By: ABP Desam | Updated at : 15 May 2023 02:00 PM (IST)
టోకు ధరల ద్రవ్యోల్బణం ( Image Source : Getty )
WPI Inflation:
టోకు ధరల ద్రవ్యోల్బణం (WPI Inflation) ఏప్రిల్ నెలలో వార్షిక ప్రాతిపదికన -0.92 శాతానికి తగ్గింది. వరుసగా 11వ నెల కుంచించుకుపోయింది. గతేడాది మార్చిలోని 1.34 శాతంతో పోలిస్తే చాలా తగ్గిందని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. వరుసగా 11వ నెల 0.2 శాతం తగ్గుతుందని రాయిటర్స్ పోల్ అంచనా వేయగా.. అంతకు మించే తగ్గింది. కాగా నెలవారీ ప్రాతిపదికన మార్చి నుంచి ఏప్రిల్‌లో ఇది 0.0 శాతం వద్దే నిలకడగా ఉంది.
స్థూలంగా ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ ప్రాథమికంగా క్రూడాయిల్, ఎనర్జీ ధరలు, ఆహార, ఆహార ఏతర ధరల తగ్గుదలే ఇందుకు కారణమని ప్రభుత్వం వెల్లడించింది. మార్చిలో 2.40 శాతంగా ఉన్న ప్రాథమిక వస్తువుల ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 1.60 శాతానికి నెమ్మదించింది. మార్చిలో 8.96 శాతంగా ఉన్న ఇంధనం, విద్యుత్ ఇన్‌ప్లేషన్ ఏప్రిల్‌లో 0.93 శాతానికి చేరుకుంది. ఫిబ్రవరిలో ఇది 13.96 శాతంగా ఉండటం గమనార్హం.
తయారీ వస్తువుల ద్రవ్యోల్బణం -0.77 శాతం నుంచి -2.42 శాతానికి తగ్గింది. తయారీ ఉత్పత్తులు, ఇంధన వస్తువులు, ఆహార వస్తువుల ధరలు తగ్గుముఖం పట్టడంతో మార్చిలో టోకు ధరల ద్రవ్యోల్బణం 29 నెలల కనిష్ఠమైన 1.34 శాతానికి చేరుకుంది. ఇక ఏప్రిల్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్ఠమైన 4.7 శాతానికి తగ్గిన సంగతి తెలిసిందే. అంతకు ముందు నెల ఇది 5.7 శాతంగా ఉంది.
'ఈ గణాంకాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఆర్బీఐ పాలసీలపై ప్రభావం చూపొచ్చు' అని ఎస్‌బీఐ రీసెర్చ్ రిపోర్ట్ పేర్కొంది. 'వస్తువుల వారీగా పరిశీలిస్తే ఆహారం, పానీయాల గరిష్ఠ వెయిటేజీ ఏప్రిల్ నెలలో 41 బేసిస్ పాయింట్లు తగ్గింది. గోధుమలు, గోధుమ పిండి ఇందుకు దోహదం చేసింది. మామిడి పండ్ల వెయిటేజీ 11 బేసిస్ పాయింట్లు తగ్గడంతో పండ్ల ద్రవ్యోల్బణం తగ్గింది' అని వెల్లడించింది.
భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని కొలిచే రెండు సూచీల్లో ఒకటి WPI ఆధారిత ద్రవ్యోల్బణం, మరొకటి వినియోగదారు ధరల ఆధారిత (CPI) ద్రవ్యోల్బణం. కంపెనీ నుంచి కంపెనీ మధ్య చేతులు మారే వస్తువుల ధరలను, వాటి ఉత్పత్తి స్థాయిలో WPI ద్రవ్యోల్బణం కోసం పరిగణనలోకి తీసుకుంటారు. దీనికి వ్యతిరేకంగా, రిటైల్ వినియోగదార్ల స్థాయిలోని ధరలను CPI ద్రవ్యోల్బణం కోసం పరిగణనలోకి తీసుకుంటారు.
మార్చి WPI ద్రవ్యోల్బణం వివరాలు
భారతదేశంలో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం (wholesale price index based inflation) భారీ ఉపశమనాన్ని ఇచ్చింది. 2023 మార్చి నెలలో, WPI ఇన్‌ఫ్లేషన్ 1.34 శాతంగా నమోదైంది. ఇది 29 నెలల కనిష్ట స్థాయి.
టోకు ద్రవ్యోల్బణం రేటు 2023 ఫిబ్రవరి నెలలోని 3.85 శాతంగా ఉంది. అక్కడి నుంచి మార్చి నెలలో ఒక్కసారే 2.51 శాతం తగ్గింది. అంతకుముందు, 2023 జనవరి నెలలో టోకు ద్రవ్యోల్బణం రేటు 4.73 శాతంగా ఉంది. గత కొన్ని నెలలుగా WPI ద్రవ్యోల్బణం వస్తోంది.
ప్రధానంగా, ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం రేటు తక్కువగా ఉండటం వల్ల టోకు ద్రవ్యోల్బణం రేటులో ఈ స్థాయి తగ్గుదల కనిపించింది. ఆహార ద్రవ్యోల్బణం ఫిబ్రవరి నెలలోని 2.76 శాతం నుంచి మార్చి నెలలో 2.32 శాతానికి తగ్గింది.
ప్రాథమిక లోహాలు, ఆహార ఉత్పత్తులు, వస్త్రాలు, ఆహారేతర వస్తువులు, ఖనిజాలు, రబ్బరు, ప్లాస్టిక్ ఉత్పత్తులు, ముడి పెట్రోలియం, సహజ వాయువుతో పాటు కాగితం, కాగితం ఉత్పత్తుల ధరలు తగ్గడం వల్ల ఈసారి టోకు ద్రవ్యోల్బణం తగ్గిందని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.
ఇంధనం & విద్యుత్ ద్రవ్యోల్బణం 2023 ఫిబ్రవరిలోని 14.82 శాతం నుంచి మార్చిలో 8.96 శాతానికి తగ్గింది. తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలోని 1.94 శాతం నుంచి మార్చిలో 0.77 శాతానికి తగ్గింది. బంగాళదుంపల టోకు ద్రవ్యోల్బణం 2023 ఫిబ్రవరిలో -14.30 శాతంగా ఉండగా, మార్చి చివరి నాటికి -23.67 శాతానికి తగ్గింది. ఉల్లిపాయల టోకు ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో -40.14 శాతంగా ఉంది, మార్చిలో -36.83 శాతానికి పెరిగింది.
FPIs: మే నెలలో ట్రెండ్ రివర్స్, డాలర్ల వరద పారించిన ఫారినర్లు
Interest Rates: వడ్డీ రేట్లు పెంచిన, తగ్గించిన బ్యాంకుల లిస్ట్ - మీ అకౌంట్ పరిస్థితేంటో చెక్ చేసుకోండి
Latest Gold-Silver Price Today 04 June 2023: వన్నె తగ్గిన పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Petrol-Diesel Price 04 June 2023: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి పెట్రోల్, డీజిల్ ధరలు - కొత్త రేట్లివి
Debit Card: ఏటీఎం కార్డ్‌తో ₹5 లక్షల 'ఫ్రీ' ఇన్సూరెన్స్, ఇది అందరికీ చెప్పండి
Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు
Malavika Mohanan: ప్రభాస్ హీరోయిన్ మాళవిక లేటెస్ట్ ఫొటోస్
Botsa Satyanarayana: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో 482 మంది ఏపీ వాసులు గుర్తింపు, వారి పరిస్థితి ఇదీ - మంత్రి బొత్స వెల్లడి
Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?