News
News
వీడియోలు ఆటలు
X

US FED: వడ్డీ రేట్లను 0.25 శాతం పెంచిన ఫెడ్‌, ఇకపై విరామం ఇస్తామంటూ హింట్‌

US ఈక్విటీలు లాభాలను కొనసాగించాయి, ట్రెజరీ ఈల్డ్స్ & డాలర్ క్షీణించాయి.

FOLLOW US: 
Share:

US FED Hikes Rate: అగ్రరాజ్యం అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి, ఆ దేశ కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ (Federal Reserve) తన పాలసీ రేటును మరోసారి పెంచింది. మార్కెట్‌ ముందు నుంచి ఊహించినట్లుగానే ఈ దఫా బ్యాంక్‌ రేట్లను 25 బేసిస్ పాయింట్లు లేదా 0.25 శాతం పెంచింది. ఈ పెరుగుదలతో, అమెరికాలో ఫెడ్ రేటు 16 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంది.

ఇదే ఆఖరి పెంపు అంటూ సూచన
వడ్డీ రేట్ల పెంపుతో పాటు మరో సూచన కూడా యూఎస్‌ ఫెడ్ (US FED) నుంచి వచ్చింది. 1980ల తర్వాత ఆ స్థాయిలో దూకుడుగా ఉన్న వడ్డీ రేట్ల పెంపు చక్రంలో ఇదే ఆఖరి పెంపుదల అవుతుందని, మరో దఫా పెరుగుదల ఉండదని హించ్‌ ఇచ్చింది. తాజా పెంపుతో కలిపి, వరుసగా 10వ సారి రేట్లను పెంచింది. "ఇన్‌కమింగ్ డేటాను కమిటీ నిశితంగా పరిశీలిస్తుందని, ద్రవ్య విధానం ప్రభావాన్ని అంచనా వేస్తుందని" తన ప్రకటనలో 'ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ' (FOMC) వెల్లడించింది.

తాజాగా 25 బేసిస్ పాయింట్లు పెరుగుదలతో.. ఫెడ్ బెంచ్‌మార్క్ ఫెడరల్ ఫండ్స్ రేటు 5% నుంచి 5.25% శ్రేణికి పెరిగింది. 2007 తర్వాత ఇదే గరిష్ఠ స్థాయి. ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ గత 14 నెలలుగా బ్యాంక్ రేటును నిరంతరం పెంచుతోంది. గత సంవత్సరం (2022) ప్రారంభంలో దాదాపు సున్నా నుంచి ఇది పెరిగింది. బెంచ్‌మార్క్‌ రేట్లను 25 బేసిస్‌ పాయింట్లు పెంచాలన్న నిర్ణయానికి 'ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ' ఏకగ్రీవంగా ఓటు వేసింది. 

లాభాల్లో యూఎస్‌ స్టాక్‌ మార్కెట్లు
మార్కెట్‌ అంచనాలకు తగ్గట్లుగానే వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం, ఆ తర్వాత ఫెడ్‌ ప్రకటన ఉండడంతో.. US ఈక్విటీలు లాభాలను కొనసాగించాయి, ట్రెజరీ ఈల్డ్స్ & డాలర్ క్షీణించాయి.

బ్యాంకింగ్ వ్యవస్థలో బలం: పావెల్‌
పాలసీ సమావేశం అనంతరం, ఫెడరల్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ (US FED Chairman Jerome Powell) మాట్లాడారు. అమెరికాలో బ్యాంకింగ్‌ వ్యవస్థ పటిష్టంగా, దృఢంగా ఉందన్నారు. అయితే, ఆర్థిక వ్యవస్థలో ఇబ్బందుల కారణంగా వ్యయాలు & వృద్ధి రెండింటి వేగం మందగించవచ్చని సూచించారు. 

"గృహ అవసరాలు, వ్యాపారాల కోసం తీసుకునే రుణాలపై వడ్డీ రేట్ల పెంపు ప్రభావం కఠినంగా ఉంది. దీనివల్ల ఆర్థిక కార్యకలాపాలు, ఉద్యోగ నియామకాలు, ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది" అని FOMC తన ప్రకటనలో తెలిపింది. ఈ ప్రభావాల పరిధి అనిశ్చితంగా ఉందని, ద్రవ్యోల్బణం రిస్క్‌ను కమిటీ నిశితంగా పరిశీలిస్తుందని వెల్లడించింది.

తగ్గిన ఉద్యోగావకాశాలు, ఎక్కువ రిట్రెంచ్‌మెంట్లు
మంగళవారం (02 మే 2023), లేబర్ డిపార్ట్‌మెంట్ నుంచి నెలవారీ నివేదిక విడుదలైంది. 2023 మార్చిలో ఉద్యోగ అవకాశాలు తగ్గాయని, లేఆఫ్‌లు పెరిగాయని ఆ డేటా చూపించింది. ఆర్థిక మందగమనం జాబ్ మార్కెట్‌పై ఎలాంటి ప్రభావాన్ని చూపుతోందో ఇది స్పష్టం చేసింది. ఇప్పటికీ పెరుగుతున్న నిరుద్యోగ గణాంకాలు వాషింగ్టన్‌లో ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 04 May 2023 09:06 AM (IST) Tags: America US FED Federal Reserve Inflation Interest Rates

సంబంధిత కథనాలు

Forex: పుంజుకున్న విదేశీ వాణిజ్యం, రెండు వారాల తర్వాత ఫారెక్స్‌ కళ

Forex: పుంజుకున్న విదేశీ వాణిజ్యం, రెండు వారాల తర్వాత ఫారెక్స్‌ కళ

Top 10 Headlines Today: మంత్రులపై బాబు పంచ్‌లు, జగన్‌పై పేర్ని నాని ప్రశంసలు- సింగరేణిపై కేసీఆర్ కీలక ప్రకటన

Top 10 Headlines Today: మంత్రులపై బాబు పంచ్‌లు, జగన్‌పై పేర్ని నాని ప్రశంసలు- సింగరేణిపై కేసీఆర్ కీలక ప్రకటన

Gold-Silver Price Today 10 June 2023: పసిడిపై ఫెడ్‌ ఎఫెక్ట్‌ - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Price Today 10 June 2023: పసిడిపై ఫెడ్‌ ఎఫెక్ట్‌ - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లో నెగెటివ్‌ సెంటిమెంట్‌ - బిట్‌కాయిన్‌ 5వేలు జంప్‌!

Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లో నెగెటివ్‌ సెంటిమెంట్‌ - బిట్‌కాయిన్‌ 5వేలు జంప్‌!

Shloka Necklace: అంబానీ కోడలి డైమండ్‌ నెక్లెస్‌కు రిపేర్‌, దాని రేటు తెలిస్తే షాకవుతారు

Shloka Necklace: అంబానీ కోడలి డైమండ్‌ నెక్లెస్‌కు రిపేర్‌, దాని రేటు తెలిస్తే షాకవుతారు

టాప్ స్టోరీస్

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !

Apsara Murder Case Update :  అప్సర హత్య  వెనుక ఇన్ని కోణాలున్నాయా ? -  మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన  సంచలన విషయాలు !

Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?

Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?