అన్వేషించండి

AP News: కాకినాడ బోట్ క్లబ్ చెరువులో ఇద్దరు చిన్నారుల గల్లంతు, విశాఖలో మూడేళ్ల బాలిక మృతి

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ప్రమాదవశాత్తు చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మరణించారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా విశాఖలో మూడేళ్ల చిన్నారి మృతి చెందింది.

తూర్పుగోదావరి జిల్లా  కాకినాడ రూరల్ బోట్ క్లబ్ వద్ద విషాద ఘటన చోటుచేసుకుంది. బోట్ క్లబ్ చెరువులో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు పిల్లలు చిన్నారులు మృతి చెందారు. ఆదివారం సెలవు కావడంతో బోట్ క్లబ్ చెరువులో సరదాగా చేపలు గేలం వేస్తూ ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. సుమారు ఉదయం 11 గంటల సమయంలో బయటకు వెళ్లిన చిన్నారులు, ఎప్పటికీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. చెరువులో నుంచి చిన్నారుల మృతదేహాలను వెలికి తీశారు. ఈ ప్రమాదంలో చనిపోయిన పిల్లలు కిలాడీ నాగయక్ష సూర్య కుమార్(12), వాసంతి నోవా(10). ఇద్దరు కుమారులు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్న రోధిస్తున్నారు. బోట్ క్లబ్ చెరువు చుట్టూ రక్షణ వలయం లేకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. 

రోడ్డు ప్రమాదంలో మూడేళ్ళ బాలిక మృతి

విశాఖపట్నం జూ పార్కు జంక్షన్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ  ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న దంపతులు, మూడేళ్ల చిన్నారి కింద పడిపోయారు. అయితే దంపతలు ఇద్దరు కొద్దీ పాటి గాయలుతో బయటపడ్డారు. కానీ కిందపడిపోయిన చిన్నారి పై నుంచి కారు దూసుకుపోవడంతో చిన్నారి అక్కడికక్కడే మరణించింది. ఈ ప్రమాదంలో విశాఖ ఎంవీపీ కాలనీకి చెందిన నిహారిక(3) అనే చిన్నారి మృతి చెందింది. అయితే రోడ్డు ప్రమాదానికి కారణమైన కారు ఆపకుండా వెళ్లిపోతుండగా స్థానికులు వెంటపడి ఆపి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అరిలోవ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కారును నడిపే వ్యక్తిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. మూడేళ్ల చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. 

AP News: కాకినాడ బోట్ క్లబ్ చెరువులో ఇద్దరు చిన్నారుల గల్లంతు, విశాఖలో మూడేళ్ల బాలిక మృతి

ముగ్గురు చిన్నారులతో జూరాల కాల్వలో దూకిన తల్లి

కుటుంబ తగాదాల కారణంతో ముగ్గురు పిల్లలతో కలిసి ఓ తల్లి జూరాల కాల్వలో దూకింది. తెలంగాణలోని వనపర్తి జిల్లా పెబ్బేరు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తల్లితో పాటు ఇద్దరు పిల్లలు గల్లంతు కాగా కాల్వలో కొట్టుకుపోతున్న మరో బాలుడిని స్థానికులు రక్షించారు. గల్లంతైన వారి కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. స్థానికుల సాయంతో గల్లంతైన వారిని గాలింపు చేపట్టారు. భర్త వేధింపులే ఈ ఘటనకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Embed widget