Bathinda Military Station: బఠిండా మిలిటరీ స్టేషన్‌లో మరోసారి కాల్పులు, జవాన్ మృతి - ఆత్మహత్య చేసుకున్నాడా?
Bathinda Military Station: బఠిండా మిలిటరీ స్టేషన్‌లో కాల్పులు జరిగి ఓ జవాన్ మృతి చెందాడు.
![Bathinda Military Station: బఠిండా మిలిటరీ స్టేషన్‌లో మరోసారి కాల్పులు, జవాన్ మృతి - ఆత్మహత్య చేసుకున్నాడా? Bathinda Military Station Another Soldier Dies Of Gunshot Army Says No Link To Previous Firing Bathinda Military Station: బఠిండా మిలిటరీ స్టేషన్‌లో మరోసారి కాల్పులు, జవాన్ మృతి - ఆత్మహత్య చేసుకున్నాడా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/13/12711d1eae216ea9ce79e96e9f80c7c91681364764625517_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bathinda Military Station Firing:
డ్యూటీలో ఉండగా మృతి
పంజాబ్‌లోని బఠిండా మిలిటరీ స్టేషన్‌లో మరోసారి కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఓ జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దగ్గర్లోని ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. ఏప్రిల్ 11వ తేదీన సెలవులు ముగించుకుని డ్యూటీలో చేరాడు. సెంట్రీ డ్యూటీ చేస్తుండగా కాల్పులు జరిగాయి. గన్‌షాట్ కారణంగానే జవాన్ మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు.
"గన్‌షాట్ కారణంగా ఓ జవాన్ మృతి చెందాడు. సర్వీస్ వెపన్‌తో సెంట్రీ డ్యూటీ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆ వెపన్‌తో పాటు క్యాట్‌రిడ్జ్ కూడా జవాన్ పక్కనే పడి ఉన్నాయి. సమీపంలోని మిలిటరీ హాస్పిటల్‌కి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయింది. అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. అంతకు ముందు జరిగిన ఘటనతో దీనికి ఎలాంటి సంబంధం లేదు."
- ఆర్మీ అధికారులు
ఈ ఘటన ఎలా జరిగిందని ఆరా తీస్తున్నారు అధికారులు. ఆత్మహత్య చేసుకున్నాడా..? అన్న కోణంలో విచారిస్తున్నారు.
"ఈ జవాన్ ఏప్రిల్ 11వ తేదీ సెలవులు ముగించుకుని వచ్చాడు. డ్యూటీలో చేరాడు. ఇంతలోగా ఇలా జరిగింది. ఇది ఆత్మహత్యగా అనుమానిస్తున్నాం"
- ఆర్మీ అధికారులు
Army Jawan dies of gunshot wound in Punjab's Bhatinda, no link to military station firing
— ANI Digital (@ani_digital) April 13, 2023
Read @ANI Story | https://t.co/lhBoyv3Tak
#militarystationfiring #Punjab #Bhatinda pic.twitter.com/HQXVw9PRr8
అంతకు ముందు రోజు (ఏప్రిల్ 12) కాల్పులు జరిగాయి. కంటోన్మెంట్ ప్రాంతాన్ని మూసివేశారు. ఈ ఘటన తర్వాత కంటోన్మెంట్ లోకి ఎవరినీ అనుమతించడం లేదు. కంటోన్మెంట్ లో కాల్పులు జరిగాయని, అందులో నలుగురు సైనికులు మరణించారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. తెల్లవారుజామున 4.35 గంటలకు బఠిండా మిలిటరీ స్టేషన్ లో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురికి గాయాలైనట్లు ఆర్మీ సౌత్ వెస్ట్రన్ కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది. స్టేషన్ క్విక్ రియాక్షన్ బృందాలను రంగంలోకి దింపి ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సీల్ చేశారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇది ఉగ్రవాద ఘటన కాదని పంజాబ్ సీనియర్ పోలీసు అధికారికి ఆర్మీ చెప్పినట్లు తెలుస్తోంది. 80 మీడియం రెజిమెంట్ ఆర్టిలరీ ఆఫీసర్స్ మెస్ లో కాల్పులు జరిగాయి. కొద్ది రోజుల క్రితం ఈ యూనిట్ లోని గార్డు రూమ్ నుంచి అసాల్ట్ రైఫిల్ కనిపించకుండా పోయింది. అక్కడే ఈ కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది. అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాలు మాత్రం ఇంకా తెలియడం లేదు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)