West Bengal: బయట తాళం వేసి, ఇంటికి నిప్పు పెట్టిన దుండగులు- 8 మంది సజీవ దహనం
బంగాల్‌లో మళ్లీ రాజకీయ హత్యాకాండ మొదలైంది. ప్రత్యర్థుల ఇళ్లకు తాళం వేసి దుండగులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు.
రాజకీయ హత్యలతో బంగాల్ మళ్లీ అట్టుడికింది. బీర్ భూమ్ జిల్లాలో రాజకీయ హత్యకు ప్రతీకారంగా కొందరు దుండగులు మంగళవారం తెల్లవారుజామున ఐదు ఇళ్లకు నిప్పంటించారు. ఇంట్లోని వారు బయటికి రాకుండా తాళాలు వేసి ఈ పని చేశారు. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
West Bengal | Around 10-12 houses were set on fire last night. A total of 10 dead bodies have been recovered, 7 dead bodies were retrieved from a single house: Fire officials on death of several people after a mob allegedly set houses on fire and killed a TMC leader in Birbhum. pic.twitter.com/KOW2ldlCgy
— ANI (@ANI) March 22, 2022
ఎందుకు?
బీర్‌భూమ్‌లోని రాంపూర్‌హాట్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడి హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకే ప్రత్యర్థుల ఇళ్లకు కొంతమంది నిప్పంటించారని స్థానికులు తెలపారు. బీర్‌భూమ్‌లోని రాంపూర్‌హాట్‌లో టీఎంసీకి చెందిన పంచాయితీ నాయకుడు భాదు ప్రధాన్‌పై గుర్తు తెలియని దుండగులు బాంబులు వేశారు.
ఓ బృందం 7 నుంచి 8 ఇళ్లకు తాళాలు వేసి నిప్పంటించారు. ఈ ఘటనలో 8 మంది సజీవ దహనమయ్యారు. ఘటనా స్థలానికి బీర్భూమ్ జిల్లా మేజిస్ట్రేట్, అగ్నిమాపక అధికారులు, స్థానిక పోలీసులు చేరుకున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
An hour after the news of the murder of TMC leader Bahadur Sheikh last night, 7-8 nearby houses were set on fire. 11 people arrested in this regard. The concerned SDPO and Rampurhat Incharge have been removed from their post: Manoj Malviya, WB DGP on Rampurhat, Birbhum incident pic.twitter.com/QayRWTYMWc
— ANI (@ANI) March 22, 2022