అన్వేషించండి

Byjus: బైజూస్‌కు మరో ఎదురు దెబ్బ, 53 కోట్ల డాలర్లు ఫ్రీజ్‌ చేసిన కోర్టు

Byjus: ఆ డబ్బును ఎడ్‌టెక్ సంస్థ ఉపయోగించకుండా చూడాలని, ఆ మొత్తాన్ని కోర్టులో డిపాజిట్ చేసేలా ఆదేశించాలని అమెరికన్‌ కోర్టుకు రుణదాతలు విజ్ఞప్తి చేశారు.

Byjus Crisis: ఊపిరాడని సమస్యల్లో చిక్కుకుని ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్‌కు మరో గట్టి దెబ్బ తగిలింది. ఓ కేసు విషయంలో, బైజూస్‌ మాతృ సంస్థ 'థింక్ & లెర్న్‌'కు (Think & Learn) పిడుగు లాంటి ఆదేశం అందింది. శుక్రవారం, ఒక అమెరికన్ కోర్టు బైజూస్‌కు చెందిన 533 మిలియన్‌ డాలర్లను ఫ్రీజ్‌ చేసింది. ఆ డబ్బును ఎక్కడా ఉపయోగించరాదని తన ఉత్తర్వుల్లో కోర్టు పేర్కొంది. కంపెనీకి వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తున్న రుణదాతల విజయంగా దీనిని చెప్పుకోవచ్చు. తాము ఇచ్చిన అప్పులను తిరిగి తీర్చడానికి మాత్రమే ఆ డబ్బును ఉపయోగించాలన్నది రుణదాతల డిమాండ్.

గుర్తు తెలియని చోటుకు డబ్బు బదిలీ
న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకున్న తర్వాత, 'థింక్ అండ్ లెర్న్' ఈ 533 మిలియన్‌ డాలర్లను మోర్టాన్స్ హెడ్జ్ ఫండ్‌కు బదిలీ చేసిందని విచారణ సమయంలో రుణదాతలు ఆరోపించారు. ఆ తర్వాత ఆ డబ్బు పేరు లేని విదేశీ ట్రస్ట్‌కు బదిలీ అయిందని కోర్టుకు చెప్పారు. ఆ డబ్బును ఎడ్‌టెక్ సంస్థ ఉపయోగించకుండా చూడాలని, ఆ మొత్తాన్ని కోర్టులో డిపాజిట్ చేసేలా ఆదేశించాలని అమెరికన్‌ కోర్టుకు రుణదాతలు విజ్ఞప్తి చేశారు.

బైజు రవీంద్రన్ సోదరుడే టార్గెట్
బైజూ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్‌కు సోదరుడు, కంపెనీ డైరెక్టర్ రిజు రవీంద్రన్‌పై యూఎస్‌ కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. 533 మిలియన్‌ డాలర్లు ఎక్కడికి వెళ్లిందో చెప్పాలని ఆదేశించింది. ఆ డబ్బు గురించి తనకు తెలీదని రిజు రవీంద్రన్‌ చెప్పారు. అంత పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడుందో తెలీదన్న రిజు రవీంద్రన్‌ మాటల్ని తాను నమ్మలేకపోతున్నాను అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. డబ్బు ఎక్కడ ఉందన్న విషయంలో రుణదాతలకు 'థింక్ అండ్ లెర్న్' ఎందుకు సమాచారం ఇవ్వడం లేదని పశ్నించారు. థింక్ అండ్ లెర్న్‌లో కొనసాగుతున్న సంక్షోభానికి రుణదాతలే బాధ్యులని రవీంద్రన్ తరఫు న్యాయవాది షారన్ కార్పస్ వాదించారు. ఆ వ్యక్తులే లోన్ డిఫాల్ట్ విషయంలో తమపై చాలా ఒత్తిడి తెచ్చారని వెల్లడించారు. డెలావేర్, న్యూయార్క్ కోర్టుల్లోనూ రుణదాతలతో బైజూస్‌ పోరాడుతోంది.

హెడ్జ్ ఫండ్ వ్యవస్థాపకుడు అరెస్ట్
గతంలో, థింక్ అండ్ లెర్న్ ద్వారా ఏర్పాటైన హోల్డింగ్ కంపెనీ 'ఆల్ఫా'ను రుణదాతలు తమ నియంత్రణలోకి తీసుకున్నారు. 1.2 బిలియన్‌ డాలర్ల రుణ సేకరణ కోసం ఆల్ఫాను సృష్టించారు. ఆల్ఫా కంపెనీ, కోర్టులో దివాలా పిటిషన్ దాఖలు చేసింది. ఆ కంపెనీని రుణదాతలు స్వాధీనం చేసుకోవడంపై రవీంద్రన్ డెలావేర్ కోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. 

మరోవైపు, ఫ్లోరిడా హెడ్జ్ ఫండ్ వ్యవస్థాపకుడిని అరెస్టు చేయాలని అమెరికన్‌ న్యాయస్థానం ఆదేశించింది. థింక్ అండ్ లెర్న్, 533 మిలియన్‌ డాలర్లను ఎక్కడ దాచిందో చెప్పడానికి అతను నిరాకరించాడు. ఆ డబ్బు గురించి సమాచారం ఇచ్చే వరకు, రోజుకు 10 వేల డాలర్ల చొప్పున జరిమానా చెల్లించాలని ఫ్లోరిడా హెడ్జ్ ఫండ్ వ్యవస్థాపకుడి కోర్టు ఆదేశించింది.

మరో ఆసక్తికర కథనం: 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
CM Chandrababu: సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
సీఎం చంద్రబాబు వర్సెస్ మంత్రి లోకేశ్ - టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు గెలిచారంటే?
Sukumar: నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
నా మనసు వికలమైంది... రేవతి ప్రాణాన్ని తీసుకురాలేను... మహిళ మృతిపై సుకుమార్ ఎమోషనల్ మూమెంట్
OnePlus Ace 5 Mini: వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
వన్‌ప్లస్ కాంపాక్ట్ ఫోన్ లాంచ్ త్వరలో - చిన్న సైజులో, క్యూట్ డిజైన్‌తో!
Rishabh Pant: డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
డబ్బు కోసమే మమ్మల్ని కాదనుకున్నాడు, రిషభ్ పంత్ పై ఢిల్లీ కోచ్ సంచలన ఆరోపణలు
Toyota Innova Hycross: ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
ఇన్నోవా హైక్రాస్ ధరను పెంచిన టయోటా - ఇప్పుడు రేటెంత?
Telangana News: మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
మూసీ, హైడ్రాలపై కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదు, BRSను ఎదుర్కోలేకపోతున్నాం: ABP దేశంతో ఫిరోజ్ ఖాన్
Pawan Kalyan: 'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
'సినీ నటుడిగా చెబుతున్నా, మీ టీచర్లే మీ హీరోలు' - విద్యార్థులతో కలిసి భోజనం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Embed widget