Zomato Everyday: ₹89 కే జొమాటో నుంచి ఇంటి భోజనం, ఇన్‌స్టాంట్ ప్లేస్‌లో కొత్త ఆఫర్
ఇంటి తరహా భోజనాన్ని జోమాటో అందిస్తుంది. దీనిని కూడా జొమాటో యాప్ నుంచే ఆర్డర్ చేసుకోవచ్చు.
Zomato Everyday home-style meals: ఆన్‌లైన్‌లో ఆర్డర్లు తీసుకుని ఇంటింటికీ ఆహారం పంపిణీ చేస్తున్న జొమాటో, తన వ్యాపార విస్తరణ కోసం ఎప్పటికప్పుడు కొత్త స్కీమ్‌లు తెలుస్తోంది. తాజాగా, ఈ కంపెనీకి సంబంధించిన మరో బిగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పుడు సరసమైన ధరలకే ఇంటి తరహా భోజనం (home-style meals) డెలివరీ చేయబోతున్నట్లు Zomato ప్రకటించింది.
హోటళ్లు, రెస్టారెంట్లలో తయారు చేసే ఆహారం రుచే వేరు. ఆ ఫుడ్ అంటే అందరికీ ఇష్టమే. కానీ, ప్రతిరోజూ రెస్టారెంట్ ఫుడ్ తినాలంటే మాత్రం భయం. ప్రతిరోజూ బయటి తిండి తింటే బిల్లు తడిసిమోపెడు అవుతుందన్న భయంటు, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్న ఆందోళనలు కస్టమర్లలో ఉన్నాయి. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న తరహాలో.. ఈ రెండు ఆందోళనలకు ఒకే స్కీమ్‌తో చెక్ పెడుతోంది జొమాటో.
Zomato తీసుకొచ్చిన కొత్త స్కీమ్ పేరు జొమాటో ఎవ్రీడే (Zomato Everyday). దీని ద్వారా ఇంటి తరహా భోజనాన్ని జోమాటో అందిస్తుంది. దీనిని కూడా జొమాటో యాప్ నుంచే ఆర్డర్ చేసుకోవచ్చు.
రూ.89కి ఇంటి తరహా ఆహారం
Zomato హోమ్-స్టైల్ ఫుడ్ కేవలం రూ. 89 నుంచి ప్రారంభం అవుతుంది. పైలెట్ ప్రాజెక్ట్‌గా గురుగావ్ నగరంలోని ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో ఈ సదుపాయాన్ని జొమాటో ప్రారంభించింది.
ఈ స్కీమ్ ద్వారా... హోటళ్లు, రెస్టారెంట్లలో కాకుండా ఇళ్లలో తయారు చేసిన ఆహారాన్ని చౌక ధరలో పొందవచ్చని Zomato వ్యవస్థాపకుడు, CEO దీపిందర్ గోయల్ చెప్పారు. అది కూడా, నిజమైన హోమ్ చెఫ్‌లు రూపొందించిన మెనూని ఆస్వాదించవచ్చని అన్నారు. ఈ ఆహారం మీ ఇంటిని గుర్తుకు తెస్తుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.
ఈ స్కీమ్ కింద ఆహారాన్ని అందించడానికి... జొమాటో ఫుడ్ పార్టనర్లు హోమ్ చెఫ్‌లతో కలిసి పని చేస్తారు. వాళ్లు ఇళ్లలో వండిన ఆహారాన్ని జొమాటో డెలివెరీ చేస్తుంది.
'మెనుని బ్రౌజ్ చేయండి, మీకు ఇష్టమైన ఆహారాన్ని ఎంచుకోండి. వేడిగా, రుచికరమైన ఆహారం నిమిషాల్లో మీ ఇంటి వద్దకే డెలివరీ అవుతుంది' అని కంపెనీ ప్రకటించింది.
ఇన్‌స్టాంట్ స్థానంలో ఎవ్రీడే
గతంలో జొమాటో ఇన్‌స్టాంట్ (Zomato Instant) పేరిట 10 నిమిషాల్లో డెలివెరీ ఫెసిలిటీ తీసుకునిన జొమాటో, ఆ తర్వాత దానిని రద్దు చేసింది. ఇప్పుడు, దాని స్థానంలో జొమాటో ఎవ్రీడేని స్టార్ట్ చేసింది.
జొమాటో గోల్డ్ ఆఫర్
2023 జనవరి నుంచి, జొమాటో గోల్డ్ (Zomato Gold) పేరుతో కొత్త సభ్యత్వ కార్యక్రమాన్ని జొమాటో ప్రారంభించింది. ఈ స్కీమ్‌లో ప్రధాన ఆకర్షణ ఆన్ టైమ్ గ్యారెంటీ. గోల్డ్ మెంబర్‌లకు డెలివరీలో, పీక్ అవర్స్‌లో డైనింగ్-ఔట్‌లో రెండింటిలోనూ రకరకాల ఆఫర్‌లు అందుబాటులో ఉంటాయి.
ఆర్డర్ చేసేవాళ్లు లేక 225 చిన్న పట్టణాల్లో సర్వీసులను జొమాటో ఇటీవలే నిలిపేసింది. అయితే, ఏయే ప్రాంతాల్లో సేవలు నిలిపేసిందన్న విషయాన్ని మాత్రం జొమాటో వెల్లడించలేదు.
జొమాటో షేర్ ధర గత ఆరు నెలల కాలంలో 15% పైగా క్షీణించింది. గత ఏడాది కాలంలో 35% పైగా పతనమైంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.