అన్వేషించండి

Cybercrime Alert : ప్రముఖుల డీపీలతో వాట్సాప్ చాట్ - డబ్బులు గుంజేస్తున్న మోసగాళ్లు

Crime News : వాట్సాప్‌లో ప్రముఖుల డీపీలు పెట్టుకునిసైబర్ క్రైమ్స్ చేస్తున్నారు నేరగాళ్లు. పెద్దవాళ్లు అడిగారు కదా అని డబ్బులు పంపిస్తూ చాలా మంది మోసపోతున్నారు.

WhatsApp Cyber Crime :  సైబర్‌ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకీ హద్దుమీరుతున్నాయి. గతంలో మిలటరీ, పోలీస్‌ అధికారుల ఫొటోలు పెట్టుకుని ప్రజల్ని బురిడీ కొట్టించిన సైబర్‌ కేటుగాళ్లు ఇప్పుడు అధికారుల ఫోటోలతో బురిడీ కొట్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా వరంగల్ జిల్లా క‌లెక్ట‌ర్ పి. ప్రావీణ్య  పేరుతో సైబ‌ర్ నేర‌గాళ్లు ఫేస్‌బుక్‌లో న‌కిలీ ఖాతా సృష్టించారు. ఈ ఖాతాను ఉప‌యోగించుకుని ప‌లువురి నుంచి డ‌బ్బు వ‌సూలు చేసేందుకు సైబ‌ర్ నేర‌గాళ్లు య‌త్నిస్తున్నారు. కలెక్టర్ ప్రావీణ్య మీటింగ్ లో ఉన్నానని, అర్జెంట్  డ‌బ్బులు కావాలంటూ  +94776414080 శ్రీలంక నంబర్‌ నుంచి ఆ సందేశం పంపిన సబైర్‌ నేరగాడు డబ్బులు  ఫోన్‌పే చేసి, స్ర్కీన్‌షాట్‌ షేర్‌ చేయాలని కోరాడు. ప‌లువురికి మేసేజ్‌లు పంపించారు.               

 దీన్ని గ‌మ‌నించిన క‌లెక్ట‌ర్ ప్రావీణ్య త‌క్ష‌ణ‌మే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. త‌న అస‌లు ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా అంద‌రిని అప్ర‌మ‌త్తం చేశారు. త‌న పేరుతో ఎవ‌రూ డ‌బ్బులు అడిగిన ఇవ్వొద్ద‌ని క‌లెక్ట‌ర్  సూచించారు. కలెక్టర్ పేరుతో  డబ్బులు అుగుతూ వచ్చే మెసెజ్‌లకు దయచేసి జవాబు ఇవ్వకండి. మరియు వీలైనంత త్వరగా బ్లాక్ చేయమని కలెక్టర్ ప్రావీణ్య ప్రతి ఒక్కరినీ కోరారు.   దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైబర్ కేటుగాళ్లను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.                               

నిజానికి కలెక్టర్ పేరతో వస్తున్న మెసెజుల్లాంటివి ఇంతకు ముందు  తెలంగాణ సీఎస్‌ శాంతి కుమారి . తెలంగాణ డీజీపీ రవి గుప్తా ఫోటోలను వాడుకుని కూడా చేశారు.  డీజీపీ,  సీఎస్‌ ఫొటో డిస్‌ప్లే పిక్చర్‌(డీపీ)గా పెట్టుకుని అధికారులు, సామాన్య ప్రజలకు ఫోన్లు చేశారు.  కొందరికి ఫోన్లు, మరికొందరికి మెసేజ్‌లు పంపారు.  ఏకంగా సచివాలయ అధికారులు, పోలీసు అధికారులకూ  ఫోన్‌ రావడంతో విషయం సీఎస్‌, డీజీపీలకూ తెలిసింది.  కొద్ది రోజులుగా +977 ,  +92 కోడ్ తో పాటు ఇతర దేశాల నుంచి  సైబర్‌ నేరగాళ్లు ఫోన్లు, మెసేజ్‌లు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే  తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు ఈ ముఠాను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 

పోలీసులు సాంకేతికత ఆధారంగా ఎంత కట్టడి చేస్తున్నా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.. మోసగాళ్లు రకరకాలుగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. గిఫ్ట్‌లు, కూపన్లు, కేవైసీల పేరుతో ఇప్పటి వరకు మోసం చేసిన మోసగాళ్లు… ఇప్పుడు రూటు మార్చారు.  తెలియని నెంబర్ల నుంచి వాట్సాప్ కాల్స్ .. మెసెజులకు రిప్లయ్ ఇవ్వవొద్దని పోలీసులు సూచిస్తున్నారు.                                                                                   

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి - ఇంటి గోడలు ఎక్కి నినాదాలు, రేవంతి కుటుంబానికి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ డిమాండ్
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Minister Komatireddy: 'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
'అల్లు అర్జున్ సీఎంకు క్షమాపణ చెప్పాలి' - సినీ ఇండస్ట్రీ పెద్దలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Anger On Allu Arjun: 'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
'అల్లు అర్జున్ ఏమన్నా తీస్‌మార్‌ఖానా?' - ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడకుంటే తోలు తీస్తామంటూ ఏసీపీ విష్ణుమూర్తి వార్నింగ్
Allu Arjun: బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
బాధ్యతగా ఉండండి - ఫ్యాన్స్‌కు బన్నీ ఇంపార్టెంట్ మెసేజ్!
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Embed widget