By: ABP Desam | Updated at : 05 Jun 2023 09:46 PM (IST)
బోల్తా పడిన ట్రాక్టర్
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వట్టిచెరుకూరు వద్ద ట్రాక్టర్ బోల్తా పడి ఆరుగురు స్పాట్‌లోనే చనిపోయారు. కొండేపాడు గ్రామానికి చెందిన వారు ట్రాక్టర్లో ఓ శుభకార్యానికి హాజరు కావడానికి జూపూడికి బయలు దేరారు. మొత్తం 32 మంది మహిళలే ఉన్నారు. ఆందరూ బంధువులో కావటంతో చాలా ఆనందంగా బయలు దేరారు. వట్టిచెరుకూరు దాటిన తర్వాత ఒక్క సారిగా ట్రాక్టర్ బోల్తా కొట్టింది. పక్కనే ఉన్న పొలంలో ఉన్న ఎండిపోయిన పంట కాలవలో ట్రాక్టర్ పడిపోయింది.
ట్రాలీ కింద పడి అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందారు. ట్రక్టర్ బోల్తా కొట్టిన సంఘటన తెలుసుకొని గ్రామస్థులు అక్కడికి జేసీబీతో వచ్చి మిగతా వారిని కాపాడే ప్రయత్నం చేశారు. 108లో క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. మార్గ మద్యలో మరొకరు మృతి చెందగా హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ మరో వ్యక్తి మృతి చెందాడు. ట్రాక్టర్ ప్రమాదంలో మొత్తంగా ఎనిమిది మంది మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 30 మంది ఉన్నట్లు సమాచారం. మృతులు మిక్కిలి నాగమ్మ, మామిడి జాన్సీరాణి, కట్టా నిర్మల, గరికపూడి మేరిమ్మ, గరికపూడి రత్నకుమారి, గరికపూడి సుహాసినిగా గుర్తించారు.
సీఎం జగన్ దిగ్భ్రాంతి - రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటన
గుంటూరు జిల్లా ట్రాక్టర్ బోల్తా ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ దురదృష్టకర ఘటనలో చనిపోయిన బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు సీఎం జగన్ రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అదే సమయంలో తీవ్రంగా గాయపడ్డవారికి రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించారు. స్వల్ప గాయాలైన వారికి రూ.25 వేలు సాయం అందించాలని బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలంటూ అధికారుల్ని సీఎం జగన్ ఆదేశించారు.
చంద్రబాబు దిగ్భ్రాంతి
ప్రమాదం తన మనసును తీవ్రంగా కలిచివేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. శుభకార్యానికి వెళ్తూ విగత జీవులుగా మారడం బాధాకరమని అన్నారు. మృతులు అంతా పేద కుటుంబాలకు చెందిన వారు అయినందున మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని సూచించారు. అలాగే వారి బిడ్డల భవిష్యత్‌కు భరోసా ఇచ్చి ఆ కుటుంబాలకు బాసటగా నిలవాలని అన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలన్నారు.
నంద్యాలలో మరో ప్రమాదం - తండ్రి కుమార్తె దుర్మరణం
నంద్యాల జిల్లాలోని కంపమల్ల - దొర్నిపాడు మార్గంలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి బైక్ను కారు ఢీకొట్టిన ప్రమాదంలో తండ్రి కూతురు మృతి చెందారు. మరో ఇద్దరు కుమార్తెలకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు గాయపడ్డ వారిని ఆళ్లగడ్డ ఆసుపత్రికి తరలించారు. బాధితులను దొర్నిపాడు వాసులుగా గుర్తించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోస్టు మార్టం కోసం మృత దేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Shrirampur Police: పుష్ప సినిమా స్టైల్లో గంజాయి స్మగ్లింగ్- ఎలా చేశారో తెలిస్తే షాక్
Decomposed Dead Body: కన్నతల్లి అనుమానాస్పదంగా మృతి, 3 నెలలుగా ఇంట్లోనే మృతదేహం
Tollywood Drugs Case: సినీ భాషలో డ్రగ్స్ దందా, పెడ్లర్ ను రైటర్ అని, డ్రగ్స్ కావాలంటే ‘షల్ వీ మీట్’ అంటూ కోడ్స్
రోడ్డుపై అర్ధనగ్నంగా అత్యాచార బాధితురాలు, సాయం కోసం ఇంటింటికీ తిరిగిన బాలిక
Minor Suspicious Death: బావిలో విద్యార్థిని డెడ్ బాడీ - సోషల్ మీడియాలో ప్రచారాన్ని నమ్మవద్దన్న ఏఎస్పీ
Pawan Kalyan: బాలిక హత్యపై మహిళా కమిషన్ ఎందుకు స్పందించట్లేదు, కనీస బాధ్యత లేదా: పవన్ కల్యాణ్
Crocodile: హైదరాబాద్ లో నాలాలో కొట్టుకువచ్చిన మొసలి, స్థానికుల భయాందోళన
ఏపీ సెక్రటేరియట్ లో 50 మంది పదోన్నతులు వెనక్కి, ప్రభుత్వం ఉత్తర్వులు
Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన
/body>