News
News
వీడియోలు ఆటలు
X

Yes Bank: యెస్‌ బ్యాంక్‌ సూపర్‌ రికార్డ్‌- మైళ్ల దూరంలో రిలయన్స్‌, టీసీఎస్‌

రిలయన్స్ ఇండస్ట్రీస్, టిసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి స్టాక్ మార్కెట్‌ టాప్ కంపెనీలు యెస్ బ్యాంక్ చుట్టుపక్కల ఎక్కడా కనిపించడం లేదు.

FOLLOW US: 
Share:

Yes Bank Shareholders: ప్రైవేట్ రంగానికి చెందిన యెస్ బ్యాంక్ షేర్‌ ధర అతి స్వల్పంగా ఉండవచ్చుగాక, స్టాక్ మార్కెట్‌లోని అతి పెద్ద కంపెనీల లిస్ట్‌లో దీనిని లెక్కించకపోవచ్చుగాక, ఈ స్టాక్‌ అసలు పోటీలోనే లేదని ఇన్వెస్టర్లు భావించవచ్చుగాక. కానీ, స్టాక్ మార్కెట్‌లో యెస్‌ బ్యాంక్‌ ప్రత్యేకమైన రికార్డును సృష్టించింది, దీనితో పోలిస్తే అగ్రశ్రేణి కంపెనీలు మైళ్ల దూరం వెనుకబడి ఉన్నాయి. విలువ పరంగా మార్కెట్‌లో అతి పెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్, అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ SBIని ఓడించి మరీ యెస్ బ్యాంక్ ఈ రికార్డు సాధించింది.

50 లక్షలు దాటిన సంఖ్య
డేటా ప్రకారం... యెస్ బ్యాంక్ షేర్ హోల్డర్ల సంఖ్య 50 లక్షలు దాటింది. భారతీయ స్టాక్ మార్కెట్లో 50 లక్షలకు పైగా వాటాదార్లను కలిగి ఉన్న ఏకైక కంపెనీ యెస్ బ్యాంక్ మాత్రమే. ఈ ప్రకారం చూస్తే.. రిలయన్స్ ఇండస్ట్రీస్, టిసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి స్టాక్ మార్కెట్‌ టాప్ కంపెనీలు యెస్ బ్యాంక్ చుట్టుపక్కల ఎక్కడా కనిపించడం లేదు.

వెనకబడిన అతి పెద్ద కంపెనీలు 
తాజా షేర్ హోల్డింగ్ లెక్కల ప్రకారం.. యెస్ బ్యాంక్ షేర్ హోల్డర్ల సంఖ్య ప్రస్తుతం 50.57 లక్షలుగా ఉంది. దీంతో పోల్చి చూస్తే, మార్కెట్ విలువ ప్రకారం స్టాక్‌ మార్కెట్‌లో అతి పెద్ద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు 33.62 లక్షల మంది వాటాదార్లు ఉన్నారు. యెస్ బ్యాంక్ షేర్ హోల్డర్ల సంఖ్యతో పోలిస్తే, మార్కెట్‌ విలువ పరంగా రెండో అతి పెద్ద కంపెనీ అయిన టీసీఎస్ షేర్‌ హోల్డర్ల సంఖ్య కేవలం సగం మాత్రమే. టీసీఎస్‌కు 25.56 లక్షల మంది వాటాదార్లు ఉన్నారు. విలువ పరంగా మూడో అతి పెద్ద కంపెనీ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్‌ హోల్డర్ల సంఖ్య యెస్‌ బ్యాంక్‌ నంబర్‌లో సగం కూడా లేదు. ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు 22.90 లక్షల మంది వాటాదార్లు ఉన్నారు.

మైళ్ల దూరంలో వెనుకబడ్డ ఇతర బ్యాంకులు
ఇతర బ్యాంకుల గురించి చెప్పుకుంటే... స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఇష్టమైన ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్ర బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్‌లు సంఖ్య పరంగా యెస్ బ్యాంక్ ముందు మరుగుజ్జుల్లా మిగిలాయి. 2023 మార్చి చివరి నాటికి, ICICI బ్యాంక్‌ 17.80 లక్షల మంది వాటాదార్లను కలిగి ఉంది. కోటక్ మహీంద్ర బ్యాంక్‌కు 5.82 లక్షలు, యాక్సిస్ బ్యాంక్‌కు 8.46 లక్షల మంది వాటాదార్లు ఉన్నారు.

