అన్వేషించండి

Delhi Crime: ఢిల్లీలో ఐఆర్‌ఎస్‌ అధికారి కుమార్తెపై ఇంట్లోనే అత్యాచారం హత్య! పని నుంచి తొలగించారని యువకుడి ఘాతుకం!

Delhi Crime: ఢిల్లీలో అత్యంత విషాదకరమైన ఘటన జరిగింది. ఒక సీనియర్ ఐఆర్‌ఎస్ అధికారి కుమార్తెను మాజీ పని వాడు ఫోన్ ఛార్జర్‌తో ఉరి వేసి హత్య చేశాడు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఢిల్లీలో IRS అధికారి కుమార్తె దారుణ హత్యకు గురైంది.
  • పాత పనివాడే తొలగించారనే కక్షతో అత్యాచారం చేసి చంపాడు.
  • సీసీటీవీ ఆధారాలతో 19 ఏళ్ల నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
  • ఆన్లైన్ గేమింగ్ బానిసత్వం, అప్పులే హత్యకు కారణమయ్యాయి.

Delhi Crime: దేశ రాజధాని ఢిల్లీలోని అత్యంత సురక్షితమైన ప్రాంతాల్లో ఒకటిగా భావించే ఈస్ట్‌ ఆఫ్ కైలాష్‌లో హృదయవిదారక ఘటన వెలుగు చూసింది. ఒక సీనియర్ బ్యూరోక్రాట్ కుమార్తె, ప్రతిభావంతురాలైన ఐఐటీ గ్రాడ్యుయేట్ తన స్వగృహంలోనే హత్యకు గురైంది. ఈ కేసులో పోలీసులు ఒక 19 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు. ఆ అధికారి ఇంట్లో గతంలో పని చేసిన వ్యక్తే ఈ పనికి పాల్పడ్డాడు. పనిలో నుంచి తొలగించారనే కోపంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

మంగళవారం నాడు ఆగ్నేయ ఢిల్లీలోని ఈస్ట్ ఆఫ్ కైలాష్‌ ప్రాంతంలో నివసించే ఐఆర్‌ఎస్ అధికారి కుమార్తె అనుమానాస్పద స్థితిలో తన గదిలో విగత జీవిగా పడి ఉండటాన్ని కుటుంబ సభ్యులు గమనించారు. హుటాహుటిన పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దర్యాప్తు ప్రారంభించారు. ఆ యువతిని ఫోన్ ఛార్జ్‌ర వైర్‌తో ఉరివేసి చంపినట్టు పోలీసులు గుర్తించారు. ప్రాథమిక విచారణలో ఆమెపై హత్యకు ముందు అత్యాచారం జరిగినట్టు తేలింది. 

మృతురాలు ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్నట్టు ఇంట్లోకి ఎవరూ బలవంతంగా చొరబడినట్టు ఆనవాళ్లు లేవని పోలీసులు తెలిపారు. దీనిని బట్టి నిందితుడికి ఆ ఇల్లు , ఆ ఇంటి పరిస్థితులు బాగా తెలుసు అని అనుమానించారు. 

ఈ కేసులో పోలీసులు 19 ఏళ్ల రాహుల్ అనే యువకుడిని నిందితుడిగా గుర్తించి ద్వారకలోని ఒక హోటల్‌లో తలదాచుకుంటుండగా అరెస్టు చేశారు. రాహుల్ గతంలో ఐఆర్‌ఎస్‌ అధికారి ఇంట్లో పని వాడిగా ఉండేవాడు. 

సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. బుధవారం ఉదయం 6.28 గంటల సమయంలో రాహుల్ ఆ ఇంటి నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి. నిందితుడు ఆల్వార్‌కు చెందిన వాడని, అంతకు ముందే ఢిల్లీకి చేరుకుని, తన వద్ద ఉన్న స్పేర్‌కీ సహాయంతో ఇంట్లోకి ప్రవేశించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. 

జాయింట్ పోలీస్ కమిషనర్ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, రాహుల్ ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసయ్యాడు. ఆటల కోసం డబ్బులు అవసరమై సమీపంలోని ఇతర పనివాళ్ల వద్ద, చుట్టుపక్కల వారి వద్ద అప్పులు చేసే వాడు, తీసుకున్న అప్పులను తిరిగి చెల్లించకపోవడంతోపాటు అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో, ఆ కుటుంబం సుమారు నెల రోజుల క్రితం అతడిని పనిలో నుంచి తొలగించింది. 

పని నుంచి తీసేయడం, డబ్బుల అవసరం ఉండటంతో రాహుల్ ఈ నేరానికి ఒడిగట్టాడని పోలీసులు భావిస్తున్నారు. అతనిపై అత్యాచారం, హత్య, దోపిడీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రాహుల్‌కు గతంలో కూడా ఒక లైంగిక వేధింపుల కేసులో ప్రమేయం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. 

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రాణాలు కోల్పోయిన 22 యువతి ప్రతిష్టాత్మకమైన ఢిల్లీలోని డీబీఎస్‌ఆర్‌కే పురంలో స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేసింది. అనంతరం ఐఐటీ ఢిల్లీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఆమె సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతోంది. ఆమె నృత్యకారిణి కూడా. చాలా పోటీల్లో అవార్డులు గెలుచుకుంది. 

ఈ ఘటనలో నిందితుడు రాహుల్, ఒక ఐఆర్‌ఎస్ ఆఫీస్‌లో పని చేసే సూపర్ ఇంటెండెంట్ సిఫార్సు ద్వారా పనిలో చేరాడు. అయినా అతను గత చరిత్ర తెలుసుకోకపోవడం తప్పు అయ్యింది. ఇంటి పని మనుషులను నియమించుకునేటప్పుడు కచ్చితంగా పోలీసు వెరిఫికేషన్ చేయించుకోవాలని, స్పేర్ కీలు వంటివి ఇతరుల చేతికి చిక్కకుండా జాగ్రత్త పడాలని ఈ ఘటన మరోసారి హెచ్చరిస్తోంది. 

Frequently Asked Questions

ఢిల్లీలో జరిగిన హత్య కేసులో ఎవరు అరెస్ట్ అయ్యారు?

ఢిల్లీలో జరిగిన హత్య కేసులో 19 ఏళ్ల రాహుల్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను గతంలో బాధితురాలి ఇంట్లో పని చేసేవాడు.

హత్యకు గురైన యువతి ఎవరు?

హత్యకు గురైన యువతి ఒక సీనియర్ బ్యూరోక్రాట్ కుమార్తె, ఐఐటీ గ్రాడ్యుయేట్. ఆమె సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతోంది.

ఈ హత్యకు కారణం ఏమిటని పోలీసులు భావిస్తున్నారు?

పనిలో నుంచి తొలగించారనే కోపం, డబ్బుల అవసరమే హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు ఆన్లైన్ గేమింగ్ కు బానిస.

నిందితుడు ఇంట్లోకి ఎలా ప్రవేశించాడు?

నిందితుడు తన వద్ద ఉన్న స్పేర్ కీ సహాయంతో ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లోకి ఎవరూ బలవంతంగా చొరబడిన ఆనవాళ్లు లేవు.

టాప్ హెడ్ లైన్స్

Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Embed widget