search
×

Loan Burden: పర్సనల్‌ లోన్‌ పెనుభారం - పోటాపోటీగా వడ్డీ రేట్లు పెంచుతున్న బ్యాంక్‌లు

Personal Loan Rates: వ్యక్తిగత రుణాలు భారంగా మారుతున్నాయి. ప్రైవేట్‌ రంగంలోని పెద్ద బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాయి. దీనికి కారణమేంటని చూస్తే, అన్ని వేళ్లు రిజర్వ్ బ్యాంక్‌ను చూపిస్తున్నాయి.

FOLLOW US: 
Share:

Personal Loan Interest Rates Hike: దాదాపు ఏడాదిన్నర కాలంగా రిజర్వ్ బ్యాంక్ తన రెపో రేట్‌లో (RBI Repo Rate) ఎలాంటి మార్పు చేయలేదు. అయినప్పటికీ, బ్యాంక్‌ రుణాలపై వడ్డీ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి, లోన్‌ తీసుకోవడం ఖరీదైన వ్యవహారంగా మారుతోంది. దేశంలో, ఇప్పటికే అన్ని రకాల బ్యాంక్‌ లోన్లపై గరిష్ట వడ్డీ రేట్లు అమల్లో ఉన్నాయి. ఇటీవల, కొన్ని బ్యాంకులు కొన్ని రకాల రుణాలపై, ముఖ్యంగా పర్సనల్‌ లోన్లపై వడ్డీ రేట్లను పోటీ పడి పెంచాయి. 

వడ్డీ రేట్లు పెంచిన బ్యాంక్‌లు
దేశంలోని అతి పెద్ద రుణదాత అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) మొదలుకొని ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank), యాక్సిస్ బ్యాంక్ (Axis Bank), కోటక్ మహీంద్రా (Kotak Mahindra Bank) బ్యాంక్ వంటి కీలక సంస్థలు వ్యక్తిగత రుణ ఖర్చులను ఖరీదుగా మార్చాయి. ఈ ప్రధాన ప్రైవేట్ రంగ బ్యాంకులు, ఇటీవల, పర్సనల్‌ లోన్‌ రేట్లను 30 బేసిస్‌ పాయింట్ల (bps) నుంచి 50 బేసిస్ పాయింట్ల వరకు పెంచాయి. అంటే, నాలుగు అతి పెద్ద ప్రైవేట్ బ్యాంకుల వ్యక్తిగత రుణాలు ఇప్పుడు 0.30 శాతం నుంచి 0.50 శాతం వరకు పెరిగాయి.

ప్రారంభ వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయ్..
దేశంలో అతి పెద్దదైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పర్సనల్ లోన్ వడ్డీ రేట్లను 0.40 శాతం పెంచింది. ఇప్పుడు, ఈ బ్యాంకులో వ్యక్తిగత రుణంపై వడ్డీ రేటు 10.75 శాతం నుంచి ప్రారంభమవుతుంది. యాక్సిస్ బ్యాంక్, తాను జారీ చేసే వ్యక్తిగత రుణాలపై ప్రారంభ వడ్డీ రేటును 10.49 శాతం నుంచి 10.99 శాతానికి పెంచింది. ఐసీఐసీఐ బ్యాంక్ ప్రారంభ వడ్డీ రేటు 10.50 శాతం నుంచి 10.80 శాతానికి చేరింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ పర్సనల్‌ లోన్‌పై కనిష్ట వడ్డీ రేటు 10.50 శాతం నుంచి 10.99 శాతానికి పెరిగింది.

రెపో రేట్‌ స్థిరంగా ఉన్నా ఎందుకీ పెరుగుదల?
రిజర్వ్ బ్యాంక్, ఒకటిన్నర సంవత్సరాలుగా రెపో రేట్‌ను స్థిరంగా కొనసాగిస్తోంది. ఇప్పుడు, మరికొన్ని నెలల్లో దేశంలో వడ్డీ రేట్లు తగ్గడం ప్రారంభం అవుతుందన్నన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వడ్డీ రేట్లు తగ్గాల్సింది పోయి ఎలా పెరుగుతున్నాయి అన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది. దీనికి సమాధానం కూడా కేంద్ర బ్యాంక్‌ దగ్గరే ఉంది. రిజర్వ్ బ్యాంక్ చేసిన నియంత్రణ పరమైన మార్పుల కారణంగా వివిధ బ్యాంకులు వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి.

కారణం ఇదే..
రిజర్వ్ బ్యాంక్, దేశంలోని బ్యాంక్‌లు ఇచ్చే వ్యక్తిగత రుణాల విషయంలో రిస్క్ వెయిటేజీని పెంచింది. ఇంతకు ముందు పర్సనల్ లోన్ రిస్క్ వెయిటింగ్ రేటు 100 శాతంగా ఉండేది. 2023 నవంబర్ నుంచి కేంద్ర బ్యాంక్ దీనిని 125 శాతానికి పెంచింది. దీనివల్ల, బ్యాంక్‌లపై భారం పెరిగింది. బ్యాంకులు, ఈ భారాన్ని తాము భరించకుండా, లోన్‌ కోసం వచ్చే కస్టమర్లపైకి నెడుతున్నాయి. ఈ కారణంగా వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లోనూ వ్యక్తిగత రుణాలు మరింత ఖరీదుగా మారే అవకాశం ఉంది. అంతేకాదు, వడ్డీ రేట్లను పెంచే బ్యాంకుల జాబితా కూడా పెద్దది కావచ్చు.

మరో ఆసక్తికర కథనం: యూపీఐ ద్వారా డబ్బు స్వీకరిస్తున్నారా? ఈ లిమిట్‌ దాటితే ఇన్‌కమ్‌ టాక్స్‌ కట్టాలి

Published at : 29 Jun 2024 02:51 PM (IST) Tags: Personal Loan RBI Interest rates Hike Interest Rates Loan Burden

ఇవి కూడా చూడండి

House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్‌

House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్‌

Gold-Silver Prices Today 21 Nov: రూ.78,000 పైనే పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Gold-Silver Prices Today 21 Nov: రూ.78,000 పైనే పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Provident Fund: ఈపీఎఫ్‌ బకాయిలను మీ కంపెనీ ఎగ్గొట్టిందా?, ఇలా చేస్తే మీ డబ్బు తిరిగొస్తుంది!

Provident Fund: ఈపీఎఫ్‌ బకాయిలను మీ కంపెనీ ఎగ్గొట్టిందా?, ఇలా చేస్తే మీ డబ్బు తిరిగొస్తుంది!

Investment Tips: పిల్లల చదువు ఖర్చుల కోసం మీరు కష్టపడొద్దు, మార్కెట్‌కు ఆ పని అప్పజెప్పండి

Investment Tips: పిల్లల చదువు ఖర్చుల కోసం మీరు కష్టపడొద్దు, మార్కెట్‌కు ఆ పని అప్పజెప్పండి

Gold-Silver Prices Today 20 Nov: యుద్ధభయంతో పెరుగున్న పసిడి - ఏపీ, తెలంగాణలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Gold-Silver Prices Today 20 Nov: యుద్ధభయంతో పెరుగున్న పసిడి - ఏపీ, తెలంగాణలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

టాప్ స్టోరీస్

Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత

Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత

BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి

BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి

Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు

Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