అన్వేషించండి

Kakinada Senior Assistant Shiva Kumar ACB Raids: కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!

Kakinada Collectorate Employee ACB: కాకినాడలో ఏసీబీ భారీ దాడులు. కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ శివ కుమార్ వద్ద కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు లభ్యం. హైదరాబాద్, కాకినాడల్లో ఫ్లాట్లు, కార్లు స్వాధీనం.

Kakinada Real Estate Scam:  ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి తిమింగలాలపై అవినీతి నిరోధక శాఖ  అధికారులు తమ ఉచ్చును మరింత బిగించారు. కాకినాడ కలెక్టరేట్‌లో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న శివ కుమార్ ఇల్లు, కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు, సోదాల్లో లభ్యమైన కోట్ల రూపాయల అక్రమ ఆస్తులను చూసి అవాక్కయ్యారు.
 
హైదరాబాద్, కాకినాడల్లో విలాసవంతమైన ఫ్లాట్లు 

శివ కుమార్ సంపాదనతో పోలిస్తే అత్యంత విలాసవంతమైన భవనాలు, ఫ్లాట్లను కొనుగోలు చేసినట్లు ఏసీబీ గుర్తించింది. కాకినాడలోని ప్రసిద్ధ ఎస్ఆర్ఎంటీ  అపార్ట్‌మెంట్‌లో రూ. 1.24 కోట్ల విలువైన త్రిబుల్ బెడ్ రూం ఫ్లాట్‌తో పాటు, అదే అపార్ట్‌మెంట్‌లో ఆయన భార్య పేరు మీద రూ. 1.77 కోట్ల విలువైన నాలుగు పడకగదుల  లగ్జరీ ఫ్లాట్ ఉన్నట్లు అధికారులు కనుగొన్నారు. ఇది కాకుండా, ఐటీ హబ్ అయిన హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం, కొండాపూర్‌లోని  వివా సిటీ'  అపార్ట్‌మెంట్స్‌లో భార్య పేరు మీద రూ. 1.34 కోట్ల విలువైన మరో త్రిబుల్ బెడ్ రూం ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లు సోదాల్లో తేలింది.

 విలువైన భూములు, ఖాళీ స్థలాలు 

స్థిరాస్తుల రూపంలో కూడా శివ కుమార్ భారీగానే పెట్టుబడులు పెట్టారు. కాకినాడ జిల్లా రంగంపేట మండలం కోటపాడు గ్రామంలో భార్య పేరు మీద రెండు విడతలుగా  రూ.18.40 లక్షల విలువైన 1.082 ఎకరాలు, రూ. 9.24 లక్షల విలువైన 0.543 ఎకరాలు  మొత్తం 1.6 ఎకరాలకు పైగా వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. వీటితో పాటు కాకినాడలోని ప్రముఖ ప్రాంతమైన రామారావుపేటలో శివ కుమార్ పేరు మీద రూ. 1.20 కోట్ల మార్కెట్ విలువ గల 375 చదరపు గజాల ఖాళీ స్థలం ఉన్నట్లు అధికారులు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

 లగ్జరీ కార్ల గ్యారేజ్ 

ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి ఊహించని స్థాయిలో నిందితుడి ఇంట్లో ఖరీదైన కార్లు దర్శనమిచ్చాయి. శివ కుమార్ భార్య పేరు మీద రూ. 41.73 లక్షల విలువైన టయోటా ఫార్చ్యూనర్  కారు ఉంది. అలాగే, ఆయన స్వయంగా తన పేరు మీద రూ. 30 లక్షల విలువైన సరికొత్త మహీంద్రా ఎలక్ట్రిక్  కారుతో పాటు రూ. 27 లక్షల విలువైన మహీంద్రా థార్ రాక్స్  కారును కూడా కొనుగోలు చేశారు.

 బంగారం.. గ్యాడ్జెట్లు 

ఇళ్ల సోదాల్లో దాదాపు 700 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 20 వేల నగదు లభించాయి. ఇవి కాకుండా ఇళ్లలో వాడుతున్న రూ. 27.12 లక్షల విలువైన అత్యాధునిక గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ పరికరాలను ఏసీబీ సీజ్ చేసింది. నిందితుడి వ్యక్తిగత అవసరాల కోసం వాడుతున్న రూ. 1.50  లక్షల విలువైన శామ్‌సంగ్ ఫోల్డ్ 7  ప్రీమియం ఫోన్, రూ. 1.70 లక్షల విలువైన ల్యాప్‌టాప్‌లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

 4 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు 

శివ కుమార్‌కు సంబంధించిన నెట్‌వర్క్‌ను ఛేదించడానికి ఏసీబీ అధికారులు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లారు. కాకినాడ నగరంతో పాటు రమణయ్యపేట గ్రామం, చీడిగ గ్రామం, తిలక్ వీధి ప్రాంతాల్లోని ఆయన బంధువులు, అత్యంత ఆప్తుల ఇళ్లలో ఏకకాలంలో 4 ప్రత్యేక బృందాలు ఈ తనిఖీలు చేపట్టాయి. ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్న ఆస్తుల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ విలువ కోట్లల్లో ఉండగా, బహిరంగ మార్కెట్లో వీటి విలువ మరికొన్ని రేట్లు ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసిన ఏసీబీ, శివ కుమార్‌ను కోర్టులో హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

