News
News
X

TV Prices: టీవీలు మరింత చవగ్గా వస్తాయ్‌, తొందరపడి ఇప్పుడే కొనకండి

కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడం వల్ల టీవీల ధరలు దాదాపు 3,000 రూపాయల వరకు తగ్గవచ్చని టీవీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

FOLLOW US: 
Share:

TV Prices: మన దేశంలో టెలివిజన్‌ రేట్లు తగ్గబోతున్నాయి. దిగుమతి చేసుకున్న విడిభాగాల మీద బేసిక్‌ కస్టమ్స్ డ్యూటీని (BCD) 5 శాతం నుంచి 2.5 శాతానికి కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తుండడంతో, దేశీయంగా తయారయ్యే టెలివిజన్ సెట్లు 5 శాతం వరకు చౌకగా మారనున్నాయి.

2023-24 బడ్జెట్‌ ప్రసంగంలో, "టెలివిజన్ల తయారీలో విలువ జోడింపును ప్రోత్సహించడానికి, టీవీ ప్యానెళ్ల ఓపెన్ సెల్స్ భాగాల మీద బేసిక్‌ కస్టమ్స్ డ్యూటీని 2.5 శాతానికి తగ్గించాలని నేను ప్రతిపాదిస్తున్నా" అని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు.

అంతకు ముందు, 2019 సెప్టెంబర్‌లో, ఓపెన్ సెల్‌ మీద ఎక్సైజ్‌ సుంకాన్ని ఏడాది పాటు కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఒక సంవత్సరం తర్వాత 2020లో మళ్లీ ఆ సుంకాన్ని పునరుద్ధరించింది. ఇప్పుడు అదే సుంకాన్ని 5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించింది.

రూ. 3 వేల వరకు తగ్గింపు
మొత్తంగా చూస్తే, కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడం వల్ల టీవీల ధరలు దాదాపు 3,000 రూపాయల వరకు తగ్గవచ్చని టీవీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ఒక LED టీవీ సెట్‌ తయారీకి అయ్యే మొత్తం ఖర్చులో 60 నుంచి 70 శాతం వరకు ఓపెన్ సెల్ ప్యానెల్స్‌ కోసం చేసే వ్యయమే ఉంటుంది. చాలా టీవీ తయారీ కంపెనీలు ఈ ప్యానెల్స్‌ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి.

"ఇది టీవీ పరిశ్రమకు మంచి ముందడుగు, దేశీయ తయారీకి ప్రోత్సాహంగా ఉంటుంది. ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు కంపెనీలు అందిస్తాయి" - కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (CEAMA) ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగాంజా

రేట్లు తగ్గించడానికి రెడీ
భారత మార్కెట్‌లో బ్లూపంక్ట్, థామ్సన్, కొడాక్, వైట్ వెస్టింగ్‌ హౌస్‌ సహా అంతర్జాతీయ బ్రాండ్స్‌కు లైసెన్స్‌లు ఉన్న సూపర్ ప్లాస్ట్రోనిక్ ప్రైవేట్ లిమిటెడ్ (SSPL), కస్టమ్స్ సుంకాన్ని 2.5 శాతానికి తగ్గించడం వల్ల టీవీ సెట్ తుది ధర 5 శాతం తగ్గుతుందని చెబుతోంది. లార్జ్‌ స్క్రీన్‌ టెలివిజన్ ధరలు రూ. 3,000 వరకు తగ్గుతాయని, ఈ ప్రయోజనాన్ని వినియోగదారులకు అందజేస్తామని ప్రకటించింది. 

సోనీ (Sony), పానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ‍‌(Panasonic Life Solutions), హెయిర్ అప్లయన్సెస్ ‍‌(Haier Appliances) కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి. టెలివిజన్ పరిశ్రమకు ఇది పెద్ద ప్రోత్సాహమని, భారతదేశంలో తమ  భవిష్యత్తు వ్యాపార ప్రణాళికలపై ఆశాజనకంగా ఉన్నట్లు వెల్లడించాయి.

