అన్వేషించండి

Satya Sai District: చిన్నారిపై అత్యాచారం చేసి పాతిపెట్టిన పెదనాన్న- హిందూపురంలో ఘోరం

Crime News: ఇంట్లో వ్యక్తే చిన్నారిపై కన్నేశాడు. జాతర పేరుతో పిలిచి అత్యాచారం చేశాడు. బయటకు విషయం తెలిసిపోతుందని పాపని చంపేసి నది ఒడ్డున పాతేశాడు. ఒళ్లుగగుర్పొడిచే ఈ ఘటన హిందూపురంలో జరిగింది.

Andhra Pradesh: ఊరిలో జాతరకు రావాలని ఆ చిన్నారికి పెద్దమ్మ కబురు పెట్టింది. ఎంతో సంబరంగా జాతరకు వెళ్ళింది. అలా ఆ జాతరకు వచ్చిన ఆ చిన్నారికి తెలియదు అదే తన చివరి ప్రయాణమని. ఇక తన వారిని చూసుకోలేనని. నాన్న తర్వాత చేయి పట్టి నడిపించాల్సిన పెదనాన్నే తన పాలిట యముడు అవుతాడని అనుకోలేదు. సత్యాసాయి జిల్లాలో జరిగిన ఈ దుర్ఘటన స్థానికంగా ఉండే ప్రజల కంట తడి పెట్టిస్తుంది. 

ఊరంతా జాతర సంబరంలో ఉండగా పెన్నా నది చూపిస్తానంటూ చిన్నారిని తీసుకెళ్లిన పెదనాన్న పాడు పని చేసి పాతిపెట్టాడు. హిందూపురం గ్రామీణ మండలంలో జరిగిన ఈ దుర్ఘటన తల్లిదండ్రుల్లో వణుకుపుట్టిస్తోంది. ఇంట్లోనే ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతోందని ఇక ఎవరు కాపాడుతారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంత చేసిన ఆ వ్యక్తి తనకేమీ తెలియదన్నట్టు ఎంచక్కా ఇంటికి వచ్చేశాడు. అప్పటికే బాలిక కనిపించడం లేదని బంధువులు ఆందోళన పడసాగారు. 

గ్రామదేవత ఉత్సవానికి రావలసిన ఒక మహిళ తన చెల్లెలి కుటుంబాన్ని ఆహ్వానించింది చెల్లెలు గర్భవతి కావడంతో రాలేనని తన భర్తను కుమార్తెను పంపించింది. జాతరకు వెళ్లిన వారు ఉదయం పెదనాన్న గంగాధర్ తన మరదలు కుమార్తెను పెన్నా నది ఒడ్డుకు తీసుకొని వెళ్ళాడు. అప్పటికే మద్యం సేవించి ఉన్న అతడు ఆ చిన్నారిపై అత్యంత దారుణంగా అత్యాచారం చేశాడు. విషయం బయటకు చెబుతుందని గ్రహించి చిన్నారిని హతమార్చాడు. నది ఒడ్డునే గొయ్యి తీసి పాతిపెట్టేశాడు. 

అప్పటికే బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది జాతరలో వెతకడం మొదలుపెట్టారు. ఎంత వెతికిన కనిపించకపోవడంతో ఆఖరిగా వారి పెదనాన్నతోనే వెళ్ళింది అని తెలుసుకున్న బంధువులు గంగాధర్‌ను గట్టిగా నిలదీశారు. దీంతో తాను చేసిన అఘాయిత్యాన్ని బంధువులకి వివరించాడు.

గంగాధర్ చెప్పిన విషయాలకు నిర్ధాంత పోయిన బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి నిందితున్ని అరెస్టు చేశారు.  నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తే తాను చేసిన పనిని మొత్తం వివరించాడు. పాప మృతదేహాన్ని ఎక్కడ పూడ్చాడో ముందుగా చెప్పని గంగాధర్.. పోలీస్ స్టైల్‌లో విచారణ చేయడంతో అంతా కక్కేశాడు. 

పాపని పూడ్చిపెట్టిన ప్రదేశాన్ని చూపించాడు. ఆ గోతిలో నుంచి పాప మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన తెలుసుకున్న చిన్నారి తండ్రి, కుటుంబ సభ్యులు తీవ్రంగా కన్నీరు మున్నీరయ్యారు.