ED Raids: తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ మెరుపు దాడులు.. ఆన్‌లైన్ బెట్టింగ్, హవాలా గ్యాంగ్‌లపై ఫోకస్
తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ మెరుపు దాడులు.. ఆన్‌లైన్ బెట్టింగ్, హవాలా గ్యాంగ్‌లపై ఫోకస్
Hyderabad Crime News: ప్రియుడి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య.. ఉప్పల్ పీఎస్ పరిధిలో ఘటన
ప్రియుడి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య.. ఉప్పల్ పీఎస్ పరిధిలో ఘటన
Andhra Couple Chain Snatching: ప్రేమించుకున్నారు..కానీ పెళ్లి ఖర్చుకు డబ్బుల్లేవ్ - జంటగా చైన్ స్నాచింగ్ చేసి దొరికిపోయారు!
ప్రేమించుకున్నారు..కానీ పెళ్లి ఖర్చుకు డబ్బుల్లేవ్ - జంటగా చైన్ స్నాచింగ్ చేసి దొరికిపోయారు!
Vijayawada Gold Smuggling: విజయవాడలో రూ.5.84 కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీ సీజ్.. బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు
విజయవాడలో రూ.5.84 కోట్ల విలువైన బంగారం, విదేశీ కరెన్సీ సీజ్.. బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌కు

వీడియోలు

Harbhajan Singh Comments On Greg Chappell | గ్రేగ్ చాపెల్‌పై భజ్జీ తీవ్ర ఆరోపణలు
Arshdeep Singh Football-Style Run Out vs NZ | అర్ష్‌దీప్ సింగ్ కళ్లు చెదిరే రనౌట్
Sanju Samson 67 Runs vs New Zealand | న్యూజిలాండ్‌పై సంజూ శాంసన్ ధనాధన్ బ్యాటింగ్
Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
చైనా‌తో ఘర్షణపై ITBP డీజీ కీలక ప్రకటన.. ప్రధాని మోదీని టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ
చైనా‌తో ఘర్షణపై ITBP డీజీ కీలక ప్రకటన.. ప్రధాని మోదీని టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ
CM Revanth Reddy: వేగంగా మారుతున్న నేరాల స్వరూపం.. రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి
వేగంగా మారుతున్న నేరాల స్వరూపం.. రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరం: సీఎం రేవంత్ రెడ్డి
Jio Platforms IPO: చరిత్ర సృష్టించిన జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ.. కోటి పైగా సబ్‌స్క్రిప్షన్లతో వరల్డ్ రికార్డు
చరిత్ర సృష్టించిన జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ.. కోటి పైగా సబ్‌స్క్రిప్షన్లతో వరల్డ్ రికార్డు
ED Raids: తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ మెరుపు దాడులు.. ఆన్‌లైన్ బెట్టింగ్, హవాలా గ్యాంగ్‌లపై ఫోకస్
తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ మెరుపు దాడులు.. ఆన్‌లైన్ బెట్టింగ్, హవాలా గ్యాంగ్‌లపై ఫోకస్
Vidadala Rajini: పోలీసులతో తీవ్ర వాగ్వాదం.. కింద పడిపోయిన విడదల రజిని!
పోలీసులతో తీవ్ర వాగ్వాదం.. కింద పడిపోయిన విడదల రజిని!
AP Local Body Elections: 15 చోట్ల చైర్మన్ అభ్యర్థులు లేకుండా చేశారు.. సుప్రీంకోర్టు చెప్పినా మార్పులేదు: వైఎస్ జగన్
15 చోట్ల చైర్మన్ అభ్యర్థులు లేకుండా చేశారు.. సుప్రీంకోర్టు చెప్పినా మార్పులేదు: వైఎస్ జగన్
Jo Jo Caution 2 Video : మ‌నోభావాల బ్యాచ్‌కు మ‌రోసారి 'జో జో' షాక్ - రూరల్ రొమాంటిక్ కామెడీ కాషన్ 2 వీడియో
మ‌నోభావాల బ్యాచ్‌కు మ‌రోసారి 'జో జో' షాక్ - రూరల్ రొమాంటిక్ కామెడీ కాషన్ 2 వీడియో
Hyderabad Air Pollution: హైదరాబాద్ సహా పలు నగరాల్లో తీవ్ర వాయుకాలుష్యం.. జాతీయ పరిమితి కంటే అధికం
హైదరాబాద్ సహా పలు నగరాల్లో తీవ్ర వాయుకాలుష్యం.. జాతీయ పరిమితి కంటే అధికం
Embed widget