివి ఉంటే ఉత్తుత్తి బ్యాంకులు పెట్టి నిండా ముంచేయగలరు. ఉత్తుత్తి బ్యాంక్ పెట్టి..దొంగ నోట్లు ప్రింట్ చేసి.. గోల్డ్ కొనేశారు.
Gujarat businessman duped of Rs 1 crore 30 lakhs with fake notes bearing Anupam Kher image : ఓ సినిమాలో ఉత్తుత్తి బ్యాంక్ పెట్టి మోసం చేయడాన్ని కామెడీగా చూపించారు. కానీ గుజరాత్ లో కొంత మంది నిజంగానే సీరియస్ గా చేశారు. ఈ దెబ్బకు ఓ బంగారంవ్యాపారం రెండు కేజీల బంగారాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది.
అహ్మదాబాద్‌లో మహుల్ టక్కర్ అనే బంగారం వ్యాపారికి బాగా తెలిసిన వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. తన మిత్రుడికి రెండు కేజీల బంగారం కావాలని రెడీ చేసి పెట్టమన్నాడు. మొత్తం బిల్లు ఎంత అవుతుందో కాసేపటికి మరోసారి ఫోన్ చేసి చెప్పాలని కోరాడు. కోటి 70 లక్షల రూపాయల వరకూ బిల్లు అవుతుందని చెప్పాడు. తన స్నేహితుడు వస్తాడని బంగారం తీసుకుని డబ్బులిస్తాడని పెట్టేశాడు. కాసేపటికే మరోసారి ఫోన్ చేసి.. ఆర్టీజీఎస్‌లో నగదు బదిలీకి సమస్యలు ఏర్పడ్డాయని అందుకే నగదు తీసుకోవాలని కోరాడు. గుజరాత్ లోని అహ్మదాబాద్‌లో బంగారం వ్యాపారులు ఇలా నగదు ద్వారా లావాదేవీలు జరిపేందుకు ప్రత్యేకంగా అంగాడియా అనే కేంద్రాలు ఉంటాయి.
రజనీకాంత్ హెల్త్ అప్డేట్... ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అపోలో డాక్టర్లు - డిశ్ఛార్జి ఎప్పుడంటే?
ఇలా ఓ అంగాడియాకు బంగారంతో మహుల్ టక్కర్ వెళ్లాడు. అక్కడ తనతో మాట్లాడిన వ్యక్తి డబ్బుతో ఉన్నాడు. మొత్తం రూ. కోటి 30 లక్షల రూపాయల నగదు ఇచ్చి.. బంగారం తీసుకున్నాడు. ఆ నోట్లను తమ వద్ద కౌంటింగ్ మిషన్ తో వారే లెక్కించారు. అంగాడియాలు అంటే.. అక్కడ మంచి నమ్మకం. ఆ నగదు తీసుకుని ఇంటికెళ్లిపోయిన బంగారం వ్యాపారికి .. నోట్లు లెక్కపెట్టేటప్పుడు అసలు విషయం తెలిసింది. ఏమిటంటే..దానిపై మహాత్మాగాంధీ బొమ్మలేదు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ బొమ్మ ఉంది. పైగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉండాల్సిన చోట స్టార్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంది. దీంతో ఇవి ఫేక్ అని తెలియడంతో లబోదిబోమని.. అంగాడియా వద్దకు పరుగెత్తకెళ్లాడు.
బజ్జీల కోసం దారుణం - అరువు ఇవ్వలేదని వేడి నూనె పోసేశాడు, ఎక్కడంటే?
కానీ అక్కడ తనకు డబ్బులు ఇచ్చిన ప్లేస్ అంగాడియా లేదు. అది కూడా సెటప్పేనని అర్థమైపోయింది. రెండు రోజుల కిందటే దాన్ని పెట్టారని గంట కిందే తీసేశారని పక్కన వాళ్లు చెప్పడంతో షాక్ కు గురయ్యాడు. తనకు తెలిసిన వ్యక్తి ఫోన్లు చేశాడు కదా అని అతన్ని సంప్రదిస్తే ఆ పోన్లు పని చేయడం లేదు. బహశా.. తన ఫోన్ నెంబర్ క్లోన్ చేసి ఇలా ఫోన్లు చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అహ్మదాబాద్ బంగారం వ్యాపారం నగదు లావాదేవీలు ఎక్కువగా నిర్వహిస్తూంటారని మోసగాళ్లు వారిని ఇలా టార్గెట్ చేస్తూంటారు. తరచూ ఇలా మోసపోయే వాళ్లు కూడా ఎక్కువగానే ఉన్నారు.