అన్వేషించండి

Fake RPF SI Arrest: వేసింది ఖాకీ వేషం- పేరెంట్స్ సహా అందర్నీ చేసింది మోసం

Crime News: నకిలీ ఆర్పీఎఫ్ మహిళా ఎస్సైని జీఆర్పీ, ఆర్పీఎఫ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఏడాదిగా... నార్కట్‌పల్లిలో ఎస్సైగా చెలామణి అవుతున్నట్టు గుర్తించారు పోలీసులు.

Fake RPF SI Arrest: ఆర్పీఎఫ్‌ ఎస్సై అని చెప్పుకుంటూ తిరుగుతున్న ఓ యువతిని రైల్వే పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ యువతి ఇచ్చిన షాక్‌కి పోలీస్ శాఖ మొత్తానికి దిమ్మతిరిగి పోయింది. దాదాపు ఏడాది నుంచి ఆర్పీఎఫ్‌  ఎస్సైగా చెలామణి అవుతోంది మాళవిక అనే యువతి. నార్కట్‌పల్లిలో విధులు నిర్వర్తిస్తున్నట్టు కుటుంబసభ్యులతోపాటు అందరినీ నమ్మించింది. రోజు మొత్తం యూనిఫామ్‌లోనే తిరుగుతుంది. దేవాలయాలకు కూడా యూనిఫామ్‌లోనే వెళ్తుంది.  ప్రముఖులను కలిసి ఫోటోలు దిగుతుంది. ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తుంది. పెళ్లి చూపులకు కూడా పోలీస్ డ్రెస్‌లోనే వెళ్లింది. అదే ఆమె కొంప ముంచింది. అబ్బాయి తరపు వాళ్లు ఉన్నతాధికారులను ఆరా తీయగా... అసలు  విషయం బయటపడింది. మాళవిక నకిలీ ఎస్సై అన్న గుట్టు రట్టయ్యింది. ఆమె... కటకటాల వెనక్కి వెళ్లింది. 

అసలు ఏం  జరిగిందంటే...?
నల్గొండ జిల్లా నార్కట్‌పల్లికి చెందిన యువతి మాళవిక నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసింది. 2018లో ఆర్పీఎఫ్‌ (RPF) ఎస్ఐ పరీక్ష రాసింది. దాదాపుగా అన్ని అర్హతలు సాధించింది. కానీ మెడికల్ టెస్ట్‌లో దృష్టి లోపం కారణంగా.. ఆమె తిరస్కరణకు  గురైంది. దీంతో చాలా బాధపడింది. అంతేకాదు... అప్పటికే తల్లిదండ్రులతో పాటు బంధువులకు కూడా తాను ఎస్ఐ అవుతున్నట్టు చెప్పుకుంది. ఉద్యోగం రాలేదని చెప్తే పరువు పోతుందని భావించిన మాళవిక... ఉద్యోగం వచ్చినట్టు తల్లిదండ్రులను,  కుటుంబసభ్యులను నమ్మించింది. ఎస్ఐ యూనిఫాం కుట్టించుకుంది. నకిలీ ఐడి కార్డ్ చేయించుకుంది. నార్కట్‌పల్లి గ్రామంలో ఎస్సైగా పనిచేస్తున్నట్టు బిల్డప్‌ ఇచ్చింది. శంకర్‌పల్లిలో విధులు నిర్వహిస్తున్నట్లు నమ్మించింది. ఉదయం యూనిఫామ్‌  వేసుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లి... మళ్లీ రాత్రికి యూనిఫామ్‌లోనే ఇంటికి వచ్చేంది. యూనిఫాంలోనే వీఐపి దర్శనాలు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లడం చేసింది.

కటకటాల వెనక్కి నెట్టిన పెళ్లిచూపులు
ఉద్యోగం వచ్చింది... ఇక పెళ్లిచేద్దామనుకుని మాళవికకు ఎంతో ఆశతో సంబంధాలు చూశారు తల్లిదండ్రులు. పెళ్లిచూపులు ఫిక్స్‌ చేశారు. దీంతో... పెళ్లిచూపులకు కూడా యూనిఫాంలోనే వెళ్లింది మాళవిక. అక్కడే దొరకిపోయింది. అబ్బాయి  తరపువాళ్లు పైఅధికారులను సంప్రదించగా... మాళవిక మోసం బయటపడింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. నకిలీ ఆర్పీఎఫ్‌ పోలీసుగా చెలామని అవుతున్న మాళవికను అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగం రాలేదని చెప్తే తల్లిదండ్రులు  బాధపడతారని ఇలాంటి పని చేసినట్టు చెప్తోంది మాళవిక. దాదాపు ఒక సంవత్సరం నుంచి ఆమె నకిలీ ఎస్సైగా చెలామణి అవుతోందని జీఆర్పీ (GRP), ఆర్పీఎఫ్ (RPF) పోలీసులు గుర్తించారు. ఆమెను అరెస్ట్‌ చేసి... రిమాండ్‌కు తరలించారు. ఎస్సైగా  చెప్పుకుంటూ ఇంకేమైనా మోసాలకు పాల్పడిందా అన్న కోణంలోనూ ఆరా తీస్తున్నారు పోలీసులు. 

యూనిఫామ్‌లోనే రీల్స్‌
ఎస్సై కావాలన్న కల నెరవేరక పోవడంతో... నకిలీ ఎస్సైగా చలామణి అయిన మాళవిక... ఎప్పుడూ యూనిఫామ్‌లోనే ఉండేది. పోలీస్‌ యూనిఫామ్‌లో ఆమె రీల్స్‌ కూడా చూసింది. ఆ రీల్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్‌ చేసింది. యూనిఫామ్‌లో  వీఐపీలతో ఫొటోలు దిగి... వాటిని కూడా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. ఏడాది పాటు సాగుతున్న నకిలీ ఎస్సై బాగోతం... చివరికి బట్టబయలైంది. ఆమె చేసిన పనికి పోలీసులు కూడా షాకయ్యారు. ప్రస్తుతం మాళవిక రిమాండ్‌లో ఉంది. ఈ  కేసులో ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. 

టాప్ హెడ్ లైన్స్

Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
Lenin TV Premiere Date : బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
బుల్లితెరపై అయ్యగారు వచ్చేస్తున్నారు - అఖిల్ అక్కినేని లెనిన్ టీవీల్లోకి వచ్చేది ఎప్పుడంటే?
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Embed widget