News
News
X

Palnadu News : అప్పులిచ్చి మునిగిపోయారు - నమ్మినోళ్ల కారణంగా ప్రాణాలు తీసుకున్న దంపతులు !

పల్నాడు జిల్లాలో అప్పుల బాధతో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. డబ్బులు అప్పుగా తీసుకున్న బంధువులు మోసం చేయడంతోనే వారీ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లుగా భావిస్తున్నారు.

FOLLOW US: 

Palnadu News : పిడుగురాళ్లకు చెందిన గోపవరపు వెంకటేశ్వర్లు, అంజనా దేవీ దంపతులు అనుమానాస్పదంగా చనిపోయారు. వారిలో ఒకరు పురుగు మందు కలిపిన అన్నం తిని చనిపోగా మరొకరు ఉరి వేసుకుని ప్రాణం తీసుకున్నారు. వీరు ఇలా ఆత్మహత్య చేసుకుంటారని ఎవరూ ఊహించలేదు. ఎదుకంటే వీరికి ఉన్న ఇద్దరు పిల్లలు అమెరికాలో స్థిరపడ్డారు. వీరికి ఓ రైస్ మిల్లు ఉంది. అయినా సరే బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. అంత కష్టం ఏమొచ్చిందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే మంచి తనంతో మాటలు చెప్పి అప్పులు తీసుకున్న బంధువులు మోసం చేయడంతో మనస్థాపంతోనే గోపవరపు వెంకటేశ్వర్లు దంపతులు ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. 

రైస్ మిల్లు నడుపుతూ వడ్డీ వ్యాపారం చేస్తున్న వెంకటేశ్వర్లు 

పిడుగురాళ్ల పట్టణానికి చెందిన   గోపవరపు వెంకటేశ్వర్లు అంజనాదేవిలు  35 సంవత్సరాల క్రితం వివాహం అయింది, పిడుగురాళ్ల పట్టణంలో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరూ మగ పిల్లలు . వీఅమెరికాలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూస్తున్నారు. వెంకటేశ్వర్లు రైస్ మిల్లు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. రైస్ మిల్లుతో పాటు వడ్డీ వ్యాపారం కూడా చేస్తున్నాయి. ఇతరుల వద్ద తక్కువ వడ్డీకి అప్పు తీసుకుని ఎక్కువ వడ్డీకి ఇతరులకు ఇస్తూంటాడు. వడ్డీకి ఇచ్చిన వ్యక్తులు డబ్బులు ఇవ్వకుండా ఐపీ పెట్టామని చెబుతూ ఉండటంతో మనస్థాపానికి గురయ్యాడు. ఇలా అప్పులు తీసుకుని డబ్బులు ఎగ్గొట్టిన వారంతా బంధువులే కావడంతో  అందర్నీ సంప్రదించారు. 

News Reels

రూ. కోట్లలో అప్పులు తీసుకుని ఐపీ పెట్టిన బంధువులు

కానీ బందువులందరూ తమకు సంబంధం లేదని తప్పించుకున్నారు. దీంతో తాను పూర్తి స్థాయిలో మోసపోయానని మరిఆవేదనకు గురయ్యారు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని..  ఆ మేరకు వెంకటేశ్వర్లు శనివారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే తను చనిపోతే తన భార్యను అప్పుల వాళ్లు వేధిస్తారని   ముందే భార్యకు అన్నంలో విషయం కలిపి ఇచ్చి  ఆమె చనిపోయిన తర్వాత వెంకటేశ్వర్లు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని ఉండచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. శనివారం తెల్లవారుజామున ఇంట్లో పని చేయడానికి వచ్చిన పనిమనిషి అనురాధ  ఘటన చూచి  కేకలు వేయటంతో  చుట్టుపక్కల వారు  అక్కడికి వచ్చారు. పోలీసులకు సమాచారం అందించటంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సీఐ మధుసూదన్ రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మోసం చేయడంతో  మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా అనుమానం

కరోనా తర్వాత పరిస్థితులు తలకిందులు కావడంతో అప్పులు తీసుకున్న వాళ్లు చెల్లించలేక ఐపీలు పెడుతున్న సందర్భాలు ఎక్కువ అవుతున్నాయి. ఈ కారణంగా వడ్డీ వ్యాపారాలు చేసే వారు ఆర్థికంగా చితికిపోతున్నారు. ఈ కారణంగా ఇలాంటి ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఆర్థికంగా చికూచింతా లేకపోయినా .. బంధువులకు ఇతరుల దగ్గర్నుంచి డబ్బులు ఇప్పించడంతో ఈ దంపతులు ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. 

రాజ్యసభలో టీఆరెస్ ఫ్లోర్ బీజేపీలో విలీనం - హ్యాపీ రావు నేతృత్వంలో త్వరలో జరుగుతుందని రేవంత్ జోస్యం !

Published at : 08 Oct 2022 05:49 PM (IST) Tags: Crime News Couple Suicide Palnadu News Piduguralla News

సంబంధిత కథనాలు

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Attack on TDP leader: నెల్లూరులో దారుణం, సిటీ టీడీపీ ఇన్ ఛార్జ్‌పై కారుతో దాడి

Naresh Pavitra Lokesh : సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, సైబర్ క్రైమ్ పోలీసులకు నరేష్, పవిత్ర లోకేశ్ ఫిర్యాదు

Naresh Pavitra Lokesh : సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, సైబర్ క్రైమ్ పోలీసులకు నరేష్, పవిత్ర లోకేశ్ ఫిర్యాదు

Jeevitha Rajashekar : జీవితా రాజశేఖర్ ను బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాడు, ఆఫర్ల పేరుతో టోకరా!

Jeevitha Rajashekar : జీవితా రాజశేఖర్ ను బురిడీ కొట్టించిన సైబర్ కేటుగాడు, ఆఫర్ల పేరుతో టోకరా!

Peddapalli Crime News: అప్పు ఇచ్చిన పాపానికి దివ్యాంగుడిపై దాడి, ఏం జరిగిందంటే?

Peddapalli Crime News: అప్పు ఇచ్చిన పాపానికి దివ్యాంగుడిపై దాడి, ఏం జరిగిందంటే?

Crime News: ఈజీ మనీ కోసం రిటైరయ్యాక ఫేక్ దందా షురూ, కథ అడ్డం తిరిగి బుక్కయ్యాడు !

Crime News: ఈజీ మనీ కోసం రిటైరయ్యాక ఫేక్ దందా షురూ, కథ అడ్డం తిరిగి బుక్కయ్యాడు !

టాప్ స్టోరీస్

CM KCR : అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టార్టప్ లు- స్కైరూట్, ధృవ సంస్థలకు సీఎం కేసీఆర్ అభినందనలు

CM KCR : అంతరిక్ష రంగంలో దూసుకెళ్తున్న హైదరాబాద్ స్టార్టప్ లు- స్కైరూట్, ధృవ సంస్థలకు సీఎం కేసీఆర్ అభినందనలు

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

YS Jagan: రాజ్యాంగం స్ఫూర్తితో 35 నెలల పాలనలో ఏపీలో ఎన్నో మార్పులు: సీఎం జగన్

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Konaseema District: చేపల వేట హద్దుల కోసం Boat Race, ఎంచక్కా వీడియో వీక్షించండి

Manjima Mohan Pre Wedding Pics: హీరో హీరోయిన్ల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు ట్రెండింగ్ , మీరు ఓ లుక్కేయండి

Manjima Mohan Pre Wedding Pics: హీరో హీరోయిన్ల ప్రీ వెడ్డింగ్ ఫొటోలు ట్రెండింగ్ , మీరు ఓ లుక్కేయండి