News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Delhi Crime: లైంగికంగా వేధించిన టీచర్, గొంతు కోసి చంపిన విద్యార్థి

Delhi Crime: ఢిల్లీలో తనను లైంగికంగా వేధించిన టీచర్‌ని 14 ఏళ్ల విద్యార్థి గొంతు కోసి చంపాడు.

FOLLOW US: 
Share:

Delhi Crime: 

ఢిల్లీలో టీచర్ దారుణ హత్య..

ఢిల్లీలో దారుణం జరిగింది. లైంగికంగా వేధిస్తున్న టీచర్‌ని హత్య చేశాడు 14 ఏళ్ల విద్యార్థి. పదేపదే తనను లైంగికంగా వేధించడమే కాకుండా...అసభ్యంగా వీడియోలు తీసేవాడని చెప్పాడు ఆ బాలుడు. అప్పటికే సహనం కోల్పోయిన విద్యార్థి టీచర్‌ని పొడిచి చంపాడు. ఈ హత్య జరిగిన మూడు రోజుల తరవాత బాలుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆగస్టు 30న మధ్యాహ్నం ఈ హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. స్థానికులు గదిలో నుంచి రక్తం వస్తుండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారించగా...నిందితుడు 14 ఏళ్ల విద్యార్థి అని వెల్లడైంది. 

"ఆగస్టు 30వ తేదీన మధ్యాహ్నం 2.15 నిముషాలకు మాకు ఫోన్ కాల్ వచ్చింది. జమియా నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో సెకండ్ ఫ్లోర్ నుంచి రక్తం వస్తుండడాన్ని స్థానికులు గమనించారు. అదే విషయం మాకు చెప్పారు. ఆ గది తలుపులు తెరిచే ఉన్నాయి. మేం వెళ్లేటప్పటికే టీచర్ మృతదేహం నేలపై పడి ఉంది. మెడపై లోతైన గాయాలు కనిపించాయి"

- పోలీసులు

వీడియో తీసి బెదిరింపులు..

మర్డర్ కేసు పెట్టిన పోలీసులు స్పెషల్ టీమ్‌తో ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. టీచర్ హోమోసెక్సువల్ అని గుర్తించారు. రెండు నెలల క్రితం నిందితుడితో పరిచమయైంది. పదేపదే ఇంటికి పిలిపించుకుని అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఓ సారి వీడియో తీసి అప్పటి నుంచి బెదిరించడం మొదలు పెట్టాడు. పోలీసులకు ఫిర్యాదు చేయొద్దని వార్నింగ్ ఇచ్చాడు. లేదంటే సోషల్ మీడియాలో వీడియో అప్‌లోడ్ చేస్తా అని బెదిరించాడు. ఓ రోజు ట్యూటర్‌ కాల్ చేసి పిలిచాడు. ఈసారి ఎలాగైనా చంపేయాలని ఇంటి నుంచే పేపర్‌ కట్టర్‌ని తీసుకెళ్లాడు. ఇంట్లోకి వెళ్లగానే గొంతుపై పొడిచి చంపాడు. వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. రెండు నెలల క్రితమే ఈ గది ఖాళీ అయింది. అప్పటి నుంచి బాలుడిని పిలిచి అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఆ కోపంతోనే హత్య చేశాడు. 

Published at : 03 Sep 2023 03:57 PM (IST) Tags: Delhi Crime Delhi Crime News Student Murders Teacher Physical Abuse

ఇవి కూడా చూడండి

Producer Anji Reddy: ప్రముఖ నిర్మాత అంజిరెడ్డి హత్య కేసు ఛేదించిన పోలీసులు- ఆస్తి కోసం సన్నిహితుల కుట్ర

Producer Anji Reddy: ప్రముఖ నిర్మాత అంజిరెడ్డి హత్య కేసు ఛేదించిన పోలీసులు- ఆస్తి కోసం సన్నిహితుల కుట్ర

Hyderabad Crime: ప్రేమ కథ విషాదాంతం - ప్రియుడి మరణాన్ని తట్టుకోలేక యువతి ఆత్మహత్య

Hyderabad Crime: ప్రేమ కథ విషాదాంతం - ప్రియుడి మరణాన్ని తట్టుకోలేక యువతి ఆత్మహత్య

Maharashtra Hospital: ఒకే ఆస్పత్రిలో ఒకే రోజులో 24 మంది మృతి - నాందేడ్‌లో తీవ్ర విషాదం!

Maharashtra Hospital: ఒకే ఆస్పత్రిలో ఒకే రోజులో 24 మంది మృతి - నాందేడ్‌లో తీవ్ర విషాదం!

Medipally: ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నం చేసిన జిమ్‌ ట్రైనర్‌-పోక్సో కేసు నమోదు

Medipally: ఆరేళ్ల బాలికపై అత్యాచారయత్నం చేసిన జిమ్‌ ట్రైనర్‌-పోక్సో కేసు నమోదు

Tirupati Boy Kidnap: తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లో రెండేళ్ల బాలుడు కిడ్నాప్‌ - సీసీ ఫుటేజ్‌లో కీలక విషయాలు

Tirupati Boy Kidnap: తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లో రెండేళ్ల బాలుడు కిడ్నాప్‌ - సీసీ ఫుటేజ్‌లో కీలక విషయాలు

టాప్ స్టోరీస్

Talasani Srinivas : చంద్రబాబు అరెస్టు బాధాకరం - వైసీపీవి కక్ష సాధింపులు - మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు

Talasani Srinivas :  చంద్రబాబు అరెస్టు బాధాకరం - వైసీపీవి కక్ష సాధింపులు -  మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు

మనీ లాండరింగ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్ చేసిన ఈడీ

మనీ లాండరింగ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్ చేసిన ఈడీ

Nobel Prize 2023 in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం

Nobel Prize 2023 in Chemistry: రసాయన శాస్త్రంలో ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం

APSRTC News: దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 5,500 స్పెషల్‌ సర్వీసులు - ఈ నగరాల నుంచే

APSRTC News: దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 5,500 స్పెషల్‌ సర్వీసులు - ఈ నగరాల నుంచే