అన్వేషించండి

Man Kills Father: తండ్రిని అతిదారుణంగా హత్య చేసిన కొడుకు, మృతదేహాన్ని 30 ముక్కలు చేసి డౌట్ రాకుండా ప్లాన్!

Man Kills Father: కన్నతండ్రినే ఓ కొడుకు అతిదారుణంగా చంపేశాడు. ఐరన్ రాడ్‌తో కొట్టి.... తండ్రిని 30 ముక్కలు చేశాడు. ఆ తర్వాత సొంత పొలంలోని ఓపెన్ బోర్‌వెల్‌లో ఆ శరీర భాగాలను వేసాడు.

Man Kills Father: కన్నతండ్రినే ఓ కొడుకు అతిదారుణంగా చంపేశాడు. ఐరన్ రాడ్‌తో కొట్టి తండ్రి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. ఆ తర్వాత సొంత పొలంలోని  ఓపెన్ బోర్‌వెల్‌లో ఆ శరీర భాగాలను పారవేశాడు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఢిల్లీలోని శ్రద్ధావాకర్ హత్యోదంతం మరవకముందే అలాంటి ఘటనే మరొకటి జరిగింది. ఇదే రీతిలో కర్ణాటకలో ఓ హత్య జరిగింది. కన్నతండ్రినే ఓ కొడుకు అతిదారుణంగా చంపేశాడు. ఐరన్ రాడ్‌తో కొట్టడంతో కుప్పకూలిన తండ్రి మృతదేహాన్ని 30 ముక్కలు చేశాడు. ఆ తర్వాత సొంత పొలంలోనే ఉన్న  ఓపెన్ బోర్‌వెల్‌లో ఆ శరీర భాగాలను వేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటన కర్ణాటకలోని బగల్‌కోట్‌లో చోటుచేసుకుంది.  పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. శరీర భాగాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రొక్లెయిన్‌లను తెచ్చారు. ఓపెన్ బోర్‌వెల్‌ను తవ్వించారు. నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకున్నారు. 

మద్యం మత్తులో వాగ్వివాదం.. ఆపై దారుణం.. 
పరశురామ్ కులాలీ రోజూ మద్యం సేవిస్తాడు. అతనికి ఇద్ధరు పిల్లలు. పెద్ద కుమారుడు తల్లితో కలిసి వేరుగా ఉంటున్నాడు. 20 సంవత్సరాల వయసున్న చిన్న కుమారుడు విఠల్‌, పరశురామ్ కలిసి ఉంటున్నారు. ప్రతి రోజు మద్యం సేవించి వచ్చి చిన్న కొడుకు విఠల్‌ను పరశురామ్ కులాలీ దూషించేవాడు. గత మంగళవారం కూడా పరశురామ్ విఠల్‌ను తిట్టాడు. ఘటన జరిగిన రోజు, పరశురాం విఠల్‌తో వాగ్వాదానికి దిగాడు. మద్యం మత్తులో ఉన్న  విఠల్ ఆవేశంతో ఇనుప రాడ్ చేతిలోకి తీసుకుని తండ్రిని బాదాడు. ఆ దెబ్బతో తండ్రి కుప్పకూలిపోయాడు. పరశురామ్ మరణించాడని నిర్దారించుకున్న విఠల్‌ తండ్రి డెడ్ బాడీని 30 భాగాలుగా కట్ చేశాడు. వాటిని బగల్‌కోట్ జిల్లాలోని ముధోల్ శివారులో మంతూరు బైపాస్ దగ్గర ఉన్న వారి సొంత సాగు భూమిలోని ఓపెన్ బోర్‌వెల్‌లో వేశాడు. 
ఒక మనిషిని జంతువులను  కోసినట్లు ముక్కలు చేసే ఇలాంటి  క్రూరమైన నేరం ఇటీవల ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలో శ్రద్ధావాకర్ హత్యోదంతం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ హత్యతీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది. నిందితుడు అఫ్తాబ్ పూనావాలా ఆమెను హత్య చేసి మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి, ఢిల్లీలోని అటవీ ప్రాంతంలో పడేశాడు. ఇప్పుడు ఈ కేసు కూడా శ్రద్ధా వాకర్ హత్య కేసును పోలి ఉంది.

అఫ్తాబ్ పూనావాలా, శ్రద్ధ.. ముంబయిలోని ఓ కాల్ సెంటర్‌లో పనిచేశారు. అక్కడ వారు మొదట కలుసుకున్నారు. తరువాత డేటింగ్ ప్రారంభించారు. ఆమె కుటుంబం వారి సంబంధాన్ని ఆమోదించకపోవడంతో ఈ జంట దిల్లీకి పారిపోయి లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో జీవిస్తున్నారు. అయితే శ్రద్ధా తల్లిదండ్రులు మాత్రం ఆమె సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా తమ కుమార్తె యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు. కానీ చాలా కాలం నుంచి ఆమె సోషల్ మీడియా ఖాతాలో ఎటువంటి అప్‌డేట్ రాకపోవడంతో శ్రద్ధ తండ్రి దిల్లీకి వచ్చారు. తన కూతురు వివరాలు తెలియకపోవడంతో ఆమె తండ్రి దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.

టాప్ హెడ్ లైన్స్

Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Hyderabad Crime News: కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడిచేసి వ్యక్తి దారుణ హత్య.. హైదరాబాద్‌లో దారుణం
Adulterated Spices: హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
హైదరాబాద్‌లో భారీ కల్తీ దందా రట్టు - 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం.. ముగ్గురు అరెస్ట్!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Assembly Monsoon Sessions: ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
ఆగస్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమరం: డీఎస్సీ చాలెంజ్‌పై వైఎస్సార్‌సీపీ వ్యూహం ఏంటి? సభలోకి వెళ్తుందా.. వీధుల్లోనే పోరు సాగిస్తుందా?
Telangana Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - ఆగస్టు 15 తర్వాత నాంపల్లి కోర్టులో సిట్ అదనపు ఛార్జ్‌షీట్ - కేసీఆర్ పేరు ఉంటుందా?
Vijay vs Udhayanidhi Stalin: తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
తమిళనాట విజయ్ వర్సెస్ ఉదయనిధి స్టాలిన్ - పాత మిత్రుల పొలిటికల్ ఫైట్ వెనుక అసలు ప్లాన్ ఇదేనా?
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Anchor Charmilla: చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
చుడిదార్‌లో చర్మిల ... హ్యాపెనింగ్ యాంకర్ లేటెస్ట్ ఫోటోలు
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Embed widget