Delhi Acid Attack Case: ఆన్‌లైన్‌లో యాసిడ్ కొన్నా, దూరం పెట్టిందనే కోపంతోనే దాడి చేశా - పోలీసుల విచారణలో నిందితుడు
Delhi Acid Attack Case: ఢిల్లీ యాసిడ్ దాడి కేసులో పోలీసుల విచారణలో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి.
Delhi Acid Attack Case:
మాట్లాడడం లేదన్న కోపంతో...
ఢిల్లీలో 17 ఏళ్ల బాలికపై యాసిడ్ దాడి జరగటం నగర వ్యాప్తంగా కలకలం రేపింది. ఇప్పటికే దేశ రాజధానిలో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ద్వారకాలోనే జరిగిన దాడి మరోసారి చర్చనీయాంశమైంది. యాసిడ్‌ను అంత బహిరంగంగా ఎవరికి పడితే వారికి ఎలా విక్రయిస్తున్నారని మహిళా సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. అయితే..దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపట్టిన పోలీసులు కీలక వివరాలు వెల్లడించారు. ప్రస్తుతానికి బాధితారులు ICUలో చికిత్స పొందుతోందని చెప్పారు. "ముఖం దాదాపు
7-8% మేర కాలిపోయింది. కళ్లలోనూ యాసిడ్ పడింది" అని చెప్పారు. స్పెషల్ సీపీ చెప్పిన వివరాల ప్రకారం...నిందితుడు సచిన్ అరోరాతో ఒకప్పుడు బాధితురాలు సన్నిహితంగా ఉండేది. రెండు మూడు నెలలుగా అతడిని దూరం పెట్టింది ఆ అమ్మాయి. ఆ కోపంతోనే దాడి చేసినట్టు నిందితుడు విచారణలో అంగీకరించినట్టు పోలీసులు వెల్లడించారు. ఇక యాసిడ్ ఎక్కడ కొన్నారన్న ప్రశ్నకూ నిందితుడు సమాధానం చెప్పాడు. ఫ్లిప్‌కార్ట్‌లో యాసిడ్ కొనుగోలు చేసినట్టు చెప్పాడు. ఈ నిందితుడికి మరో స్నేహితుడు వీరేంద్ర సింగ్ సహకరించాడు. అరోరాకు చెందిన బైక్‌ని, మొబైల్‌ని తనతో పాటు తీసుకెళ్లిపోయాడు. వేరే లొకేషన్‌కు తీసుకెళ్తే నిందితుడిని ట్రాక్ చేయడం పోలీసులకు కష్టతరమ వుతుందని ఇలా ప్లాన్ చేశారు. ఇన్వెస్టిగేషన్‌ను మిస్‌లీడ్ చేసేందుకు ఇలా చేశారని విచారణలో తేలింది. ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. పూర్తి స్థాయి నివేదిక అందించాలని పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరాకు ఆదేశాలిచ్చారు. యాసిడ్ విక్రయాలపై నిషేధం విధించినా...అంత సులువుగా ఎలా అందుబాటులో ఉంటున్నాయో విచారించాలని చెప్పారు. అటు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. "నిందితుడికి కఠిన శిక్ష పడాల్సిందే. ఢిల్లీలో ఉంటున్న ప్రతి బాలికకు భద్రత కల్పించడం ఎంతో ముఖ్యం" అని అన్నారు.
ఇదీ జరిగింది...
ద్వారకా మోడ్ ప్రాంతంలో రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్న 17 ఏళ్ల విద్యార్థినిపై బైక్ వచ్చిన ఓ వ్యక్తి యాసిడ్ చల్లి పారిపోయాడు. ఆ మంట తట్టుకోలేక ఒక్కసారిగా పరుగులు పెట్టింది బాధితురాలు. ప్రస్తుతం ఆమెకు సఫ్దర్‌గంజ్ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. నిందితుడు బాలికకు తెలిసిన వ్యక్తేనని వెల్లడైంది. 12వ తరగతి చదువుతున్న బాధితురాలు...స్కూల్‌కు వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది.
ఢిల్లీ పోలీసులు ఈ ఘటనపై పూర్తి వివరాలు వెల్లడించారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగిందని, ఆ సమయంలో బాధితురాలితో పాటు పక్కనే తన చెల్లెలు కూడా ఉందని చెప్పారు. దీనిపై బాధితురాలి తల్లిదండ్రులు స్పందించారు. ఉదయం 7.30 నిముషాలకు ఇంటి నుంచి బయటకు వచ్చారని, కొంత దూరం వెళ్లిన వెంటనే ఈ దాడి జరిగిందని చెప్పారు. నిందితులు మాస్క్ పెట్టుకుని
దాడి చేశారు. తనను వెంబడిస్తున్నారని కానీ... వేధిస్తున్నారని కానీ తన కూతురు ఎప్పుడూ చెప్పలేదని తల్లిదండ్రులు వెల్లడించారు.
Also Read: Kashmir Remark in UN: పాకిస్థాన్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన భారత్- ఐరాసలో మాటల యుద్ధం