అన్వేషించండి

Crime News: బాత్రూంలో ఉండగా వీడియో తీసిన పీఈటీ - రోడ్డెక్కిన 500 మందికి పైగా విద్యార్థినులు

Siricilla News: తమను మహిళా పీఈటీ వేధిస్తున్నారని దాదాపు 500 మందికి పైగా విద్యార్థినులు రహదారిపై ఆందోళన నిర్వహించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. పోలీసులు, అధికారులు వారికి నచ్చచెప్పారు.

Girl Students Harassed By Staff In Rajanna Siricilla District: రాజన్న సిరిసిల్ల జిల్లాలో (Rajanna Siricilla District) దారుణం జరిగింది. తమను పీఈటీ వేధిస్తోందని దాదాపు 500 మందికి పైగా విద్యార్థినులు గురువారం రోడ్డెక్కి ఆందోళన నిర్వహించారు. బాధిత విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో (Tribal Welfare Gurukul School) పని చేస్తోన్న పీఈటీ జ్యోత్స్న తమను శారీరకంగా, మానసికంగా వేధిస్తోందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉదయం 5 గంటలకే సిద్ధిపేట ప్రధాన రహదారిపై కూర్చొని నిరసన తెలిపారు. వందల మందికి పైగా విద్యార్థినులు ఉన్న పాఠశాలలో రెండు బాత్రూంలు మాత్రమే ఉన్నాయని వాపోయారు. నెలవారీ పీరియడ్స్ ఉన్న సమయంలోనూ బాత్రూంలో స్నానం చేస్తుంటే.. పీఈటీ టీచర్ లేట్ ఎందుకు అవుతుందని డోర్ పగలకొట్టి.. లోనికి వచ్చి తన ఫోన్‌తో వీడియో రికార్డు చేస్తూ కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె పెట్టే ఇబ్బందులు భరించలేకపోతున్నామని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.

'ఆమె ఓ సైకో'

పీఈటీ ఓ సైకో అని.. బైపీసీ మొదటి సంవత్సర విద్యార్థినులు తీవ్రస్థాయిలో ఆమెపై మండిపడ్డారు. ఆమె ఆగడాలు భరించలేకే ధర్నాకు దిగామని వివరించారు. తాము బాత్రూంలో స్నానం చేస్తున్న సమయంలో లోపలికి వచ్చి బట్టలు లేకుండా వీడియోలు తీస్తూ దుర్భాషలాడుతూ, కొడుతూ తీసుకెళ్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఈటీ కొట్టిన దెబ్బలను చూపిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. ఆ సైకో టీచర్‌ను సస్పెండ్ చేయాలని కోరుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థినులకు నచ్చచెప్పారు. ఎంఈవో రఘుపతి ఘటనా స్థలానికి వెళ్లి విద్యార్థినులతో మాట్లాడారు. పీఈటీ జ్యోత్స్నను విధుల నుంచి తప్పిస్తున్నామన్న డీఈవో హామీతో విద్యార్థినులు ఆందోళన విరమించారు.

Also Read: Telangana: మీ ఇంటికొస్తానన్న కౌశిక్‌ రెడ్డి- రా తేల్చుకుందాం అంటూ అరికెపూడి గాంధీ సవాల్‌- హీటెక్కిన గ్రేటర్ పాలిటిక్స్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
Ram Charan : 'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
Ram Charan : 'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
'ఛాంపియన్'... యాక్షన్ ఓరియెంటెడ్ లగాన్‌ - 'పెద్ది'పై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
VBG RAM Gలో VB అంటే ఏమిటి? 99 శాతం మందికి తెలియని విషయం ఇదే!
Railway Rules : రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
రైలులో టికెట్ తనిఖీ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రైల్వే పోలీసులు అడిగితే ఏంచేయాలి? తప్పక తెలుసుకోండి!
TFTDDA President : TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
Most Expensive Vegetables : ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో
ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో
Embed widget