Swiggy Supr Daily: ఉద్యోగులు, కస్టమర్లకు స్విగ్గీ సడెన్ షాక్! ఆ సేవలు సస్పెండ్
Swiggy Supr Daily: ఫుడ్ టెక్ మేజర్ స్విగ్గీ కస్టమర్లకు షాకిచ్చింది! సూపర్ డైలీని (Supr Daily) దిల్లీ, ముంబయి, హైదరాబాద్ సహా మెట్రో నగరాల్లో నిలిపివేస్తున్నామని ప్రకటించింది.
Swiggy Supr Daily: ఫుడ్ టెక్ మేజర్ స్విగ్గీ కస్టమర్లకు షాకిచ్చింది! నిత్యావసర సరుకుల డెలివరీ సేవలు, సూపర్ డైలీని (Supr Daily) దిల్లీ, ముంబయి, హైదరాబాద్ సహా మెట్రో నగరాల్లో నిలిపివేస్తున్నామని ప్రకటించింది. బిజినెస్ ఆపరేషన్స్‌ను రీ అలైన్ చేశాక కొన్ని వ్యాపార సేవలను పూర్తిగా బంద్ చేస్తారని సమాచారం. సూపర్ డైలీ సీఈవో, కో ఫౌండర్ ఫణి కిషన్ అడపల్లి పంపించిన అంతర్గత ఈ మెయిల్ ద్వారా ఈ విషయం తెలిసింది.
మొత్తం 68లో 3 నగరాల్లో స్విగ్గీ జీనీ సేవలు తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని స్విగ్గీ ప్రతినిధి మీడియాకు తెలిపారు. 'క్రికెట్, ఫెస్టివ్ సీజన్లలో ఫుడ్ మార్కెట్ ప్లేస్, ఇన్‌స్టా మార్ట్‌కు విపరీతంగా డిమాండ్ ఉంది. వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తోంది. ఆ ఆర్డర్లను త్వరగా డెలివరీ చేయాల్సి ఉంటోంది. స్విగ్గీ జీనీ సేవలు ప్రభావితం చెందిన నగరాల్లో త్వరలోనే సేవలు ఆరంభిస్తాం' అని కంపెనీ ప్రకటించింది.
'రీ స్ట్రక్చర్‌లో భాగంగా సూపర్ డైలీ (Supr Daily) సేవలను దిల్లీ, ముంబయి, పుణె, హైదరాబాద్, చెన్నైలో నిలిపివేస్తున్నాం. మా యూజర్లు, బ్రాండ్, వెండార్ భాగస్వాములకు ఎక్కువ ఇబ్బంది కలగకుండా వాటి మూసివేత, ట్రాన్సిషన్ ప్లాన్‌ను మేం అమలు చేయబోతున్నాం. బెంగళూరులో మాత్రం సేవలు కొనసాగిస్తాం' అని సూపర్ డైలీ సీఈవో ఫణి కిషన్ అన్నారు.
'రీ స్ట్రక్చర్ చేయడం వల్ల ఈ ఐదు నగరాల్లోని ఉద్యోగులపై ప్రభావం ఉంటుంది. కొందరు కార్పొరేట్ ఉద్యోగులపైనా ఉండబోతోంది. ఆర్గనైజేషన్‌ను మేం రైట్ సైజ్ చేయబోతున్నాం. రీస్ట్రక్చర్ చేయబోయే కంపెనీలో ఎక్కువ మంది ఉద్యోగులకు సంబంధించిన ఉద్యోగ అవకాశాలను మేం గుర్తించాం. స్విగ్గీలో ఉద్యోగులు, మానవ వనరులను ఎంతో గౌరవిస్తాం. పూర్తిగా ట్రాన్సిషన్ సపోర్ట్ అందిస్తాం. ఉద్యోగుల ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి నాతో సహా మేనేజర్లు, ఫంక్షనల్ లీడర్లు, హెచ్‌ఆర్ భాగస్వాములు అందుబాటులో ఉంటారు' అని ఫణి తెలిపారు.
సూపర్ డైలీని 2018లో స్విగ్గీ కొనుగోలు చేసింది. అప్పట్లో ఆ కంపెనీ ముంబయి శివార్లలో రోజుకు 6000 ఆర్డర్లు సర్వ్ చేసేది. స్విగ్గీ కొనుగోలు చేశాక ఫుడ్ డెలివరీ, కన్వీనియెన్స్, గ్రాసరీకి సేవలు విస్తరించింది. గత నాలుగేళ్లుగా ఆరు నగరాల్లో రోజుకు 2 లక్షల ఆర్డర్లను సర్వ్ చేస్తున్నారు.
shoutout to the greatest snack to ever exist pic.twitter.com/c0qC86TEI3
— Swiggy (@swiggy_in) May 4, 2022
planning to change our cover photo. what should it be? 🤔
— Swiggy (@swiggy_in) May 11, 2022