News
News
X

ఏ మ్యాచ్ నీ వదలరు- నెల్లూరులో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్!

తాజాగా మరోసారి క్రికెట్ బెట్టింగ్ భూతం నెల్లూరులో విస్తరిస్తోంది. పాత నెల్లూరు జిల్లా మరచిపోయిన ఈ సంస్కృతి ఇప్పుడు కొత్తగా ప్రకాశం జిల్లా నుంచి కలసిన ప్రాంతాల్లో బయటపడుతోంది.

FOLLOW US: 

నెల్లూరు జిల్లాపై క్రికెట్ బెట్టింగ్ మరక ఎప్పుడో పడింది. గతంలో కొంతమంది ప్రజా ప్రతినిధుల్ని కూడా క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పట్లో ఆ కేసు వ్యవహారం ఆ తర్వాత బాగా నిదానించింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక, అప్పటి ముద్దాయిలే బాధితులుగా మారిపోయారు. కేసు తేలలేదు. అయితే తాజాగా మరోసారి క్రికెట్ బెట్టింగ్ భూతం నెల్లూరులో విస్తరిస్తోంది. పాత నెల్లూరు జిల్లా మరచిపోయిన ఈ సంస్కృతి ఇప్పుడు కొత్తగా ప్రకాశం జిల్లా నుంచి కలసిన ప్రాంతాల్లో బయటపడుతోంది. బెట్టింగ్ ముఠాలోని ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ దొంగతనం కేసు విచారిస్తుండగా బెట్టింగ్ వ్యవహారం బయటపడటం విశేషం.

కందుకూరు డివిజన్ పరిధిలోని కొండముడుసుపాలెం గ్రామానికి చెందిన కుంచాల లోకేష్‌ చెడు వ్యసనాలకు బానిసై దొంగగా మారాడు. ఆరేళ్లుగా దొంగతనాలు చేస్తూ జైలుకి వెళ్లొస్తున్నాడు. జైలుకి వెళ్లిరావడం అలవాటుగా మారిన తర్వాత దొంగతనాలు మానలేకపోతున్నారు. అదే వ్యసనం ఉన్న మరో ఇద్దరితో లోకేష్ కి పరిచయం ఏర్పడింది. కందుకూరుకు చెందిన సాయికుమార్‌, ఇరపని రామ్‌ నరేష్‌ తో లోకేష్ కి స్నేహం కుదిరింది. కందుకూరు, కావలి ప్రాంతాల్లో బైక్ లపై తిరుగుతూ వీరు దొంగతనాలకు పాల్పడుతున్నారు. పోలీసులకు దొరక్కుండా వారి కళ్లుగప్పి తిరుగుతున్నారు. వీరిపై ఇప్పటి వరకూ మొత్తం ఆరు చోరీ కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఈ దొంగతనం కేసులపై దృష్టి పెట్టిన పోలీసులు ముగ్గురిపై నిఘా పెట్టారు. చివరకు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ముగ్గురినుంచి 5 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.

తీగలాగితే..

అయితే ఇది కేవలం దొంగతనం కేసు మాత్రమే కాదు, బెట్టింగ్ వ్యవహారం కూడా ఇందులో ఉంది అని తేలింది. ఈ ముగ్గురూ దొంగతనం చేయగా వచ్చిన డబ్బుని జల్సాలకు ఖర్చు చేయడంతోపాటు బెట్టింగ్ లకు పాల్పడేవారు. క్రికెట్ బెట్టింగ్ లకోసం ఈ ముగ్గురు ముగ్గురు బెట్టింగ్ నిర్వాహకుల్ని సంప్రదించేవారు. ఆ ముగ్గురి వివరాలు కూడా ఈ దొంగలు బయటపెట్టడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.

News Reels

మెట్రో ఎక్స్ అనే యాప్ ద్వారా..

వలేటివారిపాలెం మండలంలోని శ్రీను, కందుకూరుకు చెందిన విజయ్‌ అలియాస్‌ గోవా, యనమల నాగరాజులు మెట్రోఎక్స్‌ అనే యాప్‌ ద్వారా ఆన్‌ లైన్‌ లో క్రికెట్‌ బెట్టింగ్‌ లకు పాల్పడేవారని తెలిసింది. ఆ యాప్ ద్వారా వారు అప్పటికే పలువుర్ని మోసం చేశారు. కందుకూరు మండలం కొండముడుసుపాలెం గ్రామ సమీపంలో ఈ ముఠా బెట్టింగ్‌ లు నిర్వహిస్తుండేది. విచిత్రం ఏంటంటే.. బెట్టింగ్ లో ఆ ముగ్గురు దొంగలు డబ్బులు భారీగా పోగొట్టుకున్నారు. దీంతో వారు బెట్టింగ్ వ్యవహారాన్ని బట్టబయలు చేశారు. వారిచ్చిన సమాచారంతో కందుకూరు పోలీసులు బెట్టింగ్ ముఠాపై దాడి చేశారు. వారివద్ద రూ.4.42 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. దొంగతనం కేసులో తీగ లాగితే, బెట్టింగ్ ముఠా గుట్టు రట్టయింది. గతంలో కూడా ఈ ముఠా గుట్టు చప్పుడు కాకుండా బెట్టింగ్ నిర్వహించేదని తేలింది. ఇప్పుడు పోలీసులు గట్టిగా ప్రయత్నించా బెట్టింగ్ ముఠాను పట్టుకున్నారు.

Published at : 24 Nov 2022 08:03 AM (IST) Tags: nellore police Cricket betting Nellore Crime nellore thieves

సంబంధిత కథనాలు

Shraddha Murder Case: 'శ్రద్ధాను చంపడానికే దిల్లీ తీసుకువచ్చా- చాలా మందితో సంబంధం ఉంది'

Shraddha Murder Case: 'శ్రద్ధాను చంపడానికే దిల్లీ తీసుకువచ్చా- చాలా మందితో సంబంధం ఉంది'

Bengaluru Rape: బెంగళూరులో ర్యాపిడో గలీజు పని, యువతిపై తెల్లవార్లూ సామూహిక అత్యాచారం!

Bengaluru Rape: బెంగళూరులో ర్యాపిడో గలీజు పని, యువతిపై తెల్లవార్లూ సామూహిక అత్యాచారం!

ఎన్‌హెచ్‌ఆర్‌సీ ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ ఆట కట్టించిన వరంగల్ పోలీసులు

ఎన్‌హెచ్‌ఆర్‌సీ ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ ఆట కట్టించిన వరంగల్ పోలీసులు

Uttar Pradesh: దూసుకెళ్లిన ఎంపీ కాన్వాయ్, చికిత్స పొందుతూ 9 ఏళ్ల బాలుడు మృతి

Uttar Pradesh: దూసుకెళ్లిన ఎంపీ కాన్వాయ్, చికిత్స పొందుతూ 9 ఏళ్ల బాలుడు మృతి

Hayathnagar Molested Case: హయత్ నగర్ రేప్‌ కేసులో విస్మయం కలిగించే నిజాలు, బాలుర తీరుతో దిగ్భ్రాంతి!

Hayathnagar Molested Case: హయత్ నగర్ రేప్‌ కేసులో విస్మయం కలిగించే నిజాలు, బాలుర తీరుతో దిగ్భ్రాంతి!

టాప్ స్టోరీస్

విజయామా? వైఫల్యామా ? రాజధాని విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నది ఎవరు?

విజయామా? వైఫల్యామా ? రాజధాని విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నది ఎవరు?

కేరళలో ‘అవతార్ 2’ బ్యాన్, ఎందుకంటే?

కేరళలో ‘అవతార్ 2’ బ్యాన్, ఎందుకంటే?

India GDP Growth: నేడే విడుదల! జీడీపీ వృద్ధిరేటుపై ఇన్వెస్టర్ల టెన్షన్‌.. టెన్షన్‌!

India GDP Growth: నేడే విడుదల! జీడీపీ వృద్ధిరేటుపై ఇన్వెస్టర్ల టెన్షన్‌.. టెన్షన్‌!

IND vs NZ 3rd ODI: కివీస్ బౌలర్ల ధాటికి భారత్ విలవిలా- న్యూజిలాండ్ లక్ష్యం ఎంతంటే!

IND vs NZ 3rd ODI: కివీస్ బౌలర్ల ధాటికి భారత్ విలవిలా- న్యూజిలాండ్ లక్ష్యం ఎంతంటే!