Income Tax Refund: ఆదాయ పన్ను రిఫండ్ ఇంకా అందలేదా?, లాగిన్ అవసరం లేకుండా స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
ఆదాయపు పన్ను విభాగం వెబ్‌సైట్ ద్వారా, ITR రిఫండ్ స్థితిని పన్ను చెల్లింపుదారులు తనిఖీ చేసుకోవచ్చు.
![Income Tax Refund: ఆదాయ పన్ను రిఫండ్ ఇంకా అందలేదా?, లాగిన్ అవసరం లేకుండా స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి You acn check-income-tax-refund-status easily, know details Income Tax Refund: ఆదాయ పన్ను రిఫండ్ ఇంకా అందలేదా?, లాగిన్ అవసరం లేకుండా స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/14/cb0e13bd2f6a8083c0866d58bbf092e01673673538756545_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Income Tax Refund: ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పిస్తూ, కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను వాపసు (Refund) జారీ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో.. 2022 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2023 జనవరి 10వ తేదీ వరకు, ఈ మధ్య కాలంలో మొత్తం రూ. 2.40 లక్షల కోట్ల రిఫండ్స్ జారీ అయ్యాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది 58.74 శాతం ఎక్కువ.
మీరు ఆదాయ పన్ను పత్రాలు సమర్పించి, మీకు రావల్సిన ఇన్‌కం ట్యాక్స్ రిఫండ్‌ను ఇంకా అందుకోకపోతే, మీ రిఫండ్ స్టేటస్‌ను సులభంగా చెక్ (Check Income Tax Refund Status) చేసుకోవచ్చు. తద్వారా, రిఫండ్ ప్రక్రియ ఎంత దూరం వచ్చిందో మీకు అర్ధం అవుతుంది. మీ రిఫండ్ స్టేటస్‌ను (ITR Refund Check) ఎలా చెక్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆదాయ పన్ను వాపసు స్థితిని ఎలా తనిఖీ చేయాలి?
ఆదాయపు పన్ను విభాగం వెబ్‌సైట్ ద్వారా, ITR రిఫండ్ స్థితిని పన్ను చెల్లింపుదారులు తనిఖీ చేసుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో, మీరు ITR ఫైల్ చేసిన తర్వాత, మీ ఆదాయపు పన్ను రిటర్న్ స్థితిని తనిఖీ చేసుకునే వెసులుబాటు ఉంది. అదే విధంగా, రిఫండ్ స్థితిని కూడా తనిఖీ చేయవచ్చు.
లాగిన్ అవసరం లేకుండానే ITR స్థితిని తనిఖీ చేయండి
ముందుగా, ఆదాయపు పన్ను విభాగం ఈ-ఫైలింగ్ పోర్టల్ https://www.incometax.gov.in/iec/foportal/ ను సందర్శించండి.
ఇప్పుడు, హోమ్ పేజీలో కనిపించే ఇన్‌కమ్ ట్యాక్స్ రిఫండ్ స్టేటస్ (Income Tax Return (ITR) Status) మీద క్లిక్ చేయండి.
ఇప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో మీ ITR అక్‌నాలెడ్జ్‌మెంట్ నంబర్ (Acknowledgement Number), రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఆదాయ పన్ను విభాగం నుంచి OTP వస్తుంది. ఆ OTPని సంబంధిత బాక్స్‌లో నమోదు చేసి, సబ్మిట్ బటన్ నొక్కాలి.
ఇప్పుడు, మీ పూర్తి ట్యాక్స్ రిఫండ్ స్టేటస్ మీకు కనిపిస్తుంది.
ఇదే కాకుండా, మీ యూజర్ ID & పాస్‌వర్డ్‌తో ఉపయోగించి కూడా ఆదాయపు పన్ను రిటర్న్‌ను కూడా తనిఖీ చేయవచ్చు. ఇందుకోసం ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి వెళ్లాలి. హోమ్ పేజీలో.. యూజర్ ఐడీ & పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. దీని తర్వాత, మీరు ITR స్టేటస్ ఆప్షన్ మీద క్లిక్ చేయడం. ఆ తర్వాత పూర్తి సమాచారాన్ని పొందవచ్చు.
అక్‌నాలెడ్జ్‌మెంట్ నంబర్ ఎలా తెలుస్తుంది?
ఆదాయపు పన్ను విభాగం వెబ్‌సైట్‌లో స్టేటస్ తనిఖీ చేయడానికి మీకు అక్‌నాలెడ్జ్‌మెంట్ నంబర్ అవసరం. మీరు ITR ఫైల్ చేసిన తర్వాత మీకు అందే రిసిప్ట్‌లో Acknowledgement Number ఉంటుంది. ITR ఫైలింగ్ తర్వాత మీ రిజిస్టర్డ్ ఈ-మెయిల్ ద్వారా కూడా అక్‌నాలెడ్జ్‌మెంట్ నంబర్ అందుతుంది. ఈ రెండు విధానాల ద్వారా అక్‌నాలెడ్జ్‌మెంట్ నంబర్ మీకు తెలియకపోతే మరో మార్గం కూడా ఉంది. ఇన్‌కమ్ ట్యాక్స్ వెబ్‌సైట్ https://www.incometax.gov.in/iec/foportal/ లోకి మీరు లాగిన్ అయి, ITR రిసిప్ట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దానిలో మీ ITR అక్‌నాలెడ్జ్‌మెంట్ నంబర్ ఉంటుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)