Union Budget 2022 Update: భారత్ బడ్జెట్ 2022-23... వీటి ధరలు తగ్గాయ్ వాటి ధరలు పెరిగాయ్...
కేంద్ర బడ్జెట్ 2022-23 ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. కస్టమ్స్ ట్యూటీ, దిగుమతి సుంకం, ఇతర ఛార్జీల్లో మార్పుతో వస్తువుల ధరలపై ప్రభావం చూపనుంది. ఏయో వస్తువుల ధరలు పెరిగాయో, తగ్గాయో చూద్దాం.
![Union Budget 2022 Update: భారత్ బడ్జెట్ 2022-23... వీటి ధరలు తగ్గాయ్ వాటి ధరలు పెరిగాయ్... Union budget 2022 update imports excise duty changes which are cheaper and dearer Union Budget 2022 Update: భారత్ బడ్జెట్ 2022-23... వీటి ధరలు తగ్గాయ్ వాటి ధరలు పెరిగాయ్...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/01/9f9ffe209ad9f876cd07a8eee6022b46_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో 2022-23 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ గంపెడు ఆశలు పెట్టుకున్న వేతల జీవులకు కేంద్రం ఊరట ఇవ్వలేదు. టాక్స్ స్లాబ్ లను యథావిధిగా కొనసాగించింది. అయితే ఈసారి బడ్జెట్ లో కస్టమ్ డ్యూటీ, దిగుమతి సుంకం సహా ఏయే ఇతర చార్జీలు పెంచారో, ఏయే వస్తువులపై తగ్గించారో ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు. వీటి ఆధారంగా ఇప్పుడు ఏ వస్తువుల ధరలు తగ్గుతాయో, ఏవి పెరుగుతాయో ఒకసారి దృష్టిసారిద్దాం.
ధరలు తగ్గేవి
వజ్రాలు,రత్నాలు, ఆభరణాలపై కేంద్రం కస్టమ్ డ్యూటీ 5 శాతానికి తగ్గించింది. కట్, పాలిష్ చేసిన వజ్రాలపై కస్టమ్ డ్యూటీని కూడా 5 శాతం తగ్గించింది. దీంతో రత్నాలు, ఆభరణాలు తక్కువ ధరలు తగ్గుతాయి. పుదీనా నూనెపై కస్టమ్ డ్యూటీని తగ్గించింది. కాబట్టి పుదీనా నూనె చౌకగా లభించనుంది. అదే సమయంలో మొబైల్ ఫోన్ ఛార్జర్లు , ట్రాన్స్ ఫార్మర్లపై కస్టమ్ డ్యూటీ తగ్గించింది. దీంతో ఈ వస్తువుల ధరలు తగ్గుతాయి. వీటితో పాటు ధరలు తగ్గే ఇతర వస్తువులు...
- మొబైల్ ఫోన్ ఛార్జర్లు
- రత్నాలు, ఆభరణాలు
- వ్యవసాయ వస్తువులు
- చెప్పులు
- తోలు వస్తువులు
- ప్యాకేజింగ్ పెట్టెలు
- పాదరక్షలు
- ఎలక్ట్రానిక్ వస్తువులు
- విదేశీ యంత్రాలు
- ఘనీభవించిన మాంసాహారపదార్థాలు
- ఇంగువ
- కోకో బీన్స్
- మిథైల్ ఆల్కహాల్ (ఎసిటిక్ యాసిడ్)
- సెల్యులార్ మొబైల్ ఫోన్ కోసం కెమెరా లెన్స్
- జెమ్ స్టోన్స్
- మొబైల్ ఫోన్స్
- దుస్తులు
ధరలు పెరిగే వస్తువులు
ఇమిటేషన్ ఆభరణాలపై కస్టమ్ డ్యూటీని కేంద్రం పెంచింది. దీంతో ఈ ఆభరణాల ధరలు పెరిగే అవకాశం ఉంది. దిగుమతులను తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం చర్య తీసుకుంది. అక్టోబరు 2022 నుంచి నాన్-బ్లెండింగ్ ఇంధనంపై లీటరుకు రూ. 2 ఎక్సైజ్ సుంకం పెంచనుంది.
- గొడుగులు
- ఇమిటేషన్ ఆభరణాలు
- లౌడ్ స్పీకర్లు
- హెడ్‌ఫోన్‌లు, ఇయర్‌ఫోన్‌లు
- స్మార్ట్ మీటర్లు
- సౌర బ్యాటరీలు
- సోలార్ మాడ్యూల్స్
- ఎక్స్‌రే యంత్రాలు
- ఎలక్ట్రానిక్ బొమ్మల భాగాలు
- ఎరువులు
- ఐరన్, స్టీల్
- ప్రిడ్జ్ లు , ఏసీలు
Also Read: 'అమృత కాలం'కు 'పీఎం గతి శక్తి'తో బాటలు..! రాబోయే 25 ఏళ్లకు నిర్మలమ్మ మాస్టర్ ప్లాన్!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)