అన్వేషించండి

Crime News: పరీక్షలు రాసే అట్టతో తండ్రిని చంపేసిన కుమార్తె- కాలు జారి చనిపోయినట్టు నాటకం!

Annamayya District: పెళ్లి చేసుకొని పద్దతిగా ఉండాలన్న తండ్రిపై పగపట్టిందో కుమార్తె. తన తిరుగుళ్లకు అడ్డువస్తున్నాడని హతమార్చింది. ఇంట్లో ఇన్ని మారణాయుధాలున్నాయా అని పోలీసులే ఆశ్చర్యపోయేలా చేసింది.

Madanapalle Crime News: తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, కుమార్తెను ఆ స్థాయిలోనే చదివించాడు. మంచి వ్యక్తి చేతిలో పెట్టి తల్లిలేని బిడ్డను జాగ్రత్తగా సాగనంపాలని చూశాడు. చెడు తిరుగుళ్లకు అలవాటు పడిన ఆ యువతి మాత్రం అందుకే ఒప్పకోలేదు. అప్పుడే నాకు పెళ్లి ఏంటీ అంటూ తిరగబడింది. తండ్రి చెప్పిన మాటలు రుచించలేదామెకు. అంతే కోపంతో చేతికి ఏది దొరికితే దాంతో కొట్టి చంపేసింది. చివరకు కాలు జారి పడిపోయారని నాటకమాడింది. 

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఈనెల 13న ఈ దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడిన తండ్రినే కడతేర్చిన క్రిమినల్ కుమార్తె కథ ఇది. పీఅండ్‌టీ కాలనీలో ఉంటున్న దొరస్వామికి 62 ఏళ్లు. ఎస్జీటీ టీచర్‌గా పని చేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితమే భార్య చనిపోయారు. వీళ్లకు ఒక్కగానొక్క కుమార్తె. పేరు హరిత. ఆమెను బీఎస్సీ బీఈడీ వరకు చదివించారు. కుమార్తె పెళ్లి కోసం డబ్బులు కూడా కూడబెట్టారు. నగలు కూడా కొనిపెట్టారు. 

భార్య మరణంతో దిగాలుపడిపోయిన దొరస్వామి నగదు, నగలను కుమార్తెకు ఇచ్చేశాడు. తన పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదని ఆమెకు జాగ్రత్తలు చెప్పారు.  ఇదే ఆయన చేసిన తప్పు అయింది. చేతికి డబ్బులు రావడంతోనే హరితలో భారీ మార్పు వచ్చింది. ఇష్టం వచ్చినట్టు తిరగడం మొదలు పెట్టింది. 

తప్పుడు మార్గంలో వెళ్లిన హరిత... ముందు అదే ప్రాంతానికి చెందిన రమేష్‌తో సన్నిహితంగా మెలిగింది. అంతే కాదు తన వద్ద ఉన్న నగలు ఆ వ్యక్తికి అప్పగించింది. వాటిని రమేష్‌ తాకట్టు పెట్టి పదకొండున్నర లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అదే టైంలో సాయికృష్ణ అనే మరో వ్యక్తితో కూడా చెట్టాపట్టాలేసుకొని తిరిగింది. అతికి ఓ 8 లక్షలు ఇచ్చింది. మూడో వ్యక్తి హరీష్‌రెడ్డితో కూడా స్నేహగీతం ఆలపించింది. 

ఇలా ఎవరికి పడితే వాళ్లకు స్నేహం పేరుతో అప్పులు ఇస్తున్న హరిత ప్రవర్తన దొరస్వామికి నచ్చలేదు. పెళ్లి చేస్తే దారిలోకి వస్తుందని సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. ఈ విషయాన్ని కుమార్తె హరితకు చెప్పాడు దొరస్వామి. తనకు పెళ్లే వద్దని మంకుపట్టు పట్టింది. ఈ విషయంలో కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. 

పెళ్లి చేసుకోవాలనే ఒత్తిడి తండ్రి నుంచి ఎక్కువ కావడంతో 13న ఇంట్లో తండ్రిని హతమార్చింది హరిత. చపాతీ కర్ర, పరీక్షలు రాసే అట్ట, తాళం కప్ప, ఇలా ఏది దొరికితే దాంతో తండ్రిని చావబాదింది. అప్పటికే పెద్ద వయసు ఉన్న దొరస్వామి ఆ దెబ్బలకు తాళలేక చనిపోయాడు. 

ఇంట్లో రోజూ గొడవలు సర్వసాధారణమే అయినా ఆ రోజు ఎక్కువ కేకలు వినిపించడంతో చుట్టుపక్కల వాళ్లు దొరస్వామి ఇంటికి వెళ్లి చూశారు. అప్పటికే ఆయన రక్తపు మడుగులో పడి ఉన్నాడు. చూస్తే ప్రాణాలు లేవు. ఏం జరిగిందని కుమార్తె హరితను అడిగితే... ఘర్షణలో కాలుజారి పడిపోయారని చెప్పింది. 

వ్యక్తి చనిపోయిన సంగతిని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి విచారిస్తే తన తండ్రి కాలు జారి పడిపోయారని కుమార్తె హరిత చెప్పింది. ఊరి వాళ్లను అడిగితే ఆమె తిరుగుళ్లు, రోజూ జరిగే గొడవలు గురించి పూసగుచ్చినట్టు వివరించారు. పోస్టు మార్టంలో కూడా తలపై దెబ్బలు ఉన్నట్టు రావడంతో హరితపై అనుమానం వచ్చింది. 

హరితపై అనుమానం వ్యక్తం చేసినపోలీసులు తమ స్టైల్‌లో విచారించారు. అంతే నిజాలు తన్నుకుంటూ వచ్చాయి. తన పెళ్లి ప్రస్తావన పదే పదే చేస్తుండటంతో భరంచలేక తండ్రిని కడతేర్చినట్టు కుమార్తె హరిత అంగీకరించింది. వెంటనే ఆమెను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
Telangana News: హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
Matka Review - మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
Telangana News: హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
హైదరాబాద్‌లోని నందినగర్‌లో హైడ్రామా- రాత్రి నుంచి కేటీఆర్‌ ఇంటి వద్దే బీఆర్‌ఎస్ శ్రేణులు
Kanguva Review: కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
కంగువా రివ్యూ: సూర్య రెండేళ్ల కష్టం - ‘కంగువా’ కనెక్ట్ అయిందా? - హిట్ కొట్టారా?
Matka Review - మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
మట్కా రివ్యూ: వరుణ్ తేజ్ బాగా చేశారు - మరి సినిమా? గ్యాంగ్‌స్టర్ డ్రామా బావుందా? లేదా?
Andhra Pradesh News: సజ్జల భార్గవ్‌, వర్రా రవీందర్‌పై మరో కేసు- నిందితుల కోసం పోలీసుల గాలింపు
సజ్జల భార్గవ్‌, వర్రా రవీందర్‌పై మరో కేసు- నిందితుల కోసం పోలీసుల గాలింపు
Sri Reddy Open Letter: మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
మా అమ్మానాన్న టీడీపీకే ఓటు వేశారు, క్షమించి వదిలేయండి- లోకేష్‌, జగన్‌కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Hyderabad Crime News: ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
ఎగ్జామ్‌ ఆన్సర్ షీట్‌పై సూసైడ్ లెటర్- నా వల్ల కావట్లేదంటూ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
Embed widget