Daiwa, Shinco బ్రాండ్స్‌ను అమ్మే వీడియోటెక్స్ ఇంటర్నేషనల్ (Videotex International) కూడా బడ్జెట్‌ను ప్రశంసించింది. Realme, Toshiba, Lloyd, Compaq, BPL, Hyundai సహా 15కి పైగా ప్రముఖ బ్రాండ్‌లకు ఈ కంపెనీ OEM/ODM గా వ్యవహరిస్తోంది.

తాజాగా, కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ రిపోర్ట్‌ ప్రకారం...2022 జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారతదేశంలో స్మార్ట్ టీవీ మార్కెట్ గత సంవత్సరం ఇదే కాలం కంటే 38 శాతం వృద్ధిని నమోదు చేసింది.

భారతదేశ స్మార్ట్ టీవీ విభాగంలో గ్లోబల్ బ్రాండ్లది 40 శాతం వాటా, వీటిదే అగ్ర స్థానం. చైనీస్ బ్రాండ్లు 38 శాతం వాటాతో రెండో స్థానంలో ఉన్నాయి. భారతీయ బ్రాండ్లు వేగంగా వృద్ధి చెందుతున్నాయి, మొత్తం స్మార్ట్ టీవీ షిప్‌మెంట్స్‌లో వాటి వాటా 22 శాతానికి పెరిగింది. 

Published at : 02 Feb 2023 11:53 AM (IST) Tags: Budget 2023 TV prices basic customs duty TV prices Cheaper LED TV

సంబంధిత కథనాలు

Petrol-Diesel Price 26 March 2023: పెట్రోల్‌ రేట్లతో జనం పరేషాన్‌, తిరుపతిలో భారీగా జంప్‌

Petrol-Diesel Price 26 March 2023: పెట్రోల్‌ రేట్లతో జనం పరేషాన్‌, తిరుపతిలో భారీగా జంప్‌

Gold-Silver Price 26 March 2023: బంగారం శాంతించినా వెండి పరుగు ఆగలేదు, ₹76 వేల మార్క్‌ను చేరింది

Gold-Silver Price 26 March 2023: బంగారం శాంతించినా వెండి పరుగు ఆగలేదు, ₹76 వేల మార్క్‌ను చేరింది

Mercedes Benz: కొత్త కారుకు షిఫ్ట్ అయిన ప్రధాని మోదీ - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ధర ఎంత?

Mercedes Benz: కొత్త కారుకు షిఫ్ట్ అయిన ప్రధాని మోదీ - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ధర ఎంత?

RBI: ఏప్రిల్‌ 3-6 తేదీల్లో MPC భేటీ, వడ్డీ రేట్లు ఇంకా పెరుగుతాయా?

RBI: ఏప్రిల్‌ 3-6 తేదీల్లో MPC భేటీ, వడ్డీ రేట్లు ఇంకా పెరుగుతాయా?

Vedanta: డబ్బు కోసం వేదాంత పడుతున్న పాట్లు వర్ణనాతీతం, RBI అనుమతి కోసం విజ్ఞప్తి

Vedanta: డబ్బు కోసం వేదాంత పడుతున్న పాట్లు వర్ణనాతీతం, RBI అనుమతి కోసం విజ్ఞప్తి

టాప్ స్టోరీస్

BRS Leaders Fight : ఎల్బీనగర్ బీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరు, మంత్రి కేటీఆర్ సమక్షంలోనే ఘర్షణ

BRS Leaders Fight : ఎల్బీనగర్ బీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరు, మంత్రి కేటీఆర్ సమక్షంలోనే ఘర్షణ

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

TTD News: ఏడుకొండల్లో పెరిగిన రద్దీ, వీకెండ్ వల్ల 26 కంపార్ట్మెంట్లల్లో భక్తులు - దర్శన సమయం ఎంతంటే

TTD News: ఏడుకొండల్లో పెరిగిన రద్దీ, వీకెండ్ వల్ల 26 కంపార్ట్మెంట్లల్లో భక్తులు - దర్శన సమయం ఎంతంటే

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే