Profitable Companies: మన దేశంలో అత్యధిక లాభాలు ఆర్జిస్తున్న కంపెనీలు ఇవి - టాప్ ప్లేస్‌లో రిలయన్స్
Most Profitable Companies: FY24లో, నిఫ్టీ50 కంపెనీల PAT రూ. 8.14 లక్షల కోట్లుగా నమోదైంది. విడివిడిగా చూస్తే, రూ. 50 వేల కోట్ల కంటే ఎక్కువ లాభాలు ఆర్జించిన కంపెనీలు 4 ఉన్నాయి.
![Profitable Companies: మన దేశంలో అత్యధిక లాభాలు ఆర్జిస్తున్న కంపెనీలు ఇవి - టాప్ ప్లేస్‌లో రిలయన్స్ these are most profitable companies in india in 2024 reliance industries at top of the list Profitable Companies: మన దేశంలో అత్యధిక లాభాలు ఆర్జిస్తున్న కంపెనీలు ఇవి - టాప్ ప్లేస్‌లో రిలయన్స్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/29/ba5afb9e54d7d23ef450af31b35b52141719653446475545_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Most Profitable Companies In India: గత ఆర్థిక సంవత్సరం (FY24) ఇండియన్ కార్పొరేట్ కంపెనీలకు అద్భుతంగా గడిచింది. నిఫ్టీ50 కంపెనీల "పన్ను తర్వాతి లాభం" (PAT) FY23లోని రూ. 6.39 లక్షల కోట్ల నుంచి 27% పెరిగి FY24లో రూ. 8.14 లక్షల కోట్లకు చేరుకుంది. ఈ 50 కంపెనీల్లో 49 కంపెనీలు లాభాలను నమోదు చేయగా, గత ఆర్థిక సంవత్సరంలో ఒక్కటి మాత్రమే నష్టాన్ని చవిచూసింది. నిఫ్టీ50 కంపెనీల మొత్తం లాభంలో, టాప్-10 కంపెనీలదే దాదాపు 60% వాటా.
FY24లో, అత్యధిక లాభాలు ఆర్జించిన టాప్-10 కంపెనీలు ఇవి:
ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) స్టాక్ మార్కెట్‌లో లిస్టయిన అతి పెద్ద కంపెనీగా మాత్రమే కాకుండా, లాభాల ఆర్జనలోనూ ముందంజలో ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో (FY24), రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 78,633 కోట్ల వార్షిక లాభంతో (PAT) తొలి స్థానంలో నిలిచింది. దీని PAT FY23లోని రూ. 73,646 నుంచి 7% పెరిగింది.
అతి పెద్ద ప్రభుత్వ రంగ రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), లాభదాయకత విషయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత నిలిచింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభం వార్షిక ప్రాతిపదికన 20 శాతం పెరిగి రూ. 68,138 కోట్లకు చేరుకుంది. అంతకుముందు ఏడాది లాభం రూ. 56,558 కోట్లు.
మార్కెట్ క్యాప్ పరంగా భారతదేశంలో అతి పెద్ద బ్యాంక్‌గా కీర్తి గడించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank), లాభాల విషయంలో మూడో స్థానంలో ఉంది. ఈ ప్రైవేట్ బ్యాంక్ గత ఆర్థిక సంవత్సరంలో రూ. 65,446 కోట్ల లాభాన్ని ఆర్జించింది, వార్షిక లాభం 42% పెరిగింది.
ప్రభుత్వ చమురు సంస్థ ఆయిల్ & నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), 31 మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రూ. 54,705 కోట్ల లాభాన్ని మిగిల్చుకుంది. 2022-23 ఆర్థిక సంవత్సరం కంటే ఈ మొత్తం 61 శాతం ఎక్కువ కావడం విశేషం. లాభాల పరంగా, ఈ ప్రభుత్వ రంగ కంపెనీ భారత్‌లో నాలుగో అతి పెద్ద సంస్థ.
దేశంలో అతి పెద్ద IT కంపెనీ & రెండో అతి పెద్ద లిస్టెడ్ కంపెనీ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (Tata Consultancy Services - TCS), లాభదాయక కంపెనీల లిస్ట్‌లో ఐదో ర్యాంక్ సాధించింది. టాటా గ్రూప్‌నకు చెందిన ఈ కీలక కంపెనీ PAT FY24లో 9% పెరిగింది. ఆ ఆర్థిక సంవత్సరంలో రూ. 46,099 కోట్ల లాభం గడించింది.
ప్రైవేట్ రంగానికే చెందిన మరో పెద్ద రుణదాత ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank), అత్యధిక లాభాలను ఆర్జించడంలో ఆరో స్థానంలో ఉంది. 2-23-24 ఆర్థిక సంవత్సరంలో ఐసీఐసీఐ బ్యాంక్‌కు వచ్చిన ప్రాఫిట్ రూ. 45,006 కోట్లు.
గత ఆర్థిక సంవత్సరంలో రూ. 41,615 కోట్ల లాభాన్ని ఆర్జించిన ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ (IOC) ఈ లిస్ట్‌లో సెవెన్త్ ప్లేస్‌లో ఉంది. ఈ కంపెనీ లాభాలు, వార్షిక ప్రాతిపదికన, అత్యద్భుతంగా 284 శాతం పెరిగాయి.
మరో ఆసక్తికర కథనం: పర్సనల్ లోన్ పెనుభారం - పోటాపోటీగా వడ్డీ రేట్లు పెంచుతున్న బ్యాంక్‌లు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)