Bengaluru: నాలుగేళ్ల కూతురుని అపార్ట్‌మెంట్ పై నుంచి విసిరి పారేసిన తల్లి, తానూ ఆత్మహత్యాయత్నం
Bengaluru: కూతురు మానసిక సమస్యలతో బాధ పడుతుండటాన్ని తట్టుకోలేక ఓ తల్లి నాలుగో అంతస్తు నుంచి కిందకు విసిరేసింది. తానూ ఆత్మహత్యకు యత్నించింది.
Bengaluru:
చిన్నారికి మానసిక సమస్యలుండటం వల్లే..
బెంగళూరులో దారుణ ఘటన జరిగింది. ఓ తల్లి తన నాలుగేళ్ల కూతురుని నాలుగో అంతస్థు నుంచి కిందకి విసిరేసింది. ఆ తరవాత తానూ
అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే వచ్చి ఆమెను కాపాడారు. ఆ చిన్నారి మాత్రం అక్కడికక్కడే మృతి చెందింది. బెంగళూరులోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ జిల్లాలో సంపంగిరామ్‌నగర్‌లో జరిగింది ఈ దారుణం. డెంటిస్ట్‌గా పని చేస్తున్న సుష్మ, తాను నివసిస్తున్న అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్తు నుంచి బిడ్డను కిందకు విసిరేసినట్టు పోలీసులు వెల్లడించారు. చిన్నారి మానసిక సమస్యలతో బాధపడుతోందని నిర్ధరించారు. ఈ కారణంగానే తల్లి ఒత్తిడికి గురై ఈ పని చేసిందని వివరించారు. అపార్ట్‌మెంట్‌లోని సీసీ కెమెరాలో ఈ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. కూతురితో పాటు బాల్కనీలోకి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చిన నిందితురాలు, ఉన్నట్టుండి చిన్నారిని ఎత్తుకుని పై నుంచి కిందకు పడేసింది. తాను కూడా ఆత్మహత్య చేసుకోవటానికి గ్రిల్స్ ఎక్కి ఆగిపోయింది. పక్క ఫ్లాట్‌లో ఉంటున్న ఇద్దరు, ఆమెను చూసి పరిగెత్తుకుంటూ వచ్చి కాపాడారు. పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.
Shocker from #Bengaluru: Mother throws her own child to death from the 5th floor of her apartment. Incident happened at SR Nagar.After throwing her child to death-she attempted suicide herself.But was saved by the residents. #Karnataka
— Aijaz Bin ishaq (@AijazAwalqi) August 5, 2022
Via @KeypadGuerilla pic.twitter.com/lvWdtTYzhL
Horrific Incident:
— Mansimran Kaur (@Mansimran27) August 5, 2022
Bengaluru woman arrested for throwing mentally challenged daughter from 4th floor. #banglore pic.twitter.com/IYgU35q7kA
Also Read: వంట గదిలోనే స్నానాలు, బాసర ట్రిపుల్ ఐటీలో మరో అరాచకం- వెలుగులోకి తెచ్చిన విద్యార్థులు!A woman threw her 4-year-old Mentally- challenged child from 4th floor of an apartment in Bengaluru and later attempted suicide.
— Harika 💎 (@karukola_harika) August 5, 2022
.
.
Isn't this unfair to the little child?
.
.
How could someone be so INHUMANE?
Such a heartbreaking news 💔 #Bengaluru #SuicideAwareness pic.twitter.com/UienDBvPZf
Also Read: Bhadradri Kottagudem News : మహిళా సర్పంచ్ పై అత్యాచారయత్నం, అవమానం భరించలేక ఆత్మహత్య!