Crime News: కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి వ్యక్తి దారుణహత్య- మేడ్చల్‌లో ఘటన
Hyderabad: కత్తులతో విచక్షణారహితంగా దాడి చేయడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మేడ్చల్ జిల్లాలో ఈ విషాదం చోటుచేసుకుంది.

Hyderabad Crime News: పేట్ బషీరాబాద్ మేడ్చల్ జిల్లాలో ఆదివారం నాడు దారుణం జరిగింది. ఓ వ్యక్తిపై గుర్తుతెలియని దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడిచేయగా ప్రాణాలు కోల్పోయాడు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెంట్రల్ పార్క్ వీధి మార్కెట్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
సిద్దిక్ అనే వ్యక్తి బ్యాటరీ లైట్లు సప్లై చేస్తుంటాడు. పేట్ బషీరాబాద్ సెంట్రల్ వీధి మార్కెట్లో సిద్దిక్ వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు అతడ్ని అడ్డగించారు. సిద్దిక్ పై దాడి చేసిన వ్యక్తులు వెంటనే తమ వెంట తెచ్చుకున్న కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి పొడిచారు. తీవ్ర గాయాలతో కుప్పకూలపోయిన సిద్దిక్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించారు. కత్తులతో దాడి చేయగా.. తీవ్ర రక్తస్రావం కావడంతో సిద్దిక్ చనిపోయాడని డాక్టర్లు ధ్రువీకరించారు. పాత కక్షలతోనే ఈ హత్య జరిగి ఉండొచ్చునని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.






















