Crime News: స్కూల్‌లో తీవ్ర విషాదం - చపాతీ రోల్ గొంతులో ఇరుక్కుని బాలుడు మృతి
Secunderabad News: చపాతీ రోల్ తింటుండగా గొంతులో ఇరుక్కుని ఓ విద్యార్థి మృతి చెందిన విషాద ఘటన సికింద్రాబాద్‌లో చోటు చేసుకుంది. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Student Died Due To Chapathi Roll Stucked In His Throat In Secunderabad: సికింద్రాబాద్‌లోని ఓ పాఠశాలలో సోమవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చపాతీ రోల్ గొంతులో ఇరుక్కుని ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. పాఠశాల సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌లోని (Secunderabad) ఓ పాఠశాలలో విరజ్ జైన్ అనే విద్యార్థి ఆరో తరగతి చదువుతున్నాడు. చపాతీ రోల్ తింటుండగా అది గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఊపిరాడక తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే గమనించిన పాఠశాల సిబ్బంది విద్యార్థిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.