By: ABP Desam | Updated at : 02 Mar 2023 02:30 PM (IST)
Edited By: Arunmali
ట్విట్టర్ కొత్త CEO అన్వేషణ సమాప్తం
Twitter New CEO: ట్విట్టర్ కొత్త 'ముఖ్య కార్యనిర్వహణ అధికారి' (CEO) కోసం ఎలాన్ మస్క్ (Elon Musk) సాగిస్తున్న అన్వేషణకు తెర పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2023 చివరి నాటికి Twitter కొత్త CEOని చూడవచ్చు. ఆ వ్యక్తి పేరును త్వరలోనే ప్రకటించే అవకాశం కూడా ఉంది. ట్విట్టర్‌ను సమర్థవంతంగా నడిపించే టాప్ లెవల్ బాస్ (CEO) కోసం ఎలాన్ మస్క్ కొన్ని నెలల క్రితం నుంచి వెతుకుతున్నారు.
ట్విట్టర్ ప్రస్తుత సీఈవో ఎలాన్ మస్క్, ఆ పదవి తాను కొనసాగాలా, వద్దా అంటూ కొంతకాలం క్రితం ఒక ప్రజా పోల్ (Twitter Poll) నిర్వహించారు. ట్విట్టర్ CEO పదవిలో తానే ఉండాలా, లేక పదవి నుంచి దిగిపోవాలా అని ట్విట్టర్ యూజర్లను అడిగారు. ఈ పోల్‌లో 1.7 మిలియన్ల మంది పాల్గొన్నారు. వాళ్లలో మెజారిటీ యూజర్లు (57.5 శాతం మంది), CEO పదవీని వదిలేయమంటూ ఎలాన్ మస్క్‌కు సలహా ఇచ్చారు. ఆ పోల్‌లో మెజారిటీ యూజర్ల అభిప్రాయం ప్రకారం తాను నడుచుకుంటానని పోల్‌కు ముందే ఎలాన్ మస్క్ చెప్పారు. పోల్ తర్వాత కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. ట్విట్టర్‌ను నడపడానికి 'సరైన మూర్ఖుడు' దొరికిన రోజు, CEO పదవిని తాను వదిలేస్తానంటూ ట్వీట్ చేశారు. సాఫ్ట్‌వేర్, సర్వర్ బృందాలను మాత్రమే తాను ఆపరేట్ చేస్తానని ఆ ట్వీట్‌లో వివరించారు. ఇచ్చిన మాట ప్రకారం, ట్విట్టర్ కొత్త CEO కోసం అప్పటి నుంచి ఎలాన్ మస్క్ వెదకడం ప్రారంభించారు.
ఎలాన్ మస్క్ అన్వేషణ నేపథ్యంలో, చాలా మంది పేర్లు తెర పైకి వచ్చాయి. జాక్ డోర్సే (Jack Dorsey) మళ్లీ బోర్డులోకి వస్తారని?, మళ్లీ CEO పగ్గాలు చేతబట్టమని పరాగ్ అగర్వాల్‌ని (Parag Agarwal) ట్విట్టర్ అడగవచ్చని, ఎలాన్ మస్కే CEOగా కొనసాగుతారని.. ఇలా చాలా పుకార్లు షికార్లు చేశాయి. ఈ ఊహాగానాల మధ్య, ఎలాన్ మస్క్ వారసుడిగా ఇప్పుడు కొత్త పేరు తెరపైకి వచ్చింది, ఆ వ్యక్తే ట్విట్టర్ తదుపరి CEO కావచ్చని నమ్మకంగా తెలుస్తోంది.
Twitter కొత్త CEO ఎవరు కావచ్చు?
ట్విట్టర్ కొత్త బాస్ కాగలడు అని వినిపిస్తున్న పేరు స్టీవ్ డేవిస్ (Steve Davis). ఎలాన్ మస్క్‌కే చెందిన "ది బోరింగ్ కంపెనీ"కి (The Boring Company) ఈయన ఇప్పుడు CEOగా పని చేస్తున్నారు. సొరంగం నిర్మాణం కోసం ఎలాన్ మస్క్ చేపట్టిన వెంచర్‌కు కూడా స్టీవ్ డేవిస్ నాయకత్వం వహిస్తున్నారు. దీంతో పాటు, అతను ట్విట్టర్ డీల్‌లో కూడా చాలా చురుగ్గా ఉన్నారు. ది ప్లేఫార్మర్ రిపోర్ట్ ప్రకారం... ట్విట్టర్‌లో కొత్త ఉద్వాసనలకు కూడా డేవిస్ సహాయం చేశారు.
ట్విట్టర్ ఖర్చుల్లో దాదాపు $1 బిలియన్లను తగ్గించడం ద్వారా అందరి అంచనాలను డేవిస్ అధిగమించారు, మస్క్‌కి చాలా సన్నిహితుడిగా మారారు. అంతేకాదు, మస్క్ చేసేంత కఠిన శ్రమను కూడా డేవిస్ అనుకరించాడు. తన భార్య, పసివాడితో కలిసి ట్విట్టర్ ఆఫీసులోనే ఉంటూ, ట్విట్టర్ కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డారు. రాత్రిళ్లు ట్విట్టర్ ఆఫీసులోనే నిద్ర పోతూ పని చేస్తున్న ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలిచారు. ఇదొక్కటే కాదు, ఇంకా చాలా విషయాల్లో మస్క్ పెట్టిన కఠిన పరీక్షలను విజయవంతంగా ఎదుర్కొన్నారు.
ది ప్లాట్‌ఫార్మర్ ప్రకారం, మస్క్ అతనికి CEO పదవిని బహుమతిగా ఇస్తారని ఊహాగానాలు పెరుగుతున్నాయి.
PPF: పీపీఎఫ్ వడ్డీ పెరగలేదు, అయినా ఇతర పథకాల కంటే ఎక్కువ ఎలా సంపాదించవచ్చు?
OYO IPO: దీపావళి నాటికి ఓయో ఐపీవో, ₹5,000 కోట్ల టార్గెట్!
Bank Holidays list in April: ఏప్రిల్‌లో బ్యాంక్‌లు 15 రోజులు పని చేయవు, లిస్ట్ చూడండి
Stock Market: వచ్చే వారంలో 3 రోజులే ట్రేడింగ్, 4 రోజులు సెలవులు
SCSS: సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో వడ్డీ, పెట్టుబడి పరిమితి రెండూ పెరిగాయి
మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?
Pawan Kalyan Movie Title : అబ్బాయి అకీరా నందన్ బర్త్ డేకు పవన్ కళ్యాణ్ కొత్త సినిమా టైటిల్?
Pushpa 2 OTT Rights Price : 'పుష్ప 2' ఓటీటీ రైట్స్‌కు 200 కోట్లు - ఇదంతా 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ మహిమేనా?
Excise Department: మద్యం అమ్మకాలతో మస్తు పైసల్ - సర్కారు ఖజానాకు మందుబాబులే పెద్దదిక్కు