అన్వేషించండి

Stock Market: సహనం ఉంటే స్టాక్‌ మార్కెట్‌లో లాభాలే లాభాలు, ఇదిగో ప్రూఫ్‌

2020 మార్చి నుంచి ఇప్పటివరకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 150% పెరిగింది.

Stock Market Update: కొవిడ్‌ టైమ్‌లో స్టాక్‌ మార్కెట్లు పేకమేడలా కుప్పకూలాయి. ఆ రాక్‌ బాటమ్‌ రేంజ్‌ నుంచి ఇప్పటివరకు, బెంచ్‌మార్క్ సెన్సెక్స్ దాదాపు మూడు రెట్లు పెరిగింది, 65,000 మార్క్‌ను దాటింది. ఈ ప్రయాణంలో, సెన్సెక్స్‌30లోని 25 స్టాక్స్‌ మల్టీబ్యాగర్‌ రిటర్న్స్‌ ఇచ్చాయి.

2020 మార్చి నుంచి ఇప్పటివరకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 150% పెరిగింది. ఇవాళ (మంగళవారం, 04 జులై 2023) జీవితకాల గరిష్ఠ స్థాయి 65,586.60 పాయింట్లను టచ్‌ చేసింది.

సెన్సెక్స్‌లో భాగమైన 4 టాటా గ్రూప్ కంపెనీల్లో 3 కంపెనీలు, కొవిడ్ నుంచి ఇప్పటివరకు, ఇండెక్స్-బీటింగ్ రిటర్న్స్ ఇచ్చాయి. అవి టాటా మోటార్స్, టాటా స్టీల్, టైటన్ కంపెనీ.

కంపెనీ పేరు ------------- 2020 మార్చి నుంచి ఇప్పటివరకు రిటర్న్స్‌

టాటా మోటార్స్ ------------------- 754%
మహీంద్ర & మహీంద్ర------------ 395%
టాటా స్టీల్------------------------- 313%
ఇండస్‌ఇండ్ బ్యాంక్--------------- 309%
టైటాన్ కంపెనీ--------------------- 282%
లార్సెన్ & టూబ్రో--------------- 242%
బజాజ్ ఫిన్‌సర్వ్------------------- 232%
ICICI బ్యాంక్---------------------- 229%
సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్---- 225%
యాక్సిస్ బ్యాంక్------------------ 220%

సెన్సెక్స్‌లో అత్యధికంగా లాభాలు తెచ్చి పెట్టిన స్టాక్ టాటా మోటార్స్. దీని విలువ 202 మార్చి కనిష్ట స్థాయి నుంచి ఇప్పటి వరకు దాదాపు 8 రెట్లు పెరిగింది. దీని తర్వాత, మహీంద్ర & మహీంద్ర కౌంటర్‌ దాదాపు 5 రెట్ల ‍లాభాలను కళ్లజూసింది. 

ఎకానమీ పుంజుకున్న తర్వాత, సొంత వాహనాలకు, ముఖ్యంగా ప్రీమియం ఫోర్‌ వీలర్ల డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. ఈ మార్పు కారణంగా ఆటోమొబైల్ మేజర్ల ఆదాయాలు & షేర్ల ధరలు స్పీడ్‌ ట్రాక్‌ ఎక్కాయి. టాటా మోటార్స్, M&Mతో పాటు మారుతి సుజుకి ఇండియా కూడా మల్టీబ్యాగర్‌గా మారింది. అయితే, సెన్సెక్స్ కంటే తక్కువ రిటర్న్‌ ఇచ్చింది.

ఇండెక్స్‌లో ఉన్న 6 బ్యాంకుల్లో, కోటక్ మహీంద్ర బ్యాంక్ మినహా, మిగిలిన 5 బ్యాంక్‌లు కొవిడ్‌ కనిష్ట స్థాయిల నుంచి మల్టీబ్యాగర్ రిటర్న్స్‌ అందించాయి. ఈ ఐదు బ్యాంకుల్లో నాలుగు బ్యాంకులు సెన్సెక్స్‌ను ఔట్‌పెర్ఫార్మ్‌ చేశాయి. అవి.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్. ఇవి, 2020 మార్చి నుంచి ఇప్పటి వరకు 215-309% రాబడి సాధించాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ 68% ర్యాలీ చేసింది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) ప్యాక్‌లో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మినహా మిగిలిన కౌంటర్లన్నీ మల్టీబ్యాగర్స్‌గా నిలిచాయి. HCL టెక్నాలజీస్ బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌తో దాదాపు 3 రెట్లు పెరిగింది, నాలుగు అంకెల స్టాక్‌గా మారింది. HCL టెక్నాలజీస్ తర్వాత, ఇన్ఫోసిస్ సెకండ్‌ ప్లేస్‌లో ఉంది. కొవిడ్‌ కనిష్టం నుంచి ఈ స్టాక్ 151% పెరిగింది, సెన్సెక్స్‌ను ఓడించింది. వాల్యుయేషన్ పరమైన ఆందోళనలతో TCS అతి తక్కువ పనితీరు కనబరిచింది. దీనివల్ల ఈ స్టాక్‌ను మల్టీబ్యాగర్‌గా మారలేకపోయింది.

గత ఒక సంవత్సరంలో రెడ్‌ కలర్‌లో కనిపిస్తున్నా, ఇండెక్స్ హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా కొవిడ్ కాలం నుంచి మల్టీబ్యాగర్ రిటర్న్స్‌ ఇచ్చింది. ఈ స్టాక్‌ దాదాపు 3 రెట్లు పెరిగి, సెన్సెక్స్‌ రిటర్న్‌ను దాటింది.

ఇంజినీరింగ్‌ కంపెనీ లార్సెన్ & టూబ్రో (L&T) స్టాక్ విలువ 3 రెట్లు పైగా పెరిగింది, ఈ స్పేస్‌లో టాప్‌ ప్లేస్‌లో ఉంది. 

ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) ప్యాక్‌లో, ITC తన ఇన్వెస్టర్ల డబ్బును దాదాపు 3 రెట్లు పెంచింది. సెక్టార్‌ మోతుబరి HUL షేర్లు మాత్రం 50% కూడా పెరగలేదు.

మరో ఆసక్తికర కథనం: 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Year Ender 2024: టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడుశ్రీతేజ్‌ హెల్త్‌‌ బులెటిన్ రిలీజ్, బిగ్ గుడ్ న్యూస్!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Year Ender 2024: టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
Rains Update Today: బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
బలహీనపడనున్న వాయుగుండం- ఏపీ, తమిళనాడులో మోస్తరు వర్షాలు, తెలంగాణ వాసులకు ఊరట
Adilabad Crime News: బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
బాలికను కిడ్నాప్ చేసి యువకుడు అఘాయిత్యం- స్థానికుల రాళ్లదాడిలో సీఎ, ఎస్ఐలకు గాయాలు
2025 Apple Launching Products: 2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
2025లో యాపిల్ లాంచ్ చేసే ప్రొడక్ట్స్ ఇవే - ఐఫోన్లు కాకుండా ఇంకేం వస్తున్నాయి?
Komatireddy Venkat Reddy: శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించిన మంత్రి కోమటిరెడ్డి, అనంతరం కీలక వ్యాఖ్యలు
Embed widget