అన్వేషించండి

Paravada Accident : పరవాడ ఫార్మా సిటీలో ఘోర ప్రమాదం, ఐదుగురు కార్మికులు మృతి!

Paravada Accident : అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.

Paravada Accident : అనకాపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. పరవాడ ఫార్మా సిటీ లారెస్ కంపనీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో కార్మికుడినికి కిమ్స్ హాస్పిటల్ కి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో కార్మికుడు మృతి చెందినట్లు సమాచారం. నలుగురి కార్మికులు మృతదేహాలను కేజీహెచ్ మార్చురీకి తరలించారు. మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.  పరవాడ లారెస్ ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మృతులు రాంబాబు (ఖమ్మం), రాజేష్ బాబు (గుంటూరు), రామకృష్ణ (కోటపాడు), వెంకట్రావు (చోడవరం), సతీష్ అని గుర్తించారు. 

తిరుమలలో ముగ్గురు మృతి 

తిరుమలలో ముగ్గురు మృతి చెందారు. గుండెపోటుతో ఇద్దరు భక్తులు, ఒక టీటీడీ ఉద్యోగి మరణించారు. వీరిలో సురేష్ బాబు (40) టీటీడీ ఉద్యోగిగా గుర్తించారు. తమిళనాడుకు చెందిన కొత్తయండాళ్(63)గా మహిళ భక్తురాలు,  హైదరాబాద్ కు చెందిన కిరణ్ కుమార్ అనే భక్తుడు గుండెపోటుతో మృతి చెందారు. వారిని ఆశ్విణీ ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందినట్లు తెలుస్తోంది. 

మద్యం మత్తులో కారుతో బీభత్సం 

జగిత్యాల పట్టణంలోని కొత్త బస్ స్టాండ్ వద్ద సోమవారం రాత్రి కారు బీభత్సం సృష్టించింది. కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అతిగా మద్యం సేవించి అతి వేగంతో బస్ స్టాండ్ వద్ద బైక్ వెళ్తోన్న ఇద్దరిని ఢీ కొట్టారు. అక్కడ ఉన్న స్థానికులు కారును ఆపే ప్రయత్నం చేయగా అదే స్పీడ్ తో కారును బస్ స్టాండ్ ఆవరణలోనికి తీసుకెళ్లి లోపల మరో ఇద్దరు ప్రయాణికులను ఢీ కొట్టారు. 
 

ఆదిలాబాద్ లో రోడ్డు ప్రమాదం 

ఆదిలాబాద్ జిల్లాలో  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొని నలుగురు మృతి చెందారు. తాంసి మండలంలోని హస్నాపూర్ వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా వేగంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ప్రమాదాన్ని గమనించి గాయపడిన వారిని అంబులెన్స్ లో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడగా.. మరో మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. మహారాష్ట్రలోని కిన్వట్ - ఆంద్ బోరి నుంచి ఆదిలాబాద్ వైపు వస్తున్న బైక్ ను తాంసి మండలం హస్నాపూర్ వద్ద ఎదురుగా వస్తున్న మరో బైక్ బలంగా ఢీ కొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇచ్చోడ మండలం కేంద్రంలోని అశోక్ నగర్ కు చెందిన మనీషా(15), సంస్కార్ (11), వీరి తండ్రి మారుతి (40) మృతి చెందారు. తల్లి వందనకు తీవ్ర గాయాలయ్యాయి. మరో మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోగా, మరొకరు మృత్యువుతో  పోరాడుతున్నారు. దీంతో అశోక్ నగర్ లో విషాదం అలుముకుంది. అతివేగమే రోడ్డు ప్రమాదానికి కారణమని పోలీసులు అంటున్నారు. 
 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Shamshabad Tahsildar ACB: డబ్బులు బయటకు విసిరేశారు.. టాయిలెట్‌లో ఫైళ్లు దాచి పెట్టారు - ఏసీబీ దాడితో శంషాబాద్ తహసీల్దార్ కష్టాలు
డబ్బులు బయటకు విసిరేశారు.. టాయిలెట్‌లో ఫైళ్లు దాచి పెట్టారు - ఏసీబీ దాడితో శంషాబాద్ తహసీల్దార్ కష్టాలు
Online Betting Racket: రెడ్డీ అన్న పేరుతో బెట్టింగ్ యాప్ - కోల్‌కతాలో విశాఖ పోలీసుల ఆపరేషన్ - సంచలన విషయాలు వెలుగులోకి..
రెడ్డీ అన్న పేరుతో బెట్టింగ్ యాప్ - కోల్‌కతాలో విశాఖ పోలీసుల ఆపరేషన్ - సంచలన విషయాలు వెలుగులోకి..
Hyderabad Crime News: హైదరాబాద్‌లో మరో నేపాలీ గ్యాంగ్ అరాచకం.. ఓ ఇంట్లో 75 తులాల బంగారం, 20 కిలోల వెండి చోరీ
హైదరాబాద్‌లో మరో నేపాలీ గ్యాంగ్ అరాచకం.. ఓ ఇంట్లో 75 తులాల బంగారం, 20 కిలోల వెండి చోరీ
Bandi Bhagirath POCSO Case: బండి భగీరథ్ కేసులో కీలక పరిణామం.. తప్పు చేస్తే సహించేది లేదన్న బండి సంజయ్
బండి భగీరథ్ కేసులో కీలక పరిణామం.. తప్పు చేస్తే సహించేది లేదన్న బండి సంజయ్

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Agri Gold Victims: అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ - ఆరు నెలల్లో ఖాతాల్లోకి నగదు.. క్లియరెన్స్‌కు హై లెవల్ కమిటీ!
అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ - ఆరు నెలల్లో ఖాతాల్లోకి నగదు.. క్లియరెన్స్‌కు హై లెవల్ కమిటీ!
Uttar Pradesh Storm: రాకాసి గాలులంటే ఇవి - మనుషులే ఎగిరిపోయారు - యూపీ దృశ్యాలు చూస్తే షాకే
రాకాసి గాలులంటే ఇవి - మనుషులే ఎగిరిపోయారు - యూపీ దృశ్యాలు చూస్తే షాకే
Spy Thrillers OTT : న్యూక్లియర్ వెపన్... ఇండియన్ ఏజెంట్స్ సీక్రెట్ ఆపరేషన్ - ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ స్పై యాక్షన్ థ్రిల్లర్
న్యూక్లియర్ వెపన్... ఇండియన్ ఏజెంట్స్ సీక్రెట్ ఆపరేషన్ - ఓటీటీలోకి వచ్చేసిన రీసెంట్ స్పై యాక్షన్ థ్రిల్లర్
Breaking News: ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం- ప్రభుత్వ ఉద్యోగులకు రెండు రోజులు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌!
ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం- ప్రభుత్వ ఉద్యోగులకు రెండు రోజులు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌!
Memu Coplam OTT : విలేజ్‌లో కోడి మిస్సింగ్ మిస్టరీ - మెగా బ్రదర్ 'మేము COPలం' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
విలేజ్‌లో కోడి మిస్సింగ్ మిస్టరీ - మెగా బ్రదర్ 'మేము COPలం' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Mamata Banerjee: సీఎం పదవి పోగానే లాయర్ అయిన మమతా బెనర్జీ - చట్టానికి, న్యాయానికి జరిగిన సమరంలో..
సీఎం పదవి పోగానే లాయర్ అయిన మమతా బెనర్జీ - చట్టానికి, న్యాయానికి జరిగిన సమరంలో..
Honda City Facelift Spied: హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ అదిరిపోయే లుక్‌తో వచ్చేస్తోంది: లాంచ్‌కు ముందే లీకైన ఫోటోలు
హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్ అదిరిపోయే లుక్‌తో వచ్చేస్తోంది: లాంచ్‌కు ముందే లీకైన ఫోటోలు
Suriya Hit Movies On OTT: సూర్య టాప్ 10 హిట్ సినిమాలు... ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌ & స్ట్రీమింగ్ డీటెయిల్స్
సూర్య టాప్ 10 హిట్ సినిమాలు... ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌ & స్ట్రీమింగ్ డీటెయిల్స్
Embed widget