అన్వేషించండి

Goldman Suryabhai Arrest: ఆయన పెట్టుకునేదే ఫేక్ గోల్డ్.. అయినా తక్కువ ధరకు బంగారం అంటే మోసపోయారు - సూర్యాభాయ్ మామూలోడు కాదు!

Cheap gold investment scam: సీఎం రేవంత్ రెడ్డి, హైదరాబాద్ సీపీ పేర్లు చెప్పుకొని తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తానని లక్షల రూపాయలు వసూలు చేసిన సూర్యాభాయ్‌ను అత్తాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు

Gold Investment Scam:  తానే ఒక పెద్ద తోపునని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడినని, హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ తన ప్రాణ స్నేహితుడంటూ బిల్డప్ ఇచ్చిన ఒక కిలాడీ  గోల్డ్ మ్యాన్ వ్యవహారం భాగ్యనగరంలో సంచలనంగా మారింది. ఒళ్లంతా కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు ధరించి, హల్చల్ చేసే  సూర్యాభాయ్ అనే కేటుగాడు.. తక్కువ ధరకే స్వచ్ఛమైన బంగారం ఇప్పిస్తానంటూ నమ్మించి అమాయకుల నుండి లక్షల రూపాయలు వసూలు చేసి  మోసం చేశాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన రాజేంద్రనగర్ పరిధిలోని అత్తాపూర్ పోలీసులు ఈ నకిలీ సూర్యాభాయ్‌ను అరెస్ట్ చేశారు.

 సీఎం, సీపీల పేర్లతో పొలిటికల్ సెటిల్‌మెంట్లు 

నిందితుడు సూర్యాభాయ్ ఒళ్లంతా లావుపాటి బంగారు గొలుసులు, బ్రాస్‌లెట్లు ధరించి నగరంలో తిరుగుతూ అందరినీ ఆకర్షించేవాడు. పెద్ద పెద్ద పొలిటికల్ కాంటాక్ట్స్ ఉన్నాయని నమ్మించేందుకు.. తనకు సీఎం రేవంత్ రెడ్డి అత్యంత క్లోజ్ అని, హైదరాబాద్ పోలీస్ బాస్ తనతో రోజూ ఫోన్లో మాట్లాడుతుంటాడని కట్టుకథలు చెప్పేవాడు. ఈ రేంజ్ బిల్డప్‌లు చూసి నిజంగానే ఇతగాడికి ఉన్నతాధికారులతో సంబంధాలు ఉన్నాయని నమ్మిన కొందరు వ్యాపారులు, సామాన్యులు తమ సివిల్ పంచాయితీలు, సెటిల్‌మెంట్ల కోసం ఈ సూర్యాభాయ్‌ను ఆశ్రయించి మోసపోయారు.
 
మార్కెట్ ధర కంటే తక్కువకే ప్యూర్ గోల్డ్.. స్కెచ్ ఇదీ! 

ఈ పొలిటికల్ ఇమేజ్ ముసుగులోనే సూర్యాభాయ్ తన అసలు దందాను మొదలుపెట్టాడు. మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకే హోల్‌సేల్‌గా, నేరుగా స్వచ్ఛమైన గోల్డ్ బిస్కెట్లు, ఆభరణాలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. దొంగతనం కేసుల్లో పట్టుబడిన బంగారం లేదా కస్టమ్స్ సీజ్ చేసిన గోల్డ్ తనకు తక్కువ రేటుకు వస్తుందని నమ్మించి, పలువురి నుంచి లక్షల రూపాయల అడ్వాన్సులు వసూలు చేశాడు. కేవలం మాటలతోనే కాకుండా తన ఒంటిపై ఉన్న భారీ బంగారాన్ని చూపిస్తూ ఇది కూడా తాను అలా తక్కువ ధరకు కొనుగోలు చేసిందేనని బాధితులను నమ్మించాడు. అయితే ఇటీవల ఆయన పెట్టుకునేవన్నీ ఫేక్ రోల్డ్ గోల్డ్ నగలని ఐటీ అధికారులు గుర్తించారు. 

 డబ్బులు అడిగితే రివర్స్ బెదిరింపులు.. రంగంలోకి పోలీసులు 

 డబ్బులు ఇచ్చి నెలలు గడుస్తున్నా సూర్యాభాయ్ నుంచి బంగారం కానీ, తిరిగి నగదు కానీ రాకపోవడంతో బాధితులు అతడిని నిలదీశారు. అయితే, అసలు రంగు బయటపెట్టిన సూర్యాభాయ్.. వారిపైనే రివర్స్ అయ్యాడు.  నన్నే అడుగుతారా? సీఎం ఆఫీస్ నుంచి ఫోన్ చేయిస్తే మీ బతుకులు రోడ్డున పడతాయి. సిటీ కమీషనర్ నా ప్రాణ స్నేహితుడు, మీపైనే అక్రమ కేసులు పెట్టి లోపలేయిస్తా  అంటూ తుపాకీతో  బెదిరింపులకు దిగాడు. దీంతో తాము దారుణంగా మోసపోయామని గ్రహించిన బాధితులు అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు.

 అత్తాపూర్‌లో అరెస్ట్

బాధితుల ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన అత్తాపూర్ పోలీసులు నిందితుడు సూర్యాభాయ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, అతడు చెప్పినవన్నీ అబద్ధాలని, సీఎం, సీపీల పేర్లను కేవలం మోసాల కోసమే వాడుకున్నాడని తేలింది. అయితే, నిందితుడి మోసాల నెట్‌వర్క్ అంతా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎక్కువగా సాగడం, బాధితులు కూడా నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు కావడంతో.. కేసు తదుపరి లోతైన దర్యాప్తు కోసం అత్తాపూర్ పోలీసులు దీనిని సిటీలోని ఒక కీలక పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఇతడి ముఠాలో ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇప్పటివరకు ఎంతమందిని ముంచారు? అనే కోణంలో సిటీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
Road Accidents: పశ్చిమ గోదావరి జిల్లాలో కాల్వలోకి దూసుకెళ్లిన కారు- నలుగురు యువకులు గల్లంతు
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
విజయవాడ.. కృష్ణా నదిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు మృతి
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Advertisement

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Embed widget