అన్వేషించండి

Delhi Building Collapse: ఢిల్లీలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం- నలుగురు మృతితో విషాదం, శిథిలాల కింద మరో 10 మంది

Delhi Crime News: ఢిల్లీలోని ముస్తఫాబాద్‌లో నాలుగు అంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు.

ఢిల్లీ ముస్తఫాబాద్ భవనం కూలిపోయింది: ఢిల్లీలోని న్యూ ముస్తఫాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. 4 అంతస్తుల భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతిచెందగా, మరో 8 నుంచి 10 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే NDRF, అగ్నిమాపక శాఖ అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ టీమ్ మొదట కూలిన బిల్డింగ్ శిథిలాల నుంచి నలుగురి మృతదేహాలను వెలికి తీశారు. అక్కడ సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

న్యూ ముస్తఫాబాద్‌లోని శక్తి విహార్‌లో నాలుగు అంతస్తుల భవనం కూలిపోయింది. భవనం కూలిపోయినట్లు శుక్రవారం రాత్రి 2:50 గంటలకు అగ్నిమాపక శాఖకు సమాచారం అందింది. సమాచారం అందిన వెంటనే ఢిల్లీ అగ్నిమాపక శాఖ సిబ్బంది, NDRF బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. 40 మందికి పైగా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

డివిజనల్ ఫైర్ ఆఫీసర్ రాజేంద్ర అథ్వాల్ మాట్లాడుతూ. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత సుమారు 2:50 గంటలకు ఒక బిల్డింగ్ కూలిపోయినట్లు సమాచారం అందింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించాం. మొత్తం భవనం కూలిపోగా, కొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు గుర్తించాము. NDRF టీమ్, ఢిల్లీ అగ్నిమాపక శాఖ సిబ్బంది శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయిని తెలిపారు.

శిథిలాల కింద మరో 10 మంది..

ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకూ 10 మందిని శిథిలాల నుంచి బయటకు తీయగా అందులో నలుగురు మరణించారు. ఈశాన్య జిల్లా అడిషనల్ డీసీపీ సందీప్ లాంబా మాట్లాడుతూ.. శిథిలాలలో ఇంకా 10 మంది వరకు చిక్కుకున్నట్లు భావిస్తున్నామని తెలిపారు. కుప్పకూలిన ఆ 4 అంతస్తుల భవనంలో దాదాపు 20 మంది వరకు నివసిస్తున్నారు. భవనం కుప్పకూలిపోవడం సీసీ కెమెరాలో రికార్డు అయినట్లు తెలుస్తోంది. అధికారులు దాన్ని బట్టి అసలేం జరిగిందో ఓ అంచనాకు రానున్నారు.

మృతులలో ఒకరి బంధువు షహజాద్ అహ్మద్ మాట్లాడుతూ, "ఈ బిల్డింగ్ శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత  దాదాపు 2.30 గంటలకు కూలిపోయింది. ఇది 4 అంతస్తుల భవనం. నా ఇద్దరు మేనల్లుళ్లు ప్రాణాలు కోల్పోయారు. నా సోదరి, బావతో పాటు మేనకోడలు కూడా గాయపడ్డారు. వారిని జిటిబి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు అని తెలిపారు. భవనం కూలిపోయిన ప్రమాదంతో ఒక ప్రత్యక్ష సాక్షి స్పందించారు. "భవనంలో ఇద్దరు వ్యక్తులు, వారి కుటుంబాలు, అద్దెకు ఉంటున్నవారు నివసిస్తున్నారు. పెద్ద కోడలుకు ముగ్గురు పిల్లలు, చిన్న కోడలుకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కానీ వారు ఎక్కడా కనిపించడం లేదు. ఇంకా శిథిలాల కిందే ఉన్నారా, ప్రాణాలతో బయట పడతారా తెలియడం లేదన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు

వీడియోలు

Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Konda Susmitha Comments Effect | పార్టీలో విభేదాలు పైకి చెప్పొద్దా..?
Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ED Raids On YSRCP MP Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
వైసీపీ ఎంపీ అవినాష్‌ రెడ్డి సహా పది మంది నివాసాల్లో ఈడీ ఆకస్మిక తనిఖీలు!
SIM Limit India: సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
సిమ్ కార్డులపై ఆగస్టు 24 నుంచి కొత్త రూల్స్ అమలు! ఇకపై ఒక వ్యక్తి ఎన్ని తీసుకోవచ్చు? నకిలీలను ఎలా గుర్తించాలి?
Defected MLAs Congress Status: బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరి తప్పు చేశామా? ఫిరాయింపు ఎమ్మెల్యేల తీవ్ర నైరాశ్యం.. పార్టీ మారిన గులాబీ నేతల భవిష్యత్తు ఏమవుతుంది?
Brahmanandam : బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
బ్రహ్మానందంపై అన్నయ్య ప్రశంసలు - హాస్య బ్రహ్మ రియాక్ట్ అయ్యారా?... వైరల్ వీడియోలో నిజం ఏంటంటే!
Telangana SIR Andhra Votes: హైదరాబాద్‌లో ఆంధ్రోళ్ల ఓట్లు ఏమయ్యాయి..? తెలంగాణ SIRలో వెలుగులోకి వచ్చిన కీలక లెక్కలు
ఈసారి ఆంధ్రోళ్లు తెలంగాణలో ఓట్లేయరా? హైదరాబాద్ మెట్రోలో పోయిన 43లక్షల ఓట్లు ఎవరివి SIR..?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో.. మీ బడ్జెట్‌కు, డైలీ డ్రైవింగ్‌కు ఏ కారు బెస్ట్‌?
మారుతి ఆల్టో K10 vs మారుతి ఎస్-ప్రెస్సో... రూ.3.50 లక్షల బడ్జెట్‌లో ఏ కారు బెస్ట్?
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
శుక్రవారం ఓటీటీ బ్లాక్ బస్టర్స్ - ఒకే రోజు 13 సినిమాలు... ఇవి మిస్ కావొద్దు
Embed widget