KVP: కేవీపీ ఇంట్లో చోరీ- రూ. 46 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ మాయం- పని మనుషలపై అనుమానం
కేవీపీ ఇంట్లో చోరీ జరిగింది. 46 లక్షల విలువైన నెక్లెస్ మాయమైంది.
![KVP: కేవీపీ ఇంట్లో చోరీ- రూ. 46 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ మాయం- పని మనుషలపై అనుమానం Burglary In KVP Ramachandra Rao House- Rs. 46 lakh worth of diamond necklace Theft KVP: కేవీపీ ఇంట్లో చోరీ- రూ. 46 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ మాయం- పని మనుషలపై అనుమానం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/05/31/0c0207ca0897c7fdceb7f6540b19302b_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు ఇంట్లో చోరీ జరిగింది. హైదరాబాద్ బంజారహిల్స్‌లోని నివాసంలో ఈ చోరీ జరిగింది. కేవీ భార్య సునీతకు చెందిన 49 గ్రాముల విలువైన డైమండ్ నెక్సెస్ ఎత్తుకెళ్లిపోయారు.
కేవీపీ ఇంట్లో చోరీ అయిన డైమండ్ నెక్లెస్ విలువ సుమారు 46 లక్షల రూపాయలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు కేవీపీ భార్య సునీత. విలువై వైట్ డైమండ్ అని తెలిపారు. ఈ నెల 11 జరిగిన ఓ ఫంక్షన్‌కు ఆ నెక్లెస్ పెట్టుకొని వెళ్లానని వివరించారు. వచ్చిన తర్వాత దాన్ని తీసి బెడ్‌రూంలో పెట్టామన్నారు.
కాసేపటి తర్వాత చూస్తే బెడ్‌రూంలో పెట్టిన నెక్లెస్ కనిపించడం లేదని ఇళ్లంతా వెతికినా దొరకలేదని బంజారాహిల్స్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించారు కేవీపీ భార్య సునీత. ఇంట్లో పని మనుషుల్లో ఎవరైనా ఇది తీసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారామె.
కేసు రిజిస్టర్ చేసుకున్న పోలీసులు పని మనుషులను విచారిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)