యెస్‌ బ్యాంక్‌లో అతి పెద్ద వాటాదార్లు
దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ కూడా యెస్‌ బ్యాంక్‌ కంటే వెనుకబడి ఉంది. ప్రస్తుతం ఎస్‌బీఐలో దాదాపు 28 లక్షల మంది వాటాదార్లు ఉన్నారు. విచిత్రం ఏంటంటే.. యెస్‌ బ్యాంక్‌లో ఎస్‌బీఐ అతి పెద్ద వాటాదారు. యెస్ బ్యాంక్‌లో ఎస్‌బీఐకి 26.14 శాతం వాటా ఉంది. LICకి 4.34 శాతం, యాక్సిస్ బ్యాంక్‌కు 1.57 శాతం, ICICI బ్యాంక్‌కు 2.61 శాతం, IDFC ఫస్ట్ బ్యాంక్‌కు 1 శాతం షేర్లు ఉన్నాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 18 Apr 2023 08:20 AM (IST) Tags: TCS RIL YES Bank Shareholders number

సంబంధిత కథనాలు

Stock Market News: 18,600 మీదే నిఫ్టీ క్లోజింగ్‌ - సెన్సెక్స్‌ 123 పాయింట్లు ప్లస్‌!

Stock Market News: 18,600 మీదే నిఫ్టీ క్లోజింగ్‌ - సెన్సెక్స్‌ 123 పాయింట్లు ప్లస్‌!

2000 Notes: SBI దగ్గరకు ఎన్ని 2000 రూపాయల నోట్లు వచ్చాయో తెలుసా?

2000 Notes: SBI దగ్గరకు ఎన్ని 2000 రూపాయల నోట్లు వచ్చాయో తెలుసా?

Stock Ideas: కన్సాలిడేషన్‌ గోడను బద్ధలు కొట్టిన PSU స్టాక్స్‌, మల్టీబ్యాగర్స్‌గా మారే ఛాన్స్‌!

Stock Ideas: కన్సాలిడేషన్‌ గోడను బద్ధలు కొట్టిన PSU స్టాక్స్‌, మల్టీబ్యాగర్స్‌గా మారే ఛాన్స్‌!

Cryptocurrency Prices: మిక్స్‌డ్‌ జోన్లో క్రిప్టో మార్కెట్‌ - రూ.15వేలు తగ్గిన బిట్‌కాయిన్‌!

Cryptocurrency Prices: మిక్స్‌డ్‌ జోన్లో క్రిప్టో మార్కెట్‌ - రూ.15వేలు తగ్గిన బిట్‌కాయిన్‌!

Jubilant Pharmova: జర్రున జారిన జూబిలెంట్‌ ఫార్మోవా, నష్టం నెత్తికెక్కితే రిజల్ట్‌ ఇలాగే ఉంటది

Jubilant Pharmova: జర్రున జారిన జూబిలెంట్‌ ఫార్మోవా, నష్టం నెత్తికెక్కితే రిజల్ట్‌ ఇలాగే ఉంటది

టాప్ స్టోరీస్

Sujana Medical College : మెడిసిటీ మెడికల్ కాలేజీ అనుమతులు రద్దు - నిబంధనలు ఉల్లంఘించడమే కారణం !

Sujana Medical College : మెడిసిటీ మెడికల్ కాలేజీ అనుమతులు రద్దు -  నిబంధనలు ఉల్లంఘించడమే కారణం !

Telangana Congress : టిక్కెట్లిస్తే పార్టీలోకి వస్తాం - తెలంగాణ కాంగ్రెస్‌కు ఇద్దరు మాజీ ఎంపీల కబురు !

Telangana Congress :  టిక్కెట్లిస్తే పార్టీలోకి వస్తాం - తెలంగాణ కాంగ్రెస్‌కు ఇద్దరు మాజీ ఎంపీల కబురు !

బాలయ్య మూవీ టైటిల్ ఇదేనా, సమంత చెప్పులు చాలా కాస్ట్ గురూ - ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలివే

బాలయ్య మూవీ టైటిల్ ఇదేనా, సమంత చెప్పులు చాలా కాస్ట్ గురూ - ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలివే

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం

Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం