అన్వేషించండి

Tata Vs Pakistan: భారతీయ దిగ్గజం భళా - పాకిస్థాన్‌ జీడీపీ కంటే టాటా గ్రూప్‌ విలువే ఎక్కువ

భారతదేశంలో అతి పెద్ద వ్యాపార గ్రూప్‌ టాటా గ్రూప్‌ మార్కెట్ క్యాపిటలైజేషన్ (Market Capitalization of Tata Group) 365 బిలియన్‌ డాలర్లకు చేరింది.

Tata Group Value Vs Pakistan GDP: సాల్ట్ నుంచి సాఫ్ట్‌వేర్ వరకు వివిధ వ్యాపారాల్లో పాతుకుపోయిన టాటా గ్రూప్‌ అరుదైన ఘనత సాధించింది. టాటా గ్రూప్‌ మార్కెట్‌ విలువ (Market Value of Tata Group), పొరుగు దేశం పాకిస్థాన్ మొత్తం ఆర్థిక వ్యవస్థను అధిగమించింది. టాటా గ్రూప్‌లోని అనేక కంపెనీలు గత ఏడాది కాలంగా మారథాన్‌ చేస్తుండడంతో మొత్తం గ్రూప్‌ విలువ భారీ సైజ్‌కు పెరిగింది.

తాజా లెక్క ప్రకారం, భారతదేశంలో అతి పెద్ద వ్యాపార గ్రూప్‌ టాటా గ్రూప్‌ మార్కెట్ క్యాపిటలైజేషన్ (Market Capitalization of Tata Group) 365 బిలియన్‌ డాలర్లకు చేరింది. భారతీయ రూపాయల్లోకి మారిస్తే, టాటా గ్రూప్‌ విలువ రూ. 30.3 లక్షల కోట్లు. పాకిస్థాన్ GDP విలువను 341 బిలియన్‌ డాలర్లుగా IMF (International Monetary Fund) అంచనా వేసింది. దీనిని కూడా రూపాయల్లోకి మారిస్తే సుమారు రూ.28.30 లక్షల కోట్లు అవుతుంది. 

ఈ లెక్కన, పాకిస్థాన్‌ మొత్తం స్థూల జాతీయోత్పత్తి (GDP) కంటే టాటా గ్రూప్‌ మార్కెట్‌ విలువ రూ. 2 లక్షల కోట్లు ఎక్కువగా ఉండటం విశేషం. అంతేకాదు, టాటా గ్రూప్‌ ఫ్లాగ్‌షిప్‌ కంపెనీ TCS (Tata Consultancy Services) మార్కెట్‌ విలువ, దాయాది దేశం జీడీపీలో సగం ఉంది. 

టాటా గ్రూప్‌లో, ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్‌లో నమోదైన కంపెనీలు 25. వీటి విలువే రూ.30.30 లక్షల కోట్లుగా ఉంది. టాటా సన్స్‌, టాటా క్యాపిటల్‌, టాటా ప్లే, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌, ఎయిరిండియా ఇంకా లిస్ట్‌ కాలేదు. వీటి విలువలను కూడా లెక్కలోకి తీసుకుంటే, ఈ దిగ్గజ గ్రూప్‌ మొత్తం మార్కెట్‌ విలువ బాహుబలిలా కనిపిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

టాటా గ్రూప్‌ కంపెనీలు - మార్కెట్‌ విలువ (Tata Group Companies - Market Capitalization)

టీసీఎస్ -- గత ఏడాది కాలంలో (గత 12 నెలల్లో) 16% పెరిగింది. మార్కెట్‌ విలువ రూ. 14,93,981 కోట్లు.

టైటన్ -- గత 12 నెలల్లో 45% లాభపడింది. మార్కెట్‌ విలువ రూ. 3,24,628 కోట్లు.

టాటా మోటార్స్ -- సమీక్ష కాలంలో రెట్టింపు పైగా, 113% జంప్‌ చేసింది. మార్కెట్‌ విలువ రూ. 3,11,970 కోట్లు.

టాటా స్టీల్ -- ఏడాది క్రితం నుంచి ఇప్పటి వరకు 27% పైకి చేరింది. మార్కెట్‌ విలువ రూ. 1,76,283 కోట్లు.

ట్రెంట్ -- దాదాపు రెండు రెట్లు, 195% పెరిగింది. మార్కెట్‌ విలువ రూ. 1,42,970 కోట్లు.

టాటా పవర్ --  గత ఏడాది కాలంలో 83% పెరిగింది. మార్కెట్‌ విలువ రూ. 1,20,193 కోట్లు.

టాటా కన్జ్యూమర్ -- గత 12 నెలల్లో 57% లాభపడింది. మార్కెట్‌ విలువ రూ. 1,09,304 కోట్లు.

ఇండియన్ హోటల్స్  -- సమీక్ష కాలంలో 67% ర్యాలీ చేసింది. మార్కెట్‌ విలువ రూ. 76,495 కోట్లు.

టాటా కమ్యూనికేషన్స్ --  ఏడాది క్రితం నుంచి ఇప్పటి వరకు 43% ఎగబాకింది. మార్కెట్‌ విలువ రూ. 50,201 కోట్లు.

టాటా ఎల్‌క్సీ -- ఒక సంవత్సరంలో 12% లాభాలు అందించింది. మార్కెట్‌ విలువ రూ. 46,771 కోట్లు.

టాటా టెక్నాలజీస్ గతేడాది నవంబర్‌ 30న లిస్ట్‌ అయింది. అప్పట్నుంచి ఇప్పటి వరకు 12% తగ్గింది. దీని మార్కెట్‌ విలువ రూ. 44,849 కోట్లు.

ఓల్టాస్ -- ఈ షేర్లు గత 12 నెలల్లో 24% గెయిన్ అయ్యాయి. కంపెనీ మార్కెట్‌ విలువ రూ. 35430 కోట్లు.

టాటా ఇన్వెస్ట్‌మెంట్‌ -- ఈ మల్టీబ్యాగర్‌ గత ఏడాది కాలంలో 153% పెరిగింది. మార్కెట్‌ విలువ రూ. 28,399 కోట్లు.

భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏటికేడు మెరుగుపడుతుంటే, దీనికి రివర్స్‌లో, పాకిస్థాన్‌లో సంక్షోభం ఎప్పటికప్పుడు ముదురుతోంది. పరిపాలనలో సైనిక జోక్యం, రాజకీయ స్థిరత్వం లేకపోవడం పాకిస్థాన్‌ ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణాలు. 

ప్రస్తుతం, 3.7 లక్షల కోట్ల డాలర్లు లేదా రూ.307 లక్షల కోట్లతో ప్రపంచంలో 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ నిలచింది. 2027-28 నాటికి, ప్రపంచంలో మూడో స్థానానికి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. మరోవైపు, పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో 41వ స్థానంలో ఉంది, ఇది ఇంకా దిగజారే ప్రమాదం ఉంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: స్టాక్‌ మార్కెట్‌లో సైలెన్స్‌ - ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతున్న బెంచ్‌మార్క్‌ ఇండెక్స్‌లు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget