By: ABP Desam | Updated at : 07 Sep 2022 09:08 AM (IST)
Edited By: Arunmali
స్పీడ్ పెంచిన ఆటో సెక్టార్ స్టాక్స్ (ఇమేజ్ సోర్స్ - ట్విట్టర్)
Auto sector: దేశంలో, మీడియం & హెవీ కమర్షియల్ వెహికల్ (M&HCV) విభాగంలో మొదటి CNG ట్రక్‌ని టాటా మోటార్స్ లాంచ్ చేసింది. లాజిస్టిక్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్ల నుంచి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ బండిని తీసుకొచ్చిన టాటా మోటార్స్ కాలర్ ఎగరేసింది.
వివిధ అవసరాల కోసం, ఇంటర్మీడియరీ & లైట్ కమర్షియల్ వెహికల్ (I&LCV) విభాగంలోనూ ఏడు రకాల ట్రక్కులను రోడ్ల మీదకు తీసుకొచ్చింది. ఈ ఫ్లీట్ న్యూ ఏజ్ అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ (DMS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) సహా అనేక ఫీచర్లు ఈ బండ్లలో ఉన్నాయి. టాటా మోటార్స్ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో... ప్యాసింజర్ కార్లు, ట్రక్కులు, వ్యాన్‌లు, కోచ్‌లు, బస్సులు, లగ్జరీ కార్లు, స్పోర్ట్స్ కార్లు ఉన్నాయి.
లాజిస్టిక్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెగ్మెంట్ల నుంచి పెరుగుతున్న డిమాండ్, మొత్తం పరిశ్రమను స్పీడ్ ట్రాక్ మీదకు ఎక్కించగలదు. ఈ నేపథ్యంలో, టాటా మోటార్స్ సహా 5 మేజర్ కమర్షియల్ వెహికల్స్ షేర్ల ఔట్‌లుక్ ఇది:
టాటా మోటార్స్ (TATAMOTORS)
ఔట్‌లుక్ : 200 DMA మద్దతును పరీక్షిస్తోంది
ఈ స్టాక్ 2021లో 161 శాతం లాభపడింది, కొత్త 52 వారాల గరిష్ట స్థాయి రూ.536.70కి చేరుకుంది. అయితే, 2022లో ఇప్పటివరకు (YTD) 5 శాతం పడిపోయింది. గత నెల రోజుల్లో 2 శాతం నష్టపోయింది.
ఆగస్టులో, రూ.457 మార్కు వద్ద 200 డేస్ మూవింగ్ యావరేజ్‌ని (DMA) బలంగా దాటిన ఈ షేరు, అదే మద్దతు స్థాయిని పరీక్షించడానికి వెనక్కు తిరిగి వస్తోంది. టెక్నికల్ ఓసిలేటర్ 'రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్' (RSI) బలహీనంగా కనిపిస్తున్నప్పటికీ, అమ్మకాల ఒత్తిడిని ఈ స్టాక్ తట్టుకోగలదని ఎక్స్‌పర్ట్‌లు భావిస్తున్నారు.
చాలా అమ్మకాల సందర్భాల్లో, రూ.420 మద్దతు స్థాయి స్టాక్ ప్రైజ్‌ని రక్షించింది. ఇమీడియట్ కుషన్ రూ.440 వద్ద ఉంది. ఒకవేళ స్టాక్ రివర్స్ అయితే రూ.480 స్థాయి దగ్గర అడ్డంకిని ఎదుర్కొంటుంది.
అశోక్ లేలాండ్ (ASHOKLEY)
టార్గెట్: రూ.190
వృద్ధి అవకాశం: 13%
ఈ స్టాక్ గత నెల రోజుల్లో 14 శాతం పెరిగింది. గత ఆరు నెలల్లో 67 శాతం, 2022లో ఇప్పటివరకు 29 శాతం రాబడి కూడగట్టుకుంది.
ఈ షేరు మంగళవారం రూ.169.45 వద్ద కొత్త చరిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరుకుంది. డైలీ చార్ట్ ప్రకారం, ఆగస్టు చివరిలో రూ.150-160 స్థాయిలో అమ్మకాల ఒత్తిడిని విజయవంతంగా అధిగమించింది. దీంతో మొత్తం ట్రెండ్ బలంగా మారింది. ప్రస్తుతం రూ.190 వైపు పయనిస్తున్నట్లు కనిపిస్తోంది.
మహీంద్ర & మహీంద్ర (M&M)
టార్గెట్: రూ.1,500
వృద్ధి అవకాశం: 15%
ఈ స్టాక్ 2009 నుంచి 2022 ఇప్పటివరకు సూపర్ స్పీడ్‌లో ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఈ కౌంటర్ 57 శాతం లాభపడింది. మంగళవారం 52 వారాల గరిష్ట స్థాయి అంచు వరకు వెళ్లి వెనక్కు వచ్చింది. తక్షణ మద్దతు రూ.1,250, ఆ తర్వాత రూ.1,200 స్థాయిల వద్ద ఉంది. సానుకూల సెంటిమెంట్ వల్ల, దీని లక్ష్యం రూ.1,500 స్థాయికి చేరుకోవడం. హయ్యర్ హైస్ - హయ్యర్ లోస్ ఫార్మేషన్‌లో ఉంది కాబట్టి మార్కెట్ పార్టిసిపెంట్ల నుంచి అధిక ఆసక్తిని పొందుతోంది.
ఐషర్ మోటార్స్ (EICHERMOT)
టార్గెట్: రూ.4,000
వృద్ధి అవకాశం: 17%
ఈ స్టాక్ గత నెల రోజుల్లో 9 శాతం, గత ఆరు నెలల్లో 51 శాతం, ఈ ఏడాదిలో ఇప్పటివరకు 25 శాతం పెరిగింది. రూ.3,000 మార్క్‌ను దాటిన తర్వాత మాంచి బుల్ రన్‌ను ప్రారంభించనట్లు వీక్లీ చార్ట్ చూపిస్తోంది. డైలీ చార్ట్‌లో "గోల్డెన్ క్రాస్" నమూనా కనిపించింది, మీడియం టర్మ్ బుల్లిష్‌గా ఉంటుందని ఈ నమూనా అర్ధం. రూ.4,000 మార్కును అందుకోవాలని పరుగులు పెడుతున్న ఈ స్టాక్‌కు మద్దతు రూ.3,150 వద్ద ఉంది.
ఫోర్స్ మోటార్స్ (FORCEMOT)
టార్గెట్: రూ.1,550
వృద్ధి అవకాశం: 15%
ఈ స్టాక్ గత నెల రోజుల్లో 20 శాతం, గత ఆరు నెలల్లో 36 శాతం, ఈ ఏడాదిలో ఇప్పటివరకు 5 శాతం పెరిగింది. డైలీ చార్ట్‌లో "ఇన్‌వెర్స్ హెడ్ & షోల్డర్" బ్రేకవుట్ ఉంది. ఈ ప్యాట్రెన్ ప్రకారం లక్ష్యం రూ.1,550. రూ.1,200 స్థాయిలో మద్దతు ఉంది. RSI ఓవర్‌బాట్ కేటగిరీలో ట్రేడవుతున్నా, అమ్మకాల ఒత్తిడికి ఇది లొంగేలా లేదు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Cryptocurrency Prices: బిట్‌కాయిన్‌కు వరుస నష్టాలు - ఇన్వెస్టర్ల ఆందోళన
Stock Market: ఈ వారం టాప్ 10 కంపెనీలకు రూ.2.28 లక్షల కోట్ల నష్టం
సెకండ్ హ్యాండు కారును అమ్మాలనుకుంటున్నారా? - మంచి రేటు రావాలంటే ఏం చేయాలి?
Petrol-Diesel Price 23 September 2023: స్వల్పంగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు- ఈ ప్రాంతంలో మాత్రం తగ్గుదల
Gold-Silver Price 23 September 2023: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్- మీ నగరాల్లో గోల్డ్ కొనుగోలుకు ఇదే మంచి టైం
ఒకేసారి 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లకు ప్రధాని పచ్చజెండా, తెలుగు రాష్ట్రాలకు రెండు రైళ్లు
BRS Candidates : సమయానికే ఎన్నికలు - అభ్యర్థులూ రెడీ ! బీఆర్ఎస్‌లో సందడేది ?
Chandrababu Arrest: వచ్చేవారం నుంచి యువగళం కొనసాగింపు, టెలీకాన్ఫరెన్స్‌లో నారా లోకేశ్ స్పష్టత
Chandrababu: రెండో రోజు ప్రారంభమైన చంద్రబాబు విచారణ - స్కిల్ కేసులో సీఐడీ ప్రశ్నలు
/body>