News
News
X

LIC Jeevan Akshay Policy: ప్రతి నెలా పెద్ద మొత్తాన్ని అందించే ఎల్‌ఐసీ పెన్షన్‌ ప్లాన్‌ ఇది, పెట్టుబడికి మంచి అవకాశం!

LIC జీవన్ అక్షయ్ పాలసీ పథకాన్ని LIC పునఃప్రారంభించింది. ఈ పాలసీ ప్రకారం మీరు ఒక్క వాయిదా మాత్రమే చెల్లించి, జీవితాంతం సంపాదించవచ్చు.

FOLLOW US: 
 
LIC Jeevan Akshay Policy: మీరు ఉద్యోగస్తులయితే.. పదవీ విరమణ తర్వాత కూడా జీతం తరహాలోనే ప్రతి నెలా పెద్ద మొత్తంలో ఆదాయం కావాలంటే ఒక మంచి ప్లాన్‌ ఉంది. మీరు ఉద్యోగి కాకపోయినా పర్లేదు, ఈ ప్లాన్‌ను మీరు కూడా ఉపయోగించుకోవచ్చు. దివ్యాంగులు కూడా ఈ పాలసీని సద్వినియోగం చేసుకోవచ్చు. 

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ‍(LIC) పెన్షన్‌ ప్లాన్‌ ఇది. దీనిలో పెట్టుబడి పెట్టడం వల్ల, మీరు ప్రతి నెలా దాదాపు 36 వేల రూపాయలు సంపాదించవచ్చు. దీంతో మీ ఇంటి ఖర్చులను సులభంగా భరించవచ్చు. లేదా మీరు కొన్ని ముఖ్యమైన పనిని కూడా చేయవచ్చు. ఈ ప్లాన్‌తో, ఎల్‌ఐసి తన పెట్టుబడిదారులకు ప్రతి నెలా సంపాదించే అవకాశాన్ని కల్పిస్తోంది. దీనివల్ల జీవిత భద్రత, ఆర్థిక భద్రత రెండూ సాధ్యమవుతాయి.

ఎల్‌ఐసీ జీవన్ అక్షయ్ పాలసీ
LIC జీవన్ అక్షయ్ పాలసీ పథకాన్ని LIC పునఃప్రారంభించింది. ఈ పాలసీ ప్రకారం మీరు ఒక్క వాయిదా మాత్రమే చెల్లించి, జీవితాంతం సంపాదించవచ్చు. సింగిల్ ప్రీమియం నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్‌, యాన్యుటీ ప్లాన్ ఇది.

ఈ పాలసీలో, మీరు ప్రతి నెలా రూ. 36,000 పొందడానికి, యూనిఫాం రేటుతో జీవితాంతం చెల్లింపు యాన్యుటీ ఆప్షన్‌ తీసుకోవాలి. ఉదాహరణకు.. మీ వయస్సు 45 ఏళ్ల సంవత్సరాల ఉండి ఈ ప్లాన్‌ని తీసుకోవాలి అనుకుంటే.. రూ. 70 లక్షల సమ్‌ అస్యూర్డ్‌ ఆప్షన్‌ ఎంచుకోండి. ఇందులో 71,26,000 రూపాయల సింగిల్‌ పేమెంట్‌ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ప్రతి నెలా రూ. 36,429 పెన్షన్ వస్తుంది. అనుకోని కారణాల వల్ల పాలసీదారు చనిపోతే, పింఛను ఆగిపోతుంది.

News Reels

ఏ వయస్సుల వారికి?
35 సంవత్సరాల నుంచి 85 సంవత్సరాల వయస్సు గల వారు ఈ LIC ప్లాన్‌ని తీసుకోవచ్చు. 

ఏడాది నుంచి నెల వరకు ఆప్షన్లు
వివిధ మార్గాల్లో పెన్షన్ పొందే ఆప్షన్లు ఈ పాలసీలో ఉన్నాయి. ఏడాది పింఛను మొత్తాన్ని ఒకేసారి తీసుకోవచ్చు. ఆరు నెలలకు ఒకసారి, మూడు నెలలకు ఒకసారి తీసుకోవచ్చు, లేదా నెలనెలా పింఛను పొందే ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి. మీకు 75 ఏళ్లు ఉండి, ఈ పాలసీ తీసుకోవాలని అనుకుంటే... మీరు రూ.6,10,800 ఏకమొత్తం ప్రీమియం చెల్లించాలి. దీనిపై సమ్‌ అస్యూర్డ్‌ ఆప్షన్‌ రూ. 6 లక్షలు. ఇందులో.. ఏడాది పింఛను రూ. 76,650, అర్ధ వార్షిక పింఛను రూ. 37,035, త్రైమాసిక (3 నెలలు) పింఛను రూ. 18,225. నెలవారీ పింఛను 6 వేల రూపాయలు మీకు అందుతుంది. 

తక్కువ పెట్టుబడి ఎంపిక
కేవలం 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టడం ద్వారా ప్రతి నెలా సంపాదించవచ్చు. 1 లక్ష రూపాయల పెట్టుబడిపై ప్రతి సంవత్సరం 12000 రూపాయలు పొందుతారు. మీ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే, ఇతర పెట్టుబడి ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చు. ఈ పథకంలో గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు.

Published at : 14 Nov 2022 01:01 PM (IST) Tags: lic policy LIC Jeevan Akshay Policy LIC Pension Plan LIC policy status LIC policy number

సంబంధిత కథనాలు

Gold ATM : ఈ ఏటీఎంలో బంగారం వస్తుంది, దేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎం హైదరాబాద్ లో!

Gold ATM : ఈ ఏటీఎంలో బంగారం వస్తుంది, దేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎం హైదరాబాద్ లో!

Gold-Silver Price 04 December 2022: చెన్నైలో ₹55 వేలకు చేరువగా స్వర్ణం, దానితో పోలిస్తే హైదరాబాద్‌లోనే రేటు తక్కువ

Gold-Silver Price 04 December 2022: చెన్నైలో ₹55 వేలకు చేరువగా స్వర్ణం, దానితో పోలిస్తే హైదరాబాద్‌లోనే రేటు తక్కువ

Petrol-Diesel Price, 04 December 2022: భారీగా పతనమైన గ్లోబల్‌ క్రూడ్‌ రేటు - మీ ఏరియాలో లీటరు పెట్రోలు ధర ఇదీ!

Petrol-Diesel Price, 04 December 2022: భారీగా పతనమైన గ్లోబల్‌ క్రూడ్‌ రేటు - మీ ఏరియాలో లీటరు పెట్రోలు ధర ఇదీ!

FD interest rate: రెండేళ్ల ఎఫ్‌డీ - పోస్టాఫీస్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీలో ఎక్కువ వడ్డీ ఇచ్చేదెవరు?

FD interest rate: రెండేళ్ల ఎఫ్‌డీ - పోస్టాఫీస్‌, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీలో ఎక్కువ వడ్డీ ఇచ్చేదెవరు?

Cryptocurrency Prices: ఫ్లాట్‌గా క్రిప్టో ట్రేడింగ్‌! రూ.5 వేలు పెరిగిన బిట్‌కాయిన్‌

Cryptocurrency Prices: ఫ్లాట్‌గా క్రిప్టో ట్రేడింగ్‌! రూ.5 వేలు పెరిగిన బిట్‌కాయిన్‌

టాప్ స్టోరీస్

CM KCR : నేడు మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం కేసీఆర్, బహిరంగ సభలో కేంద్రాన్ని టార్గెట్ చేస్తారా?

CM KCR : నేడు మహబూబ్ నగర్ జిల్లాకు సీఎం కేసీఆర్, బహిరంగ సభలో కేంద్రాన్ని టార్గెట్ చేస్తారా?

MP Raghurama Krishna Raju: మంత్రుల రికార్డింగ్ డ్యాన్సులతో ఏపీకి పెట్టుబడులు వస్తాయా? - ఎంపీ రఘురామ

MP Raghurama Krishna Raju: మంత్రుల రికార్డింగ్ డ్యాన్సులతో ఏపీకి పెట్టుబడులు వస్తాయా? - ఎంపీ రఘురామ

Pawan Kalyan Next Movie: గ్యాంగ్‌స్టర్‌గా పవన్, జపనీస్ లైన్ అర్థం ఏమిటో తెలుసా? పోస్టర్‌లో హింట్స్ గమనించారా?

Pawan Kalyan Next Movie: గ్యాంగ్‌స్టర్‌గా పవన్, జపనీస్ లైన్ అర్థం ఏమిటో తెలుసా? పోస్టర్‌లో హింట్స్ గమనించారా?

Samantha: ఆమె మహానటి అంటూ టాలీవుడ్ దిగ్గజ నిర్మాతల ప్రశంసలు, సమంత స్పందన ఇది

Samantha: ఆమె మహానటి అంటూ టాలీవుడ్ దిగ్గజ నిర్మాతల ప్రశంసలు, సమంత స్పందన ఇది