బ్రేకప్ చెప్పిందని గర్ల్‌ఫ్రెండ్‌ని చంపేసిన టీనేజర్, గన్‌తో ఐదు రౌండ్ల కాల్పులు
Boy Kills Girlfriend: అమెరికాలో ఓ 16 ఏళ్ల బాలుడు గర్ల్‌ఫ్రెండ్ బ్రేకప్ చెప్పిందని గన్‌తో కాల్చి చంపేశాడు.
Boy Kills Girlfriend:
అమెరికాలో ఘటన..
అమెరికాలోని కొలొరాడోలో ఓ 16 కుర్రాడు ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ (15)ని చంపేశాడు. ఆ యువతి సోదరుడి ముందే హత్య చేశాడు. జూన్ 16న ఈ ఘటన జరిగినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. గర్ల్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్లి అక్కడే గన్‌తో కాల్చి చంపాడు. హడావుడిగా ఇంట్లో నుంచి బయటకు వచ్చేశాడు. అక్కడి సీసీటీవీ ఈ వీడియో రికార్డ్ అయింది. ఆ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ జరిపారు. హత్య చేసిన తరవాత ఆ యువతి బెడ్ రూమ్‌లోని కిటికీ నుంచి బయటకు దూకేశాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం...నిందితుడు గర్ల్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్లాడు. హాల్లో ఆమె సోదరుడు టీవీ చూస్తున్నాడు. ఉన్నట్టుండి బెడ్ రూమ్‌లో నుంచి గట్టిగా కేకలు వినిపించాయి. దాదాపు ఐదు రౌండ్ల కాల్పులు వినిపించాయి. వెంటనే రూమ్‌లోకి వెళ్లి చూశాడు. అక్క ఫ్లోర్‌పై పడిపోయి ఉండడాన్ని చూసి వణికిపోయాడు. పక్కనే ఆ నిందితుడు గన్ పట్టుకుని నిల్చుని ఉన్నాడు. ఆ కుర్రాడిపైనా కాల్పులు జరిపేందుకు ప్రయత్నించినా...వద్దంటూ వేడుకున్నాడు. చివరకు ఆ చిన్నారి దగ్గరున్న ఐఫోన్ లాక్కుని కిటికీలో నుంచి దూకి పారిపోయాడు 16 ఏళ్ల నిందితుడు. ఆ తరవాత మృతురాలి సోదరుడు పోలీసులకు కాల్ చేశాడు. వాళ్లు వచ్చి ఇంటిని సీజ్ చేశారు. బెడ్ రూమ్‌లోని డెడ్‌బాడీని స్వాధీనం చేసుకున్నారు. బాధితురాలు, నిందితుడు ఇద్దరి వయసూ 17 ఏళ్ల లోపే. ఆర్నెల్లుగా రిలేషన్లో ఉన్నారు. అయితే..ఆ యువతి ఈ మధ్యే బ్రేకప్ చెప్పాలని డిసైడ్ అయింది. ఆ అబ్బాయితో మాట్లాడడం మానేసింది. ఈ కాల్పులు జరపక ముందు రెండు సార్లు భౌతిక దాడులకు దిగాడు నిందితుడు. ఈసారి గన్‌తో ఇంటికి వచ్చి కాల్చి చంపేశాడు. బ్రేకప్ చెప్పిందన్న కోపంతో ఇలా మర్డర్ చేశాడు.
వరుస ఘటనలు..
అమెరికాలోని ఓ మహిళ ఉబర్ డ్రైవర్ని కాల్చింది. తనను కిడ్నాప్ చేస్తున్నాడన్న అనుమానంతో గన్‌తో కాల్చేసింది. జూన్ 16వ తేదీన టెక్సాస్‌లో ఈ ఘటన జరిగింది. నిందితురాలు 48 ఏళ్ల ఫోయెబీ కోపస్గా గుర్తించారు. డ్రైవర్ డ్యానియల్ని గన్‌తో కాల్చి చంపినట్టు అంగీకరించింది. అప్పటికే ఓ హత్య కేసులో నిందితురాలిగా ఉంది ఫోయెబీ. ఆమెపై పోలీసులు రివార్డు కూడా ప్రకటించారు. అప్పటికే పోలీసులు వెతుకుతున్నారు. కార్ రైడ్ బుక్ చేసుకున్న ఆమెకి డ్రైవర్‌పై డౌట్ వచ్చింది. తనను కిడ్నాప్ చేసి పోలీసులకు అప్పగిస్తాడేమో అని అనుమానపడింది. వెంటనే తన బ్యాగ్‌లో నుంచి గన్ తీసి కాల్చి అక్కడి నుంచి పారిపోయింది. బాయ్‌ఫ్రెండ్‌ని కలిసేందుకు రైడ్ బుక్ చేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు. కార్లో వెళ్తుండగా మెక్సికో హైవే బోర్డ్ చూసింది. డ్రైవర్ తనను కిడ్నాప్ చేసి ఎక్కడికో తీసుకెళ్లిపోతున్నాడని అనుకుంది. ఆ తరవాత దాడి చేసింది. 52 ఏళ్ల డ్రైవర్ తల, మణికట్టుకి గురి పెట్టి కాల్చింది. ఫలితంగా కార్ అదుపు తప్పి క్రాష్ అయింది. పోలీసులకు ఫోన్ చేసే ముందు ఆ ఇన్సిడెంట్‌కి సంబంధించిన ఫోటో తీసుకుని బాయ్‌ఫ్రెండ్‌కి పంపింది నిందితురాలు.
Also Read: పాకిస్థాన్‌లో జాక్ మా సీక్రెట్ స్టే, ఏదైనా బిజినెస్ డీల్ కుదిరిందా?