News
News
X

అమ్మాయి ప్రేమ కోసం స్నేహితుడి హత్య- హైదరాబాద్‌లో సంచలనం !

అమ్మాయి ప్రేమ కోసం హత్య చేశాడో యువకుడు, స్నేహితుడినే చంపి హైదరాబాద్ శివారులో పారేశాడు.

FOLLOW US: 
Share:

ప్రేమ దేశంలో హీరోల్లా మొదలైంది వాళ్ల స్నేహం. తర్వాత ప్రేమ కారణంగా ఇద్దరి మధ్య మొదలైన వార్ చివరకు ప్రాణాలు తీసే వరకు వెళ్లింది. హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌ మెట్టు ప్రాంతంలో గుట్టల మధ్య ఓ డెడ్‌బాడీని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. 

డెడ్‌బాడీని పరిశీలించిన పోలీసులు అసలు అది ఎవరిదనే కోణంలో దర్యాప్తు చేశారు. చివరకు మృతదేహం నవీన్ అనే యువకడిదని గుర్తించారు. అంతక ముందే ఆ యువకుడు మిస్సైనట్టు కేస్‌ ఫైల్‌ అయినట్టు గుర్తించారు. 

చనిపోయిందని నవీన్‌ అని ధృవీకరించుకున్న పోలీసులు కేసు విచారిస్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ అమ్మాయి ప్రేమ కోసం నవీన్‌ చంపేశారని తెలిసి షాక్ తిన్నారు పోలీసులు. ఆ హత్య చేసింది కూడా ఫ్రెండ్‌ హరిహర అని తేల్చారు. 

అసలేం జరిగిందంటే?

మహాత్మా గాంధీ యూనివర్సిటీలో నవీన్ ,హరిహర చదువుతున్నారు. ఆదే యూనివర్శిటీలో ఓ అమ్మాయిని వీళ్లిద్దరూ ఒకరికి తెలియకుండా ఒకరు ప్రేమించారు. 

రోజులు గడిచే కొద్ది ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు తెలుసుకున్నారు. ఇద్దరి మధ్య ద్వేషం మొదలైంది. చాలా సార్లు గొడవలు కూడా పడ్డారు. ఈ క్రమంలోనే తన ప్రేమకు నవీన్ అడ్డొస్తున్నాడని.. ఎక్కడ తనకు ఆ అమ్మాయి దక్కకుండా పోతుందో అని కంగారు పడ్డారు హరిహర. 

ఎలాగైనా నవీన్ అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశాడు హరిహర. అప్పుడే తన ప్రేమ సక్సెస్ అవుతుందనుకున్నాడు. పార్టీ పేరుతో నవీన్‌కు ఈనెల 17న బయటకు తీసుకెళ్లాడు. అక్కడే నవీన్‌ను హత్య చేశాడు. డెడ్ బాడీని అబ్దుల్లాపూర్ మెట్టు ప్రాంతంలో పడేసి ఏమీ తెలియనట్టు ఇంటికి వచ్చేశాడు. 

సాయంత్రం అవుతున్నా నవీన్ ఇంటికి రాకపోవడంతో కంగారుపడిన ఫ్యామిలీ మెంబర్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేస్తుండగానే డెడ్‌బాడీని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.  ఇంత సంచలనంగా మారిన ఈ కేసును పోలీసులు అత్యంత గోప్యంగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. విషయాన్ని బయటకు పొక్కనీయకుండా జాగ్రత్త పడుతున్నారు. 

Published at : 25 Feb 2023 10:46 AM (IST) Tags: Love Hyderabad Crime News Murder

సంబంధిత కథనాలు

Jangareddygudem Knife Attack : ఏలూరు జిల్లాలో దారుణం, పొలంలో భర్త ఇంట్లో భార్య, కుమారుడు రక్తపు మడుగులో

Jangareddygudem Knife Attack : ఏలూరు జిల్లాలో దారుణం, పొలంలో భర్త ఇంట్లో భార్య, కుమారుడు రక్తపు మడుగులో

Tirupati: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సజీవ దహనం, కారుతోసహా తగలబెట్టిన దుండగులు

Tirupati: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సజీవ దహనం, కారుతోసహా తగలబెట్టిన దుండగులు

TSPSC పేపర్ లీకేజీ కేసులో రేణుకకు షాక్ - ఆమె రిక్వెస్ట్ ను తోసిపుచ్చిన నాంపల్లి కోర్టు

TSPSC పేపర్ లీకేజీ కేసులో రేణుకకు షాక్ - ఆమె రిక్వెస్ట్ ను తోసిపుచ్చిన నాంపల్లి కోర్టు

Tirupati Crime : విద్యార్థినికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్న లెక్చరర్, నిందితుడికి అంతకు ముందే పెళ్లి!

Tirupati Crime :  విద్యార్థినికి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్న లెక్చరర్, నిందితుడికి అంతకు ముందే పెళ్లి!

Data Theft Case : వినయ్ భరద్వాజ ల్యాప్ టాప్ లో 66.9 కోట్ల మంది డేటా- 24 రాష్ట్రాలు, 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీ

Data Theft Case : వినయ్ భరద్వాజ ల్యాప్ టాప్ లో 66.9 కోట్ల మంది డేటా- 24 రాష్ట్రాలు, 8 మెట్రోపాలిటిన్ సిటీల్లో డేటా చోరీ

టాప్ స్టోరీస్

Bandi Sanjay : కేసీఆర్ మళ్లీ గెలిస్తే తెలంగాణ ప్రజల చేతికి చిప్ప తథ్యం- బండి సంజయ్

Bandi Sanjay : కేసీఆర్ మళ్లీ గెలిస్తే తెలంగాణ ప్రజల చేతికి చిప్ప తథ్యం- బండి సంజయ్

Perni Nani : ప్రస్తుత కేబినెట్ తోనే ఎన్నికలకు, మంత్రివర్గ మార్పులపై పేర్ని నాని క్లారిటీ

Perni Nani : ప్రస్తుత కేబినెట్ తోనే ఎన్నికలకు, మంత్రివర్గ మార్పులపై పేర్ని నాని క్లారిటీ

Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల

Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల

YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?

YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?