News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Coromandel Express Accident: ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొనడంతో 70 మందికి పైగా మృతి! - ఒక్కో కుటుంబానికి రూ.12 లక్షల పరిహారం

ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు  రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ నష్టపరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరి చొప్పున రూ.10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

FOLLOW US: 
Share:

Coromandel Express Accident Ex-gratia Compensation: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బాలాసోర్ జిల్లా బహనాగ్ రైల్వే స్టేషన్ సమీపంలో మూడు రైళ్లు ఢీకొనడంతో 70 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. మరో 500 మంది గాయపడ్డారు. తొలుత బహనాగ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న ఓ గూడ్సు రైలు ను కోల్ కతా నుంచి చెన్నైకి వెళ్తున్న కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ 7 బోగీలు పట్టాలు తప్పాయి. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ కొన్ని బోగీలు పట్టాలు తప్పి పక్క లైన్ లో వెళ్తున్న యశ్వంతపూర్ రైలును ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత మరింత పెరింగింది.

సమాచారం అందగానే ఒడిషా ప్రభుత్వం అప్రమత్తమైంది. 50 అంబులెన్సులను ప్రమాద స్థలానికి పంపించింది. ఎన్డీఆర్ఎఫ్, ఇతర సహాయక బృందాలను అక్కడికి పంపి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించింది. గాయపడిన వారి సంఖ్య 500కి పైగా ఉంది. వీరిలోనూ కొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిని సోరో సీహెచ్‌సీకి, గోపాల్ పూర్ సీహెచ్సీ, ఖాంటపాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చికిత్స కోసం తరలించినట్లు ఒడిశా చీఫ్ సెక్రటరీ ప్రదీప్ జేనా తెలిపారు.

పరిహారం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. 
రెండు ప్యాసింజర్, ఒక గూడ్స్ రైలు ఢీకొన్న ప్రమాదంలో దాదాపు 70 మందికి వరకు ప్రాణాలు కోల్పోయారని, 500 మంది గాయపడి ఉంటారని తెలుస్తోంది. అధికారికంగా మృతుల సంఖ్యను అధికారులు ప్రకటించకపోయినా.. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు  రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ నష్టపరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరి చొప్పున రూ.10 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. తీవ్రగాయాలు లేదా వైకల్యం ఏర్పడిన వారికి రూ.2 లక్షలు పరిహారం ప్రకటించారు. స్వల్ప గాయాలైన వారికి రూ.50 వేల పరిహారాన్ని ప్రకటిస్తూ కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ట్వీట్ చేశారు.

జరిగిన ప్రమాదంపై ఒడిషా సీఎస్ ప్రదీప్ జేనా స్పందించారు. ఘటనలో మూడు రైళ్లు ప్రమాదానికి గురైనట్లు ప్రదీప్ జేనా స్పష్టం చేశారు. ఒఢిశా సీఎం నవీన్ పట్నాయక్ తో తమిళనాడు సీఎం స్టాలిన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాట్లాడారు. ఖరగ్ పూర్, చెన్నై, బాలాసోర్ లలో అత్యవసర సహాయక కేంద్రాలను రైల్వే ఏర్పాటు చేసింది. జరిగిన ప్రమాదంపై రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్ ఖర్, ప్రధాని మోదీ, కాంగ్రెస్ రాహుల్ గాంధీ తీవ్రదిగ్ఙ్రాంతి వ్యక్తం చేశారు. 

ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి మరో రూ.2 లక్షల పరిహారం 
రైలు ప్రమాదంలో మరణించిన వారి బంధువులకు రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు ప్రధాని మోదీ. ఒడిశా బాలాసోర్ లో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రధాన మంత్రి అత్యవసర సహాయనిధి నుంచి రూ.2 లక్షలు, గాయపడిన వారికి  రూ. 50,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు ప్రధాని మోదీ.

Published at : 02 Jun 2023 11:41 PM (IST) Tags: Train Accident Odisha Train Accident Coromandel Express Accident Odisha Train Accident News Balasore Train Accident Odisha Train Accident Live

ఇవి కూడా చూడండి

Minor Suspicious Death: బావిలో విద్యార్థిని డెడ్ బాడీ - సోషల్ మీడియాలో ప్రచారాన్ని నమ్మవద్దన్న ఏఎస్పీ

Minor Suspicious Death: బావిలో విద్యార్థిని డెడ్ బాడీ - సోషల్ మీడియాలో ప్రచారాన్ని నమ్మవద్దన్న ఏఎస్పీ

Chittoor Inter Student Death: బావిలో శవమై తేలిన ఇంటర్‌ విద్యార్థిని- అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపణలు

Chittoor Inter Student Death: బావిలో శవమై తేలిన ఇంటర్‌ విద్యార్థిని- అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపణలు

Adinarayana Missing: పెడనలో ఫొటోగ్రాఫర్ మిస్సింగ్ కలకలం- సూసైడ్ లెటర్ లో మంత్రి జోగి రమేష్ పేరు

Adinarayana Missing: పెడనలో ఫొటోగ్రాఫర్ మిస్సింగ్ కలకలం- సూసైడ్ లెటర్ లో మంత్రి జోగి రమేష్ పేరు

Chittoor Inter Student Death: ఇంటర్ విద్యార్థిని మృతి కేసు, తాజాగా బావిలో తల వెంట్రుకలు లభ్యం - ల్యాబ్ కు పంపిన పోలీసులు

Chittoor Inter Student Death: ఇంటర్ విద్యార్థిని మృతి కేసు, తాజాగా బావిలో తల వెంట్రుకలు లభ్యం - ల్యాబ్ కు పంపిన పోలీసులు

boy suicide: అపార్ట్మెంట్ పైనుంచి దూకిన పదో తరగతి విద్యార్థి సూసైడ్- చివరి నిమిషంలో తల్లికి మెస్సేజ్!

boy suicide: అపార్ట్మెంట్ పైనుంచి దూకిన పదో తరగతి విద్యార్థి సూసైడ్- చివరి నిమిషంలో తల్లికి మెస్సేజ్!

టాప్ స్టోరీస్

CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు

CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు

Kishan Reddy On Ktr : ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ !

Kishan Reddy On Ktr :  ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ !

Nithya Menen: నిత్యా మీనన్‌పై తమిళ హీరో వేధింపులు - బాధగా ఉందంటూ నటి పోస్ట్

Nithya Menen: నిత్యా మీనన్‌పై తమిళ హీరో వేధింపులు - బాధగా ఉందంటూ నటి పోస్ట్

Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!

Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!