By: ABP Desam | Updated at : 27 Nov 2022 08:41 PM (IST)
అనకాపల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం
Anakapalli Road Accident - అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
- కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి
- జాతీయరహదారిపై పోతురెడ్డిపాలెం జంక్షన్ సమీపంలో ఘట.
- మృతులలో ఇద్దరు కిర్లంపూడికి చెందిన అన్నాచెల్లెళ్లు
యలమంచిలి : అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై పోతురెడ్డిపాలెం జంక్షన్ సమీపంలో కారు ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఆదివారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మొదట స్కూటీ పై వెళుతున్న ఒకరిని కారు ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న ఇద్దరి పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు.
అసలేం జరిగిందంటే..
విశాఖ వైపు నుంచి ఓ కారు విజయవాడ వైపు వెళ్తోంది. వేగంగా వెళ్తున్న కారు ఒక్కసారిగా రోడ్డు ప్రమాదానికి గురైంది. మొదట ఓ వాహనదారుడ్ని ఢీకొట్టిన కారు, ఆపై పాదచారులపైకి దూసుకెళ్లినట్లు సమాచారం. స్కూటీపై వెళ్తున్న వ్యక్తి కారు ఢీకొనడంతో చనిపోయాడు. కారు దూసుకెళ్లడంతో ఇద్దరు పాదచారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. మృతులలో ఇద్దరు కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం గజపతి నగరానికి చెందిన వారు. మొల్లేటి శివాజీ (45), భీశెట్టి కుమారి (35) అన్నాచెల్లెళ్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన మరో వ్యక్తి యలమంచిలి మండలం పద్మనాభరాజు పేట వాసిగా గుర్తించారు. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని చెన్నై- కోల్ కత్తా జాతీయ రహదారిపై అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో.. బస్సులో ప్రయాణిస్తున్న పలువురు భక్తులకు గాయాలయ్యాయి. pic.twitter.com/PfYu8GKI0N
— DD News Andhra (అధికారిక ఖాతా) (@DDNewsAndhra) November 27, 2022
అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న బస్సుకు ప్రమాదం
ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని చెన్నై- కోల్ కత్తా జాతీయ రహదారిపై అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో.. బస్సులో ప్రయాణిస్తున్న పలువురు భక్తులకు గాయాలయ్యాయి. దీంతో సమాచారం అందుకున్న 108 సిబ్బంది గాయపడిన వారిని ఒంగోలులోని ప్రభుత్వ సర్వ జన ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అందిస్తున్నారు. ఈ బస్సు.. తుని నుండి శబరిమలై వెళ్తోంది. బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది భక్తులలో కొంతమంది స్వల్పంగా గాయపడ్డారు.
Viral News: అరే ఏంట్రా ఇదీ ! ఏకంగా రైలు పట్టాలను ఎత్తుకెళ్లిన దొంగలు - ఇద్దరు ఉద్యోగులపై వేటు !
Guntur Hospital: ఆ ఆస్పత్రిలో ఐదేళ్లుగా ఎలుకలపై యుద్ధం - కోట్లు ఖర్చయ్యాయి కానీ ఇప్పటికీ ...
Turkey Earthquake: టర్కీ, సిరియాలో భారీ భూకంపం, 1300 మందికి పైగా మృతి - భారత్ ఆపన్న హస్తం !
TSRTC Bus Accident : ఛాతీలో నొప్పి బస్సులోంచి దూకేసిన డ్రైవర్, ఆర్టీసీ బస్సు బోల్తా
Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం, పేకమేడల్లా కూలిపోయిన భవనాలు, 10 మంది మృతి
Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!
Love Marriage : సరిహద్దులు లేని ప్రేమ - ఆదిలాబాద్ అబ్బాయితో మయన్మార్ అమ్మాయికి పెళ్లి
Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!
Border Gavaskar Trophy: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో డబుల్ సెంచరీ చేసిన మాజీ భారత ఆటగాళ్లు వీరే - లిస్ట్‌లో ఐదుగురు!