టాప్ హెడ్ లైన్స్

Serial Killer Book: దొరకకుండా మగవాళ్లను చంపేయడం ఎలా? - పుస్తకం మార్కెట్లోకి వచ్చేసింది - ఇక పురుషులకు రక్షణేది?
దొరకకుండా మగవాళ్లను చంపేయడం ఎలా? - పుస్తకం మార్కెట్లోకి వచ్చేసింది - ఇక పురుషులకు రక్షణేది?
Palnadu Road Accident: 2 లారీలు ఢీకొని నలుగురు సజీవ దహనం.. అన్నా కాపాడండి, నాకు పిల్లలున్నారంటూ డ్రైవర్ ఆర్తనాదాలు
2 లారీలు ఢీకొని నలుగురు సజీవ దహనం.. అన్నా కాపాడండి, నాకు పిల్లలున్నారంటూ డ్రైవర్ ఆర్తనాదాలు
Hyderabad Crime News: హైదరాబాద్‌ ఓఆర్ఆర్ వద్ద పోలీసుల కాల్పులు.. హత్య కేసులో నిందితుడి అరెస్ట్
హైదరాబాద్‌ ఓఆర్ఆర్ వద్ద పోలీసుల కాల్పులు.. హత్య కేసులో నిందితుడి అరెస్ట్
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
WhatsApp Username Feature:భారత్‌లో వాట్సాప్ 'యూజర్‌నేమ్' ఫీచర్‌పై నిషేధం! 3 రోజుల్లోగా స్పందించాలని మెటాకు కేంద్రం నోటీసు!
భారత్‌లో వాట్సాప్ 'యూజర్‌నేమ్' ఫీచర్‌పై నిషేధం! 3 రోజుల్లోగా స్పందించాలని మెటాకు కేంద్రం నోటీసు!
Telangana Latest News: తెలంగాణ అప్పులపై చర్చకు ప్లేస్‌, టైం ఫిక్స్ చేయమని కేటీఆర్ సవాల్! తెలంగాణ భవన్‌లో పెడదామని మంత్రి జూపల్లి ప్రతిసవాల్! 
తెలంగాణ అప్పులపై చర్చకు ప్లేస్‌, టైం ఫిక్స్ చేయమని కేటీఆర్ సవాల్! తెలంగాణ భవన్‌లో పెడదామని మంత్రి జూపల్లి ప్రతిసవాల్! 
Serial Killer Book: దొరకకుండా మగవాళ్లను చంపేయడం ఎలా? - పుస్తకం మార్కెట్లోకి వచ్చేసింది - ఇక పురుషులకు రక్షణేది?
దొరకకుండా మగవాళ్లను చంపేయడం ఎలా? - పుస్తకం మార్కెట్లోకి వచ్చేసింది - ఇక పురుషులకు రక్షణేది?
Viral Video: 'హౌ టు కిల్ మెన్' బుక్ చదువుతున్న యువతి! సోనమ్, సియా, ముస్కాన్‌తో పోలుస్తున్న నెటిజన్లు!
'హౌ టు కిల్ మెన్' బుక్ చదువుతున్న యువతి! సోనమ్, సియా, ముస్కాన్‌తో పోలుస్తున్న నెటిజన్లు!
Plot To Topple CM Vijay Government: సీఎం విజయ్ ప్రభుత్వంపై రూ. 35 కోట్ల కుట్ర! టీవీకే ఎమ్మెల్యే కొనుగోలుకు డీఎంకే నేతల యత్నం.. ముగ్గురు అరెస్ట్!
సీఎం విజయ్ ప్రభుత్వంపై రూ. 35 కోట్ల కుట్ర! టీవీకే ఎమ్మెల్యే కొనుగోలుకు డీఎంకే నేతల యత్నం.. ముగ్గురు అరెస్ట్!
WhatsApp User ID:వాట్సాప్ యూజర్ ఐడీతో చిక్కుల్లో మెటా! నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం!
వాట్సాప్ యూజర్ ఐడీతో చిక్కుల్లో మెటా! నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్న కేంద్ర ప్రభుత్వం!
Chandrababu Naidu Reaction Cattle Death: కన్నీటి ఏరువాక.. తుంగభద్రలో కాడెద్దుల మృతి! చలించిపోయిన సీఎం చంద్రబాబు.. రైతు కుటుంబానికి తక్షణ సాయం!
కన్నీటి ఏరువాక.. తుంగభద్రలో కాడెద్దుల మృతి! చలించిపోయిన సీఎం చంద్రబాబు.. రైతు కుటుంబానికి తక్షణ సాయం!
Cocktail 2 OTT : ఓటీటీలోకి రష్మిక లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి రష్మిక లేటెస్ట్ బాలీవుడ్ రొమాంటిక్ కామెడీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Embed widget