Delhi Acid Attack Acid: ఢిల్లీలో దారుణం, బాలికపై యాసిడ్ దాడి చేసిన దుండగులు
Delhi Acid Attack Acid: ఢిల్లీలో ఓ బాలికపై యాసిడ్ దాడి జరిగింది.
Delhi Acid Attack Acid:
ద్వారకాలో ఘటన..
ఢిల్లీలో ఓ బాలికపై యాసిడ్ దాడి జరిగింది. ద్వారకా మోడ్ ప్రాంతంలో రోడ్డుపై నడుచుకుంటూ వస్తున్న 17 ఏళ్ల విద్యార్థినిపై బైక్ వచ్చిన ఓ వ్యక్తి యాసిడ్ చల్లి పారిపోయాడు. ఆ మంట తట్టుకోలేక ఒక్కసారిగా పరుగులు పెట్టింది బాధితురాలు. ప్రస్తుతం ఆమెకు సఫ్దర్‌గంజ్ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నారు. నిందితుడు బాలికకు తెలిసిన వ్యక్తేనని వెల్లడైంది. 12వ తరగతి చదువుతున్న బాధితురాలు...స్కూల్‌కు వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఢిల్లీ పోలీసులు ఈ ఘటనపై పూర్తి వివరాలు వెల్లడించారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ దాడి
జరిగిందని, ఆ సమయంలో బాధితురాలితో పాటు పక్కనే తన చెల్లెలు కూడా ఉందని చెప్పారు. బైక్‌పై వచ్చిన ఆ ఇద్దరు ఎవరా అన్నది ఆరా తీస్తున్నామని అన్నారు. ఇప్పటికే ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు...విచారణ మొదలు పెట్టారు. యాసిడ్ లాంటి ఘాటైన ద్రావణంతో దాడి జరిగిందని, ప్రస్తుతానికి ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. బాధితురాలి కళ్లలోకి యాసిడ్
వెళ్లిందని తెలిపారు. దీనిపై బాధితురాలి తల్లిదండ్రులు స్పందించారు. ఉదయం 7.30 నిముషాలకు ఇంటి నుంచి బయటకు వచ్చారని, కొంత దూరం వెళ్లిన వెంటనే ఈ దాడి జరిగిందని చెప్పారు. నిందితులు మాస్క్ పెట్టుకుని దాడి చేశారు. తనను వెంబడిస్తున్నారని కానీ... వేధిస్తున్నారని కానీ తన కూతురు ఎప్పుడూ చెప్పలేదని తల్లిదండ్రులు వెల్లడించారు.
"Our younger daughter came running to the house and said that acid has been thrown at her sister. Both the boys had covered their faces, they are yet to be identified. It (acid) has entered both her eyes," says the father of the victim girl pic.twitter.com/oGodsNq5Fv
— ANI (@ANI) December 14, 2022
హైదరాబాద్‌లో ఇలా..
హైదారాబాద్ మియాపూర్ లో జరిగిన ప్రేమోన్మాది దాడి ఘటనలో యువతి తల్లి మృతి చెందింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తల్లి శోభ ప్రాణాలు విడిచింది. అయితే తన ప్రియురాలు తనను దూరం పెడుతుందనే కోపతం.. నేరుగా ఆమె ఇంటికి వెళ్లి ప్రియురాలు, ఆమె తల్లిపై కత్తితో దాడి చేశాడు. ఆపై తాను కూడా గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం నిందితుడు సందీప్
పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. గుంటూరుకు చెందిన 19 ఏళ్ల వైభవి, సందీప్ గత మూడేళ్లుగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. అయితే రెండేళ్ల క్రితం వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో వైభవి.. సందీప్ ను దూరం పెడుతోంది. కానీ సందీప్ మాత్రం ఆమెను వదలడం లేదు. తరచుగా వివిధ నెంబర్ల నుంచి ఫోన్లు, మెసేజ్లు చేస్తూ వేధిస్తున్నాడు. నిన్ను చంపి నేను ఆత్మహత్య
చేసుకుంటానని బెదిరిస్తూ.. మెసేజ్‌లు పంపుతున్నాడు. ఆమె వాటిని అంతగా పట్టించుకోలేదు.