By: Ram Manohar | Updated at : 19 Jul 2023 04:17 PM (IST)
ఢిల్లీలోని ద్వారకాలో పదేళ్ల బాలికను పనిలో పెట్టుకుని హింసించిన మహిళా పైలట్‌ని స్థానికులు చితకబాదారు. (Image Credits: ANI)
Viral Video:
ద్వారకాలో ఘటన..
ఢిల్లీలోని ద్వారకాలో మైనర్‌ని ఇంట్లో పనికి పెట్టుకుని హింసిస్తున్నారన్న కోపంతో ఓ మహిళా పైలట్‌ని, ఆమె భర్తని చితకబాదారు. పదేళ్ల బాలికని పని మనిషిగా పెట్టుకోవడమే కాకుండా ఆమెని చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఈ కోపంతోనే ఒక్కసారిగా ఆ ఇద్దరిపై దాడి చేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంట్లోకి వెళ్లి దంపతుల్ని బయటకు లాగి మరీ కొట్టారు. ఈ ఇద్దరు నిందితులు ఓ ఎయిర్‌లైన్స్‌లో పని చేస్తున్నారు. ముందుగా భర్తను బయటకు లాక్కొచ్చి దారుణంగా కొట్టారు. ఆ తరవాత అతడి భార్యపైనా దాడి చేశారు. కొంత మంది మహిళలు ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకుని వచ్చారు. "క్షమించండి" అని ఎంతగా వేడుకున్నా ఆ మహిళలు ఆమెను వదల్లేదు. "నా భార్య చనిపోతుంది వదిలేయండి" అని భర్త కూడా వేడుకున్నాడు. అయినా మూకదాడి ఆగలేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం...రెండు నెలల క్రితం ఈ దంపతులు పదేళ్ల బాలికను ఇంట్లో పనికి పెట్టుకున్నారు. బాలిక చేతులపై గాయాల్ని గమనించారు బంధువులు. ఏమైందని అడగ్గా..దొంగతనం చేశానన్న సాకుతో కొట్టారని ఏడుస్తూ చెప్పింది ఆ బాలిక. వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఆమె బంధువులు ఫిర్యాదు చేశారు. అక్కడితో ఆగకుండా ఆ దంపతుల ఇంటికి వెళ్లారు. ఒక్కసారిగా మూకదాడి చేశారు. ఆ తరవాత పోలీసులు వచ్చి ఈ దాడిని నిలువరించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న దంపతుల్ని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. పిల్లల్ని పనిలో పెట్టుకోవడం నేరం. కానీ...చాలా మంది ఈ నిబంధనను పట్టించుకోకుండా పిల్లలతో చాకిరీ చేయిస్తున్నారు.
#WATCH | A woman pilot and her husband, also an airline staff, were thrashed by a mob in Delhi's Dwarka for allegedly employing a 10-year-old girl as a domestic help and torturing her.
The girl has been medically examined. Case registered u/s 323,324,342 IPC and Child Labour… pic.twitter.com/qlpH0HuO0z— ANI (@ANI) July 19, 2023
బాలిక చేతులపై కాలిన గాయాలను గమనించిన పోలీసులు వైద్య పరీక్షలు చేయించారు. బాధితురాలికి కౌన్సిలింగ్ కూడా ఇచ్చినట్టు వెల్లడించారు.
"బాలికకు వైద్య పరీక్షలు చేశాం. ఆమె చేతిపై కాలిన గాయాలున్నాయి. కౌన్సిలింగ్ కూడా ఇచ్చాం. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశాం. బాల కార్మికుల చట్టం, జువైనల్ జస్టిస్ యాక్ట్‌ల కింద కఠిన చర్యలు తీసుకుంటాం"
- పోలీస్ ఉన్నతాధికారి
#WATCH | Dwarka DCP M Harsha Vardhan says, "We reached the spot and found that a 10-year-old girl has been kept as domestic help by a couple. Her medical examination was conducted in which some injuries and burn marks have come to the fore. A case has been registered. Both… pic.twitter.com/UQL1URv1Pg
— ANI (@ANI) July 19, 2023
Also Read: Bengaluru Crime: బెంగళూరులో భారీ ఉగ్ర దాడులకు ప్లాన్, కుట్రను ఛేదించిన పోలీసులు - ఐదుగురు అరెస్ట్
Suicide Blast: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి, 52 మంది మృతి
Online Betting Scam: ఆన్ లైన్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠా అరెస్ట్, యువకులు జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు
పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతి, పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లి, సోదరుడు
Cyber Crime: గణేష్ ఉత్సవాల లక్కీ డ్రాలో ఐఫోన్ 15-నమ్మితే అకౌంట్ ఖాళీ అయినట్టే
Hyderabad: హైదరాబాదులో వర్షం, నాలా లో పడి పారిశుద్ధ కార్మికురాలు మృతి
RK Roja: ఆటో డ్రైవర్ అవతారంలో మంత్రి రోజా, లోకేశ్‌పై తీవ్ర వ్యాఖ్యలు - ముందస్తు బెయిల్ ఎందుకు?
Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం
/body>