అన్వేషించండి

NEET Paper Leak: 'నీట్ ప్రశ్నాపత్రం కోసం 144 మంది డబ్బులిచ్చారు' - పేపర్ లీకేజీపై సీబీఐ దర్యాపులో కీలక విషయాలు

NEET: దేశవ్యాప్తంగా సంచలన సృష్టించిన నీట్ యూజీ - 24 పేపర్ లీకేజీకి సంబంధించి సీబీఐ దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. 144 మంది అభ్యర్థులు డబ్బులు చెల్లించినట్లు తేల్చింది.

CBI Investigation On NEET - UG 24 Paper Leak: నీట్ యూజీ - 2024 ప్రశ్నాపత్రం లీకేజీ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేయగా కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. పేపర్ లీకేజీ వ్యవహారంలో మొత్తం 144 మంది అభ్యర్థులు డబ్బులు చెల్లించినట్లు తేల్చింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ గత వారం మూడో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. పరీక్ష జరగడానికి కొద్ది గంటల ముందే ఝార్ఖండ్‌ హజారీబాగ్‌లోని ఒయాసిస్ స్కూల్ నుంచి పంకజ్ కుమార్ అనే వ్యక్తి చేతుల మీదుగా నీట్ పేపర్ లీక్ అయినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ గుర్తించింది. ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ సహకారంతోనే పేపర్ బయటకు వచ్చినట్లు ఛార్జిషీట్‌లో పేర్కొంది. 

దర్యాప్తులో ఏం తేలిందంటే.?

'నీట్ పరీక్ష జరిగిన రోజు (మే 5) ఉదయం 8 గంటలకు ప్రశ్నపత్రాలు పాఠశాలకు చేరుకున్నాయి. ఆ టైంలో పరీక్షా కేంద్రానికి కోఆర్డినేటర్‌గా ఉన్న హసనుల్ హక్.. ఐఐటీ జెంషడ్‌పూర్‌కు చెందిన ఓ సివిల్ ఇంజినీర్‌ను ప్రశ్నాపత్రం బాక్స్ ఉన్న గదిలోకి పంపించాడు. ప్రత్యేక టూల్ కిట్ సాయంతో ఆ పెట్టెను తెరిచాడు. ప్రశ్నాపత్రం మొత్తాన్ని ఫోటో తీసుకున్నాడు. అనంతరం యథావిధిగా దాన్ని పెట్టెలో పెట్టి మునుపటిలానే సీల్ వేశాడు. బయటకు వచ్చిన అనంతరం ఆ ప్రశ్నపత్రాన్ని ఓ గెస్ట్ హౌస్‌లో ఉన్న మరో వ్యక్తికి పంపించాడు. అక్కడున్న 9 మంది వైద్య విద్యార్థులు ప్రశ్నపత్రానికి సమాధానాలు పూర్తి చేశారు. వాటిని వివిధ ప్రాంతాల్లోని గ్యాంగ్ సభ్యులకు పంపించారు. ఆ తర్వాత డబ్బులు చెల్లించిన అభ్యర్థులకు వాటిని చేరవేశారు.' అని సీబీఐ దర్యాప్తులో వెల్లడైంది. కాగా, పేపర్ లీకేజీకి సంబంధించి 298 మంది సాక్షులు, 290 డాక్యుమెంట్లు, 45 మార్గాల్లో లభించిన సమాచారం ఆధారంగా 5,500 పేజీల ఛార్జ్ షీట్‌ను సీబీఐ రూపొందించింది.

Also Read: Viral News : మరి పెళ్లంటే అన్నీ చూసుకోవాలి బ్రో - వధువు కోసం ఓ మగాడిచ్చిన ప్రకటన వైరల్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
WPL Auction: అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
WPL Auction: అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
అన్ క్యాప్డ్ ఇండియన్‌ ప్లేయర్‌కి కళ్లు చెదిరే ధర, 16 ఏళ్ల అమ్మాయిపై కనక వర్షం- ముగిసిన డబ్ల్యూపీఎల్ వేలం
AP CM Chandra Babu: పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
ఏపీలో పొట్టి శ్రీరాముల పేరుతో తెలుగు యూనివర్శిటీ- విజయవాడలో ప్రకటించిన సీఎం చంద్రబాబు 
MLC Kavitha Tour: జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
జగిత్యాలలో 22 అడుగుల ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం- ప్రభుత్వ జీవో ధిక్కరించి భూమి పూజ చేసిన కవిత 
Jamaili Elections: జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
జమిలి ఎన్నికల బిల్లులపై పునరాలోచనలో కేంద్రం - లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి తొలగింపు
PV Sindhu Meets Pawan Kalyan: సార్‌, పెళ్లికి రండీ! డిప్యూటీ సీఎం పవన్‌ను ఆహ్వానించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు
సార్‌, పెళ్లికి రండీ! డిప్యూటీ సీఎం పవన్‌ను ఆహ్వానించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు
Embed widget