Crime News: రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు, కాల్వల్లోకి దూసుకెళ్లిన వాహనాలు.. 16 మంది మృతి
వెహికల్స్ కాల్వల్లోకి దూసుకెళ్లిన రెండు వేర్వేరు ఘటనల్లో 16 మంది మృత్యువాతపడ్డారు. మరికొందరికి గాయాలయ్యాయి.

vehcles Falls Into Gorge: వివాహ వేడుకల్లో పాల్గొన్న వారంతా సంతోషంగా గడిపారు. ఆ తర్వాత స్వగ్రామానికి తిరిగివస్తుండగా వారు ప్రయాణిస్తున్న జీపు బ్రిడ్జిపై నుంచి కాల్వలో పడిపోయింది. మరో బృదం కుంభమేళాలో పుణ్యస్నానాలు ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తుండగా.. వారి బస్సు కాల్వలోకి దూసుకెళ్లింది. రెండు వేర్వేరు చోట్ల జరిగిన ఈ ప్రమాదాల్లో 16 మంది మృతిచెందగా.. ముగ్గురు గల్లంతయ్యారు. మరికొందరు గాయపడ్డారు.
హర్యానాలో తొమ్మిది మంది
హర్యానాకు చెందిన 14 మంది పంజాబ్‌లోని ఫజిల్కాలో జరిగిన తమ బంధువుల వివాహ వేడుకకు హాజరయ్యారు. అక్కడ తమ బంధుమిత్రులకు కలిసి సంతోషంగా గడిపారు. ఆ తర్వాత శనివారం తిరిగి వస్తుండగా.. రాత్రి వారు ప్రయాణిస్తున్న జీపు హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లా సర్దారేవాలా ప్రాంతంలో భాఖడా కాలువ వంతెన పైకి చేరుకున్న తర్వాత అదుపుతప్పి జీపు బ్రిడ్జిపై నుంచి నీళ్లలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది చనిపోగా మరో ముగ్గురు గల్లంతయ్యారు. మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారని జిల్లా సబ్ కలెక్టర్ జగదీశ్ చంద్ర చెప్పారు.
పొగ మంచు కారణంగానే ప్రమాదం
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాల ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. కాల్వలో గాలింపు చేపట్టారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, 11 ఏళ్ల బాలిక ఉన్నట్టు పోలీసులు తెలిపారు. దట్టంగా కురుస్తున్న పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు భావిస్తున్నారు. మార్గం కనిపించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. గల్లంతైన మిగతా ముగ్గురి కోసం సహాయక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. మృతులందరూ బంధువులు, ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
కంభమేళా నుంచి తిరిగివస్తూ
ఉత్తర్ప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు వెళ్లిన మధ్యప్రదేశ్కు చెందిన ఓ బృందం పుణ్య స్నానాలు చేసుకొని తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న బస్సు కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన గుజరాత్లోని దంగ్ జిల్లాలో సపుతారా వ్యాలీ వద్ద ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో జరిగింది. డ్రైవర్ కంట్రోల్ కోల్పోవడంతో బస్సు 200 ఫీట్ల లోయలో ఉన్న కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 7 భక్తులు మృతిచెందగా, 15 మంది గాయపడినట్లు సమాచారం